కులం కారణంగా సమాజం చూపిన చిన్నచూపును భరించి సంకల్పబలంతో అన్ని ఆటంకాలను అధిగమించి, ఆధునిక విద్యతో తేజస్సంపన్నుడై తన జాతికి కొత్త వెలుగులు చూపిన మహానుభావుడు అంబేద్కర్. నిమ్నజాతుల సముద్ధరణమే ఆయన ఊపిరి. అంటరానితనం నిర్మూలనకు కొరకు అహర్నిశలు పోరాడిన వీరుడతడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడిన మహానీయుడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న రాంజీ మలోజి సక్పాల్, భీమాబాయ్ దంపతులకు 14వ సంతానంగా అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ (నేటి మధ్యప్రదేశ్) లోని మహెూం అనే గ్రామంలో జన్మించారు. రాంజీ సక్పాల్ భారత సైన్యంలో సుబేదారుగా పనిచేసేవారు. అంబేద్కర్ ను చిన్నప్పటినుండే అతను చాల క్రమశిక్షణతో పెంచాడు. అంబేద్కర్ మహర్ అనే దళిత కుటుంబంలో పుట్టడం వలన పాఠశాలలో వేరుగా కూర్చోపెట్టేవారు. మిగతా పిల్లలు తాగే గ్లాసుతో నీళ్ళు కూడా తాగనిచ్చేవారు కాదు. దేవాలయంలోకి రానిచ్చేవారు కాదు. టీ తాగపోతే దూరంగా ఉంచిన గ్లాసుతో ఇచ్చేవారు. చివరికి ఊరికి వెళ్ళేటప్పుడు అద్దె బండిలో కూడా ఎక్కనివ్వలేదు. తాను ఎం తప్పు చేశానని, తనను అందరు ఎందుకిలా అంటరానివాడిగా చూస్తున్నారని, తన జాతి వాళ్ళందరినీ ఊరికి దూరంగా ఎందుకు ఉంచుతున్నారనే ఆలోచనలు అంబేద్కరను చుట్టుముట్టాయి. దీనిని ఎలాగైనా అంతమొందించాలని సంకల్పించారు. అంబేద్కర్. అందుకని బాగా చదువుకొని మంచి పదవులు పొందాలనుకున్నాడు. 1907లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన తర్వాత బరోడా మహారాజు వారిచ్చిన ఉపకారవేతన సహాయంతో కొలంబియా విశ్వ విద్యాలయం నుండి ఎం.ఏ, పిహెచ్. డి. పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత బొంబాయిలో న్యాయవాదిగా స్థిరపడ్డారు. మంచి ఉద్యోగం, మర్యాదలు పొందినప్పటికి అంబేద్కర్ కు అవేవి సంతృప్తినివ్వలేదు. తనలాగా తన జాతి ప్రజలు అవమానాలు పడకూడదు అనుకున్నాడు. కుల వివక్ష లేని స్వతంత్ర భారత దేశం కావాలని ఆకాంక్షించారు. బాల్యంలో విన్న పురాణ గాథలు, కబీరు సూక్తులు, బుద్దుని జీవిత చరిత్ర, మహాత్మా జ్యోతిబా ఫూలే జీవితం అంబేద్కర్ ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. నిమ్నజాతులను జాగృతం చేసి వారిలో ఆత్మ ఉండి ఉంచుతున్నారనే గౌరవాన్ని నెలకొల్పడమే అంబేద్కర్ తన ధ్యేయంగా భావించారు. రాజ్యాంగాన్ని అందరిలాగే మనము అన్ని పనులు చేయగలం, సమాజంలో అందరిలాగే దళితులకు మనకు సమాన హక్కులు ఉంటాయనే విషయాన్ని వెనుకబడిన జాతి ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్. 1956 అస్పృశ్యుల సంక్షేమం కోసం బహిష్కృత్ హితకారిణి సభ అనే సంస్థను గుండెల్లో స్థాపించారు. మూక్ నాయక్, బహిష్కృత్ భారత్ అనే పత్రికల ద్వారా మహోన్నతుడతడుమర్యాదలు వివిధ వ్యాసాలు రాయడంతో పాటు అనేక రచనల ద్వారా నిమ్న జాతుల కష్టాలనుఅభ్యున్నతికై కృషి చేసారు. అపర 1927లో దళితులు దేవాలయంలో ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్లను ఉపయోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు పాత్రలు చేపట్టారు. అంబేద్కర్. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వ్యాపింపజేసిన వహించడానికి ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. మహిళల సామాజిక ఆర్థిక హక్కుల కోసం పోరాటం చేశారు. షెడ్యూల్డ్ కులాలు, అంబేద్కర్ తెగలకు రిజర్వేషన్లు కొరకు రాజ్యాంగ సభను ఒప్పించి బడుగుల జీవితానికి వెలుగులు చూపి వారి గుండెల్లో బాబా సాహెబ్ గా నిలిచిపోయారు. భారత రాజకీయ నాయకులలో కాలం విలువను గుర్తించిన వారిలో అగ్రగణ్యుడు అంబేద్కర్. ప్రతి నిమిషాన్ని ప్రయోజనాత్మకంగా గడిపేవారు. అతని దృష్టిలో సమయమంటే విజ్ఞానం. జ్ఞాన సముపార్జనకు సాధనమైన గ్రంథ పఠనానికే ఆయన ఎక్కువ సమయం వినియోగించేవాడు. తన సంపాదనలో ఎక్కువ మొత్తం పుస్తకాలు కొనడానికే ఖర్చు చేసేవాడు. దేశంలో సాంకేతిక విద్య అవసరాన్ని గుర్తించి ప్రోత్సహించారు. మిళింద మహా విద్యాలయం అంబేద్కర్ కృషికి ప్రతీక. అంబేద్కర్ గొప్ప వక్త. ఎంతటి విషమ సమస్యనైనా చిక్కుతీసి విడమరిచి శ్రోతలకు చెప్పే నేర్పు, ప్రతిభ ఆయన సహజ గుణాలు. అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను తీవ్రంగా ద్వేషించేవారు. న్యాయం, ధర్మం అంటే ఆయనకు ఆసక్తి. ఆత్మ గౌరవానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు అంబేద్కర్. భారత దేశం తరపున బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ పనిచేశారు. హిందూ కోడ్ బిల్లును ప్రవేశ పెట్టారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడిగా ఉండి వివిధ దేశాలు తిరిగి అపార జ్ఞానాన్ని ఆర్జించి ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగాన్ని రూపొందించి రాజ్యాంగ పితామహుడిగా పేరు పొందారు. అందరిలాగే దళితులకు ప్రత్యేకమైన నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ తన జీవిత చరమాకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1956 డిసెంబరు 6 న అంబేద్కర్ మరణించినప్పటికీ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నతుడతడు. దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలను, కష్టాలను, బాధలను ఎదుర్కొని గొప్ప పదవులను పొందిన విద్యావేత్త, అపర మేధావి ఆయన. గొప్ప దేశ భక్తుడిగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా, సంఘసంస్కర్తగా, భారత రాజ్యాంగ రూపశిల్పిగా విభిన్న పాత్రలు పోషించి భారత రత్నమై వెలిగి భారత దేశ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానీయుడే డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్. -
కందుకూరి భాస్కర్