బండెడు పుస్తకాలు భుజాన వేసుకొని పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు చివరికి మిగులుతోంది మోత బరువే తప్ప జ్ఞానం కాదు! జీవితానికి తప్ప భావం కాదు. జీవితానికి అక్కరకు రాని చదువులు ఇప్పుడు దేశానికి అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. పాఠాలను బట్టీయం వేయించి, తిరిగి వాటిని అప్పజెప్పించుకొని, పరీక్షల్లో అవే పాఠాలు వారిచేత రాయించే రొడ్డకొట్టుడు విధానాలకు చెల్లుచీటీ పాడక పోతే- మున్ముందు సొంతంగా ఆలోచించే బుద్ది జీవులే దేశంలో కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలకు సిద్ధం కావడమెలా అన్న విషయం పై దేశవ్యాప్తంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రసంగించారు. మరోవంక వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పాఠ్యాంశాలను సగానికి తగ్గిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు ప్రకాశ్ జావడేకర్ తాజాగా ప్రకటించారు. అయితే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిధిలోని పాఠశాలల్లో హాజరును తప్పనిసరిగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల వెలువరించిన నిర్ణయంపట్ల మాత్రం విద్యార్థులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెవిపట్టుకు మెలివేసి పిల్లలను ఠంచనుగా స్కూలుకు తీసుకురావడం అన్ని సందర్భాల్లోనూ ఆమోదయోగ్యం కాదు. అసలు ఇలాంటి విధానాలవల్ల విద్యావ్యవస్థ బాగుపడుతుందా అన్నది ఆలోచించాల్సి ఉంది. పాఠ్యాంశాలను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం, పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడం రెండూ వేర్వేరు ప్రక్రియలు! పరీక్షల్లో కేవలం అత్యధిక మార్కులు సంపాదించడమే లక్ష్యంగా పిల్లలపై ఒత్తిడి తీసుకువస్తే వారి మానసిక వికాసం ఆగిపోతుంది. అవగాహనకు కొదవపడుతుంది. కానీ దేశంలో దురద ద ఎష్టవశాత్తూ జం ృష్టవశాత్తూ జరుగుతోంది ఇదే! విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టి మార్కుల చుట్టే తిరుగుతోంది. పుస్తకాల్లోని పాఠాలపై సంపూర్ణ పై మార్కుల అవగాహన ఏర్పడినప్పుడే వాటిని సరిగ్గా నేర్చుకున్నట్లు లెక్క! తమ అభిరుచులకు అనుగుణమైన అంశాలు ఎంపిక చేసుకొని, సహజ సిద్ధమైన పద్ధతిలో, తమకు అనుకూలమైన వాతావ రణంలో వాటిని నేర్చుకునే వెసులుబాటు విద్యార్థులకు ఉండాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఉపాధ్యాయులు కేవలం సమన్వయ కర్తలుగానే ఉండాలి. పిల్లలను యంత్రాలుగా మార్చి, పాఠాలు బట్టీ వేయించే అహేతుక పథంలో ఉపాధ్యాయలోకం ప్రయాణం చేయరాదు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానం నేడు దేశానికి అవసరం. సామాజిక బాధ్యతను తెలియజప్ప, విద్యార్థులను బాధ్యతను తెలియజెప్పి, విద్యార్థులను బాధ్యతగా పెంచే చదువులకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. నిత్య జీవన పథంలో అవసరపడే విజ్ఞానం, నైపుణ్యాలను సమకూర్చుకోవడంపై విద్యార్థులు దృష్టిపెట్టాలి. పాత పద్ధతుల్లోనే ఇంకా బట్టీయం చదువులను పట్టుకు వేలాడితే దేశానికీ, విద్యార్థులకూ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరుకు నిక్కచ్చి కొలబద్దలు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇటీవల వెలువరించిన నిర్ణయం చూస్తే మనం తప్పు దారిలో వెళుతున్నామేమో అనిపిస్తోంది. బలవంతంగా కూర్చోబెట్టి, అదే పనిగా ఊదరగొడితే పిల్లల బుర్రల్లోకి చదువులు ఎక్కవు! విద్యార్థుల్లోని సహజ నైపుణ్యాలకు పదును పెడుతూ, వారిలో కొత్త ఆలోచనలు రగిలిస్తూ పాఠాలు బోధించగల సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులను తయారు చేయడంపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాలి. అలాంటి గొప్ప గురువులను తయారు తయారు చేసుకోగలిగితే పిల్లలు తరగతి గదులు వదిలి ఒక్క క్షణం బయటకు పొమ్మన్నా పోరు! అర్థంకాని సూత్రీకరణలను పిల్లల బుర్రల్లోకి బలవంతంగా కూరే ప్రయత్నం చేసినన్నాళ్లూ స్కూళ్లు... పిల్లలకు చేరువ కాలేవు. కొందరు విద్యార్థులు పాఠాలను త్వరగా నేర్చుకోగలరు... ఇంకొందరికి రెండు మూడు సార్లు అదనంగా చదివితే తప్ప అది సాధ్యం కాదు. పాఠం నేర్చుకోవడానికి విద్యార్థులు ఎంత సమయం తీసుకున్నారన్న దానికన్నా- అందులోని సారాన్ని వారు నిర్దుష్టంగా అర్థం చేసుకున్నారా లేదా అన్నదే ముఖ్యం. పాఠాలపై పిల్లలకు సంపూర్ణ అవగాహన ఏర్పడే వరకూ వారికి సమయం ఇస్తూనే ఉండాలి. అంతేగానీ నిర్దిష్ట కాలావధిలో పాఠాలు అప్పజెప్పాలంటే వారు బట్టీ కొడతారే కానీ, వాటిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయరు!వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య ప్రణాళికను సగానికి తెగ్గేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించడం బాగానే ఉంది. పాఠాల బరువు తగ్గించడంతోపాటు వాటి నాణ్యతను పెంచడం, అభ్యసన తీరుతెన్నుల్ని మార్చడం కూడా ఇప్పుడు అవసరం. కేవలం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని, జీవితంలో కుదురుకోవడమే లక్ష్యంగా విద్యార్థులకు చదువులు చెబుతున్నామా లేక వారి సర్వతోముఖ వికాసాన్ని తద్వారా జాతి అభివృద్ధినీ కాంక్షిస్తున్నామా అన్న విషయాన్ని తేల్చుకోవలసి ఉంది. కేవలం ఉద్యోగంలో కుదురుకోవడమే చదువుల లక్ష్యమైతే విద్యావిధానం కొరగానిదిగానే మిగిలిపోతుంది. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలను విశదీకరించడంతోపాటు, వారికి ఆచరణాత్మక జ్ఞానం అలవడేట్లుగానూ చర్యలు తీసుకోవాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సామాజిక, ఆర్థిక వికాసాన్ని దగ్గరనుంచి గమనించేందుకు వారికి అవకాశం ఇవ్వాలి.
మోత బరువు తగ్గితేనే విద్యావికాసం