మానవులకు అల్లాహ్ ప్రసాదించిన వరాలు అనంతం.వాటినిలెక్కించడంగాని, ఊహించడంగాని, వర్ణించడంగాని అసాధ్యం. అటువంటి అసంఖ్యాక అనుగ్రహాల్లో 'నోరు'లేక,నాలుక కూడా ఒకటి. కేవలం తినడానికి, త్రాగడానికి మాత్రమేకాదు, సంభాషణకు, మానవులమధ్య పరస్పర సంబంధాలకు ఇదేవారధి. దీని వినియోగ తీరుపైనే జయాపజయాలు ,సాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే అమ ృత పుజల్లు జాలువారుతుంది, ప్రేమామృత కుసుమాలను వికసింపజేస్తుంది. మంచిని పంచి మనిషి గౌరవ మర్యాదల్ని ఇనుమడింప జేస్తుంది. సంఘంలో ఉన్నత స్థానాన్ని సమకూర్చి పెడుతుంది. స్నేహ సౌభ్రాత్రతలను, శాంతి సామరస్యాలను పరిఢవిల్లజేస్తుంది. దుర్వినియోగం చేస్తే మాత్రం విద్వేషం చిలకరిస్తుంది. అశాంతి, అలజడులను సృష్టిస్తుంది. సమాజంలో స్థాయిని దిగజారుస్తుంది. ఇహపర లోకాల్లో ఆపదలు తెచ్చి పెడుతుంది. వైఫల్యాలకు కారణమవుతుంది. అల్లాహ్ దృష్టిలో నోటి దురుసు,దుర్భాష ,అశ్లీలం తీవ్రమైన నేరాలు. దీనికి ఇహలోకంలో పరాభవం, పరలోకంలో నరక శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారి ప్రవచనంఇలా ఉంది.” ప్రళయదినాన విశ్వాసి త్రాసులో తూగబడే అత్యంత విలువైన, బరువైన వస్తువు మానవుడి సత్ప్రవర్తనే. అశ్లీలమాటలు పలికే వారిని,దుర్భాషలాడేవారిని అల్లాహ్ అసహ్యించు కుంటాడు.' కొంతమంది పైకి ఎంతో భక్తి పరులుగా కనిపిస్తారు. కాని నోటితో , ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పరుల మనసు గాయపరుసారు. పెడుతుంబుంది. ఇహపర సృష్టిస్తుంది. సమాద్వేషం చిలకరిసు ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారితో ఇలావిన్నవించుకున్నాడు.' ఒక స్త్రీ ఎన్నెన్నో నఫిల్ నమాజులు చేస్తుంది. మరెన్నో నఫిల్ ఉపవాలు పాటిస్తుంది. పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తూ ఉంటుంది. ఈ సత్కార్యాల కారణంగా ఆమె గొప్పదాతగా ప్రసిద్ది చెందింది . కానీ ఆమెకు నోటిదురుసు ఎక్కువ. ఏదో ఒకటి అని పొరుగువారి మనసు బాధ పెడుతుంది.'అని నివేదించాడు.' అయి తే ఆమె నరకానికి పోతుంది.. అన్నారు ప్రవక్త మహనీయులు. తరువాత ఆ వ్యక్తి' దైవప్రవక్తా! ఒక స్త్రీ ఫర్జ్ నమాజులు ఫర్జ్ రోజాలు(అంటే,విధిగా పాటించవలసినవి) మాత్రమే ఆచరిస్తుంది. నఫిల్ నమాజులు నఫిల్ రోజాలు (ఐఛ్ఛికం)పాటించడం చాలా అరుదు. దానధర్మాలు కూడా పెద్దగా ఏమీ చేయదు. ఉన్నంతలోనే అప్పుడప్పుడూ కొన్ని జున్ను ముక్కలు దానం చేస్తుంది. అయితే ఆమె ఎప్పుడూ ఇరుగు పొరుగు వారిని పల్లెత్తు మాట అ నదు. వారి మనసు నొప్పించదు. నొప్పించదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుందని జనం చెప్పుకుంటూ ఉంటారుఅని విన్నవించు కున్నాడు. ఈ మాట విని ప్రవక్త మహనీయులు, ఆమె స్వర్గవాసి' అని సెలవిచ్చారు. అందుకని నరంలేని నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతంగా,జవాబుదారీతనంతో మాట్లాడాలి.దైవానికి భయపడుతూ ఆచి ప్రయోజనకరమైన మాటలనే పలకాలి. దురుసుగా, పరుషంగా, అనాలోచితంగా మాట్లాడకూడదు. పరులమనసు గాయపడే విధంగా, వారు బాధపడే విధంగా పరుష పదజాలం ఉపయోగించకూడదు. హుందాగా సౌమ్యం, నమ్రత ఉట్టిపడే విధంగా మాట్లాడాలి. ఉపయోగంలేని ఉబుసుపోక మాటలకన్నా మౌనంగా ఉండడం ఎంతో మేలు. లేకపోతే అనర్ధాలు జరిగిపోతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, వివరణలు,సంజాయిషీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మాట్లాడిన ప్రతిమాటకూ,పలికిన ప్రతి పదానికీ దైవానికి కూడా సమాధానంచెప్పుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. -
యండి. ఉస్మాన్ ఖాన్-సీనియర్ జర్నలిస్టు