ప్లాస్టిక్ పై యుద్ధం

పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించి, జీవావరణానికి నిశ్శబ్దంగా మరణశాసనం లిఖిస్తున్న ప్లాస్టిక్ భూతం ఏటికేడు భయానకంగా జడలు విరబోసుకుంటోంది. ప్రాసిక్ కాలుష్యాన్ని అంతం చెయ్యడమే లక్ష్యంగా ఈ నెల తొలివారంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యమిచ్చిన ఇండియా ఎన్నో ఏళ్ల క్రితమే ఆ మహమ్మారిపై యుదప్రకటన చేసింది. మాటల్లో పోటెతే ఆదర్శాలు చేతల్లో ఆవిరైపోయి ప్లాస్టిక్ చేతి సంచులు చేటు సంచులుగా పదేపదే రుజువవుతున్న వేళ- మహారాష్ట్ర ప్రభుత్వం దేశార్థిక రాజధాని ముంబయి మహానగరంలో ప్లాస్టిక్ పై కదనకాహళి మోగించింది. మార్చి 23న జారీ అయి తాజాగా అమలులోకి వచ్చిన నోటిఫికేషన్ అనుసారం- ప్లాస్టిక్ సంచుల తయారీ, వినియోగం, రవాణా, పంపిణీ, అమ్మకం, నిల్వ, దిగుమతులన్నీ నిషిద్ధం. ప్రాసిక్ లేదా ధర్నొకోల్ తో తయారయ్యే కప్పులు, పేటు, గాసుల వంటి ఉత్పాదనలన్నింటినీ నిషేధించిన ప్రభుత్వం- నిబంధనల ఉల్లంఘనులకు భారీ జరిమానాలతోపాటు బారీ జరిమానాలతో పాటు మూడోసారీ తప్పుచేసే మూడు నెలల జైలుశికనూ ప్రతిపాదించడం విశేషం! మహారాష్ట్రలో రెండున్నర వేలదాకా ఉన్న ప్లాస్టిక్ సంచుల తయారీ యూనిట్లలో 56 వేలమంది పని చేస్తున్నారని, ఆయా సంసలు బ్యాంకులకు రూ.11 వేలకోట్ల దాకా చెల్లించాల్సి ఉందనీ గణాంకాలు చాటుతున్నాయి. ప్రాసిక్ సంచుల నిషేధంతో కూరలు, పళ్లు, మాంసం, చేపల మార్కెట్లతోపాటు వీధుల్లో తినుబండారాల వ్యాపా రాలు మూత పడుతున్నాయి. పాసిక్ ఉత్పాదనలకు ప్రత్యామ్నాయాలి, చూపని ప్రభుత్వం - జరిమానాలు విధించి వసూలు చేసేందుకు 250 మంది ఇన్ స్పెకర్లకు ఇదేమి భారతం మాత్రం శిక్షణ ఇచ్చింది. కరీంనగర్ పట్టణంలో 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ సంచుల్ని నిషేధించిన నగరపాలక సంస్థ కుటుంబానికి రెండు గుడ్డసంచుల్ని పంపిణీ చెయ్యాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఒక్క తీరుగా జాగృత జన మసూద్య మంగా సాగాల్సిన ప్లాస్టిక్ పై యుద్ధం- ఇలా అరకొరగా అసంబద్దంగా 2019 తెమిలిపోతుండటమే చెరుపు చేస్తోంది!పట్టుమని వందేళ్ల క్రితం పుట్టిన ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా మానవాళి జీవనంలో అంతర్భాగమైపోయింది. శతాబ్ద కాలంలో ఉత్పత్తి అయిన పరిమాణానికి మించిన ప్లాస్టిక్ గత పదేళ్లలోనే తయారైందంటే, ఉత్పత్తి అయిన పరిమాణానికి మించిన ప్లాస్టిక్ గత పదేళ్లలోనే తయారైందంటే, జడలు | దాని వినియోగం ఎంత ఉద్ధృతంగా సాగుతోందో బోధపడుతుంది. ప్రపంచంలో నెల ఇప్పటివరకు 830 కోట్ల టన్నుల సూక్ష్మ ప్లాస్టిక్ తయారైందని, 2015 నాటికే 630 ఇండియా కొట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం అతలాకుతలమవుతోందని పోటెతే శాస్త్రవేత్తలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నారు. ఆయా వ్యర్థాల్లో శుద్ధి, పునశ్శుద్ధికి పదేపదే నోచుకొన్నది 21 శాతం కాగా, తక్కినదంతా భూమిపైనో, సముద్రాల్లోనో పేరుకు పోయి జీవావరణాన్ని దారుణంగా దెబ్బతీస్తోందిప్పుడు! ఏటా 1,900 కోట్ల పౌండ్ల ప్లాస్టిక్ పదార్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని వాటివల్ల జలచరాల అస్తిత్వమే పెనుప్రమాదంలో పడుతోందని తీవ్రాందోళన వ్యక్తమవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఆహారంగా భ్రమించి తినే చేపలవంటి జలచరాల్ని మనుషులు భుజిస్తే వాటిల్లే ఆరోగ్య సమస్యలు ఇన్నీ అన్నీ కావని హెచ్చరికలు మోతెక్కుతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యంతో భూగర్భ జలాలూ విషకలుషితమై మనిషి మనుగడే దుర్భరమవుతుంది. ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాల ప్యాకేజింగ్, బొమ్మలు, నీటి పైపుల తయారీకి వాడే పాలీ వినైల్ క్లోరైడ్ తో క్యాన్సర్, చర్మవ్యాధుల వంటివి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. నీటి బాటిళ్ల తయారీకి వాడే పాలీ కార్బొనేట్లతో ఊబకాయం, క్యాన్సర్, మధుమేహం వెంటాడుతాయి. ప్రతి మనిషి జీవితాన్ని ఇంతగా చెండుకుతింటున్న ప్లాస్టిక్ ను నిత్యజీవన వినియోగం నుంచి పూర్తిగా తొలగించాలంటే- అరకొర నిషేధాలతో విఫల ప్రయోగాలు కాదు, దీటైన ప్రత్యామ్నాయాలను ప్రజలకు చేరువ చేసి జాతీయోద్యమమే సాగించాలి!ప్లాస్టిక్ సంచుల్ని మొత్తంగా నిషేధించడమో, ఉత్పత్తిదారులే తిరిగి సేకరించే విధానాల్ని పరిశీలించడమో చెయ్యకపోతే, భావితరానికి అణ్వస్త్రాల్ని మించిన పెనుముప్పు దాపురిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం లోగడే నిష్ఠుర సత్యం పలికింది. ప్లాస్టిక్ సంచులు తిని నరకయాతన అనుభవిస్తూ ఏటా అను వేల సంఖ్యలో కనుమూస్తున్న పశువులు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కడతేరి పోతున్న జలచరాలు, పౌరుల నరనరాల్లో ఇంకుతున్న ప్లాస్టిక్ దుష్ప్రభావా లు- ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. దేశీయంగా షాంపూ పొట్లాలు రూ.3,000 కోట్లు, బిస్కెట్ ప్యాకెట్లు రూ. 25 వేలకోట్లు, పండ్ల రసాలు రూ.1,500 కోట్లు, చిరుతిళ్లు రూ. 13వేలకోట్లు- ఇలా అనేకానేక వ్యాపార ఉత్సా దనల్ని సమస్త వినియోగదారులకు చేరువచేసే సులభ సాధనంగా ప్లాస్టిక్ విశ్వరూ పం దాల్చింది. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్ లో యాభై శాతానికి పైగా వాడి పారేసేదే ఉంటుందని, ప్లాస్టిక్ బాటిళ్లే నిమిషానికి పది లక్షలు అమ్ముడుపోతున్నా యని విశ్లేషణలు చాటుతున్న నేపథ్యంలో- యుద్ధవ్యూహం సర్వసమగ్రంగా ఉండాలి. ప్లాస్టిక్ బాటిళ్లకూ అన్ని విధాలుగా దీటైన ప్రత్యామ్నాయాల తయారీ ఊపందుకొనేలా పరిశోధనలు సాగాలి. 1992 లగాయతు ప్లాస్టిక్ వ్యర్థాల పునశు ఉద్దికి ప్రధాన కేంద్రంగా ఉన్న చైనా - దిగుమతులపై ఇటీవల నిషేధం విధించిన దరిమిలా ఏ దేశానికా దేశం సొంతంగా ఏర్పాట్లు చేసుకోక తప్పదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో పటిష్ఠ రహదారుల నిర్మాణ సాంకేతికత అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఆ దిశగా దృష్టి సారించడం, చౌకైన ప్రత్యామ్నాయాల్ని మార్కెట్లలో సిద్ధం చేసి, ఉత్పాదక స్థాయిలోనే ప్లాస్టిక్ పై వేటు వెయ్యడం, జనజాగృతి పెంచి స్వచ్ఛంద నిషేధానికి పౌరుల్ని సంసిద్ధం చెయ్యడం- కార్యపట్టికను అమలుచేసినప్పుడే సత్ఫలితాలు ఒనగూడుతాయి!