అఫ్ఘానిస్థాన్లో శాంతివీచికలు

కాలం అంతర్యుద్ధాల వల్ల అఫ్ఘానిస్థాన్‌కు జరిగిన నష్టం అంతాఇంతా కాదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్, ఇప్పుడు అమెరికా జోక్యాల ఫలితంగా ఆ దేశ పరిస్థితులు కుదుటపడలేదు సరికదా మరింత క్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని కాబూల్ నగరంలో జరిగిన కాబూల్ పరియ-2 (కాబూల్ పాసెస్) సమావేశంలో తాలిబనతో శాంతి చర్చలకు అధ్యక్షుడు అషఫ్ ఘనీ పిలుపివ్వడం పెద ముందడుగే. ఈ ప్రక్రియను ఎంత సమర్థంగా ముందుకు తీసుకువెళ్లగలరన్నదానిపై ప శాంతిస్థాపన ఆధారపడి ఉంటుంది. గత నెలాఖరులో జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సహా 26 దేశాలు హాజరయ్యాయి. పదిహేడేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి చర్చల ద్వారా ఇప్పటికైనా అర్థవంతమైన ముగింపు పలికితే ఉగ్రవాద నిర్మూలనలో అంతర్జాతీయ సమాజం గణనీయమైన విజయం సాధించినట్లవుతుంది! శాంతి చర్చలకు అప్లాన్ ప్రభుత్వం, విదేశాలు, తాలిబన్లు సిద్ధపడటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు పాలించిన హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేకపోయింది. తరవాత వచ్చిన అమఫ్ ఘనీ ప్రభుత్వానిదీ అదే పరిస్థితి. రెండు ప్రభుత్వాలకు అమెరికా అండదండలు ఉన్నప్పటికీ అవి ఉత్సవ విగ్రహాల మాదిరిగా మిగిలిపోయాయి. దేశంలో మూడోవంతు భూభాగంపై, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్లు పట్టు సంపాదించారు. సైన్యం, పోలీసులు సైతం వారిని నిలువరించే పరిస్థితిలో లేరు. అఫ్ఘాన్ తలనొప్పిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలని అమెరికా భావిస్తోంది. 2015 జనవరిలోనే అప్పటి ఒబామా ప్రభుత్వం అప్లాన్ నుంచి తమ సేనలను వెనక్కి రప్పించింది. అంతర్గతంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ట్రంప్ అఫ్ఘాన్ పై పూరిస్థాయిలో దృష్టి పెట్టడం కష్టమే. అఫ్లాలో పరిమితంగానే ఇప్పుడు అమెరికా సేనలు ఉన్నాయి. వియత్నాం తరవాత అమెరికాకు అంతర్జాతీయంగా ఎక్కువ చికాకు కలిగించిన అంశం అఫాన్. 2001 నుంచి ఇప్పటివరకు అఫ్లాలో అమెరికా పెట్టిన ఖర్చు 10,000 కోట్ల డాలర్లని అంచనా. అందువల్లే NA కాబూల్ ప్రక్రియ-2 సమావేశంలో పాల్గొన్న అమెరికా చర్చల ప్రతిపాదనకు వెన్వెంటనే సరేనంది. ఇతర దేశాలూ అందుకు సరేనన్నాయి. ఉగ్రవాదంతో సతమతమవుతున్న అను ఈ దేశాలు ఉదారంగా సాయమందిస్తున్నాయి. పొరుగు దేశంగా, మిత్రదేశంగా భారత్ కూడా చర్చల ప్రతిపాదనను స్వాగతించింది. అఫ్ఘాన్ అభివృద్ధికి, అక్కడ శాంతిస్థాపనకు భారత్ చేస్తున్న కృషి మరే దేశం కూడా చేయడం లేదు. అనేక అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపట్టింది. E ఏకంగా పార్లమెంట్ భవనాన్నే నిర్మించి ఇచ్చింది. చర్చల ప్రతిపాదనపై తాలిబన్లు విముఖంగా లేకపోవడానికి బలమైన కారణాలు లేకపోలేదు. తమకు అండగా నిలుస్తున్న పాకిస్థాన్ ఇటీవల కాలంలో ఒకింత బలహీన పడుతోంది. ఉగ్రవాదానికి పాక్ చేయూతపై అమెరికా తీవ్ర ఆగ్రహాన్నే వ్యక్తంచేసింది. సహాయాన్ని దాదాపుగా నిలిపివేసింది. తమ దేశంలో పాక్ చిచ్చు పెడుతోందని అప్లాన్ ప్రజలు బలంగా భావిస్తున్నారు. అధ్యక్షుడు ఘనీ, మాజీ అధ్యక్షుడు కర్ణాయ్ పలుమార్లు ఈ విషయమై పాక్ పై ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో ఐఎన్ఏఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) కదలికలు అఫాలో కనబడటమూ తాలిబన్ల వైఖరిలో మార్పునకు మరో కారణం. జనవరి ఆఖరులో ఈ సంస్థ కాబూల్ లో జరిపిన దాడుల్లో 11మంది. సైనికులు మృతి చెందారు. సైనిక శిక్షణ కేంద్రం మార్షల్ ఫాహిమ్ అకాడమీలో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్న ఘటనలో సైనికులతోపాటు మరో 16మంది గాయపడ్డారు. గత నెల 24న దేశంలోని ముఖ్య నగరమైన జలాలాబాద్లో బ్రిటన్ సాయంతో నిర్వహిస్తున్న 'సేవ్ ది చిల్డ్రన్' కార్యాలయం లక్ష్యంగా సాయుధులైన ఐఎఎస్ ముష్కరులు దాడికి తెగబడ్డారు. తాజా ప్రతిపాదనల ప్రకారం ఉగ్రవాద తాలిబన్ సంస్థ ముందుగా ఆయుధాలను విడనాడాలి. రాజ్యాంగానికి బదులై ఉండాలి. ప్రభుత్వాన్ని గుర్తించాలి. ఈ క్రమంలో ఉగ్రవాద ముద్ర చెరిపేసుకుని తాలిబన్ రాజకీయ పార్టీగా అవతరించి, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ముందు శాంతి చర్చల విధివిధానాలను ఖరారు చేసుకోవడం కీలకం. చర్చలపట్ల తమ వైఖరిని తాలిబన్లు స్పష్టీకరించలేదు. వారు పెడుతున్న కొన్ని షరతులు అర్థవంతంగా లేవన్న వాదన వినబడుతోంది. ప్రస్తుత కీలుబొమ్మ ప్రభుత్వంతో కాక, నేరుగా అమెరికాతోనే చర్చలు జరుపుతామని ఆ సంస్థ చెబుతోంది. ఖతార్ లో ఉన్న తమ కార్యాలయం ద్వారా అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తోంది. చర్చలకు సిద్ధపడినంత మాత్రాన తాము బలహీనపడినట్లు భావించరాదనీ హెచ్చరిస్తోంది. ముందుగా అమెరికా సేనలు వైదొలగాలన్నది దాని ప్రధాన డిమాండ్. మరోవైపు ముందుగా తమతో మాట్లాడితే తరవాత అమెరికాతో చర్చలు జరపవచ్చని అఫాన్ ప్రభుత్వం అంటోంది. 2015 జులైలో తాలిబన్లు, అఫాన్ ప్రభుత్వం మధ్య పాకిస్థాన్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాలిబన్ల వైఖరిలో ఇటీవల ఒకింత మార్పు కనబడుతోంది. అఫాన్ ప్రజల ప్రయోజనాల విషయంలో ముందుంటామని అంటోంది. త్క్మునిస్థాన్, పాకిస్థాన్, భారత్ సహజవాయువు పైలైను భద్రత కల్పిస్తామంటున్నారు. ఈ పథకం వల్ల అఫాను లబ్ధి చేకూరుతోంది కనుక భారత ను వ్యతిరేకించబోమని తాలిబన్లు చెబుతున్నారు. అంత ర్జాతీయంగా రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో అప్లాన్ సంక్షోభంపై అందివచ్చిన చర్చల అవకాశాన్ని తాలిబన్లు సద్వినియోగం చేసుకోవాలి. మొండి పట్టుదలలకు పోకుండా ముందడుగు వేయాలి. గతంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఉగ్రవాద సంస్థ 'హమస్' అనంతర కాలంలో ఆయుధాలు విడనాడి జనజీవన స్రవంతిలో కలిసిన అంశాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకోవాలి!