ఈ అమానుష కాండలకు అడ్డుకట్ట ఎప్పుడు!?

అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేస్తోంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ఏం - చేయలేని నిస్సహాయ స్థితికి ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఎందుకిలా జరుగుతోంది, ఎప్పుడు దీనికి అంతం? ఈ ప్రశ్న ఇప్పటికి అనేక సార్లు, లెక్కలేనన్నిమార్లు ఎత్తిన కొడవలిలా తలెత్తి ఉంటుంది. సరైన సమాధానం లభించక తల దించుకుని కూడా ఉంటుంది. బహుశా ఎప్పటికీ జవాబు దొరకదేమోననే దిగులు ముఖం వేసుకుని ఉంటుంది. ఢిల్లీలో నిర్భయ ఉదంతం, వరంగల్ లో యాసిడ్ దాడుల దారుణ ఘటన జరిగినప్పుడు, అంతకు ముందు, ఆ తర్వాత ఇంటా బయటా మహిళలపై చెప్పనలవికాని అమానుష కాండలు సాగిపోయినప్పుడూ ఎదురైన శేష ప్రశ్నే ఇది. ఇప్పుడు మళ్లీ ఉదయించి అస్తమిస్తున్నది. బుధవారం రాత్రి హైదరాబాద్ నగర శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని శంషాబాద్ పరిధిలో స్కూటీ పంక్చరై దిక్కు తోచని స్థితిలో చిక్కుకున్న 26 ఏళ్ల వెటెరినరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డిని ఐదుగురు అమానుషులు సహాయం చేస్తామని నమ్మించి అత్యాచారం జరిపి సజీవ దహనం చేసిన నీచ నికృష్ట చర్య, అంతకు ముందు హనుమకొండ సమీపంలో స్నేహితుడని భ్రమించిన వ్యక్తే 19 ఏళ్ల మానసను రేప్ చేసి చంపేసిన దురాగతం మన సమాజాన్ని చలింప చేశాయి. ఏమిటీ ఘోరాలు అని ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్నారు. తమ సొంత పిల్లలకే జరిగినట్టుగా ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఆధునిక యుగంలోనూ ఆడ జన్మకు ఈ దుస్థితి ఏమిటని, ఎందుకని గుండె చెరువైపోతున్నారు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా, నిర్భయంగా నడి వీధిలో నడిచి వెళ్లగలిగే రోజులు రావాలని మహాత్మా గాంధీ కన్న కల వాస్తవమయ్యేదెప్పుడని అడుగుతున్నారు. అవును, మహిళ రాత్రి పూట ఒంటరిగా సంచరించగలిగినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినట్టు పరిగణించగలమని గాంధీ జీ అన్నారు. ఆ రోజు దగ్గర పడుతున్నదా, దూరమవుతున్నదా? రోజు రోజుకీ మరింత వెనుకకు వెళ్లిపోతున్నదనే చెప్పాలి. అటువంటప్పుడు మనం పురోగమిస్తున్నామని ఏ ముఖం పెట్టుకొని అనగలుగుతాము? మహిళలపై రకరకాల దుర్మార్గాలు నిరాఘాటంగా జరిగిపోతున్నాయి. క్రూర మృగాలవి. తోడేళ్లలా దారి కాచి నిస్సహాయురాలైన అబలపై దారుణ అఘాయిత్యం చేశాయి. అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేశాయి. చిమ్మ చీకట్లో ఆమె ఆర్తనాదాలు కన్నిటి వెతలే అయ్యాయి. మృతదేహాన్ని కూడా వదలకుండా పశువాంఛ తీర్చుకున్న దుర్మార్గులు. ఆ రాక్షసులకు ఈ భూమ్మీద జీవించే అరతే లేదు. మంచి మాట అలాంటి మృగాళ్లకు ఇంకా ముసుగులెందుకు? జైల్లో పెట్టి మేపడమెందుకు? బహిరంగంగా ఉరి తీయాలి.. పెట్రోలు పోసి తగులబెట్టాలి. వెటర్నరీ డాక్టర్ హత్య కేసు నిందితులపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం ఇది.. ఆ కాళరాత్రి ఆమె అనుభవించిన నరకాన్ని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడు స్తోంది. ఆడబిడ్డల వెన్నులో వణుకు పుడుతోంది. నెత్తురు మరిగించే నేరమిది. గుండెలవిసే ఘోరమిది. తెలంగాణ ఆడపడచుకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని యావత్ దేశం కంటతడి పెడుతోంది. ప్రజా సంఘాల నిరసనల సూరుతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాణా వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను దొరకదేమోననే అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. నిందితులను బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో వైద్యులను పోలీస్ స్టేషన్క పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. మెజిస్ట్రేటు కూడా పోలీస్ స్టేషన్ కు రప్పించి నిందితులను ఆయన ముందు ప్రవేశపెట్టారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసు చేసుకోవచ్చు. ఇక నిందితులను జైలుకు తరలించడం పోలీసులకు తలకు మించిన భారమైంది. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి నిందితులను కొట్టి చంపే పరిస్థితి. పరిస్థితి చేయి దాటుతున్నట్లు గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. త్వరత్వరగా లాంఛనాలు ముగించి కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను తరలించారు. దారి పొడవునా నిరసనలేనిందితులను తరలిస్తున్న పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని తప్పించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిందితులను శనివారం చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.బయట కామాంధుల పైశాచికాలు ఇంటిలో తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందనో, పెళ్లి చేసుకున్నదనో ఇంటి పెద్దలే ఆడ పిల్లను వేధించడం, వధించడం మామూలైపోయాయి. భర్తలు, అత్తమామలు వేధింపులకు, హింసకు గురి చేయడమూ తరచూ సంభవిస్తున్నది. ఇక్కడ ప్రియాంక రెడ్డి, మానసలను రేప్ చేసి హతమార్చిన దారుణాలు దిగ్ర్భాంతి కలిగిస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత యువతిని ఐదుగురు దుండగులు అపహరించి, బంధించి నెల రోజుల పాటు సామూహిక వెళ్లిపోతున్నదనే అత్యాచారానికి పాల్పడిన దురాగతం వెలుగులోకి వచ్చింది. అలాగే రాజస్థాన్లోని బుంది జిల్లాలో 15 ఏళ్ల బాల వధువును ఆమె మొదటి భర్త అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్నది. జారింట్లో 25 ఏళ్ల గిరిజన విద్యార్థినిపై 12 మంది ముఠా సభ్యులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇతరులతో సంబంధాలు పెట్టుకున్నదన్న అనుమానంతో భార్యను హతమార్చడం తరచూ సంభవిస్తున్నది. రాజ్యాంగం సర్వసమానత్వాన్ని, లింగపరమైన అభేదాన్ని హామీ ఇస్తున్నప్పటికీ మహిళలపట్ల ఈ మగమ్మారితనం ఎదురులేకుండా మాట - స్వర్గానికి సాగిపోతూనే ఉన్నది. చట్టం ఉంది, కఠినమైన శిక్షలూ ఉన్నాయి. పెక్కు కేసుల్లో వాటిని కఠినంగా ప్రయోగించడమూ జరుగుతున్నది. అయినా ఇవి ఆగడం లేదు. పురుషుడు అత్యాచారం చేసి, హింసించి, చంపి ఆనందించడానికే ఈ దేశంలో స్త్రీ పుడుతున్నదనే అభిప్రాయం స్థిరపడిపోయే స్థాయిలో ఈ ఘాతుకాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ లో యాసిడ్ దాడి జరిపిన వారిని ఎన్‌కౌంటర్ చేసినందుకు సమాజం సంతోషించింది. నిర్భయపై దారుణానికి పాల్పడిన వారిని ఉరి తీయాల్సిందేనని, మైనర్‌ను కూడా వయోజనుడుగానే పరిగణించి బాల నేరస్తులకు కల్పించే రాయితీని తొలగించి మరీ ఉరి తీయాలనే డిమాండ్లు మిన్నుముట్టాయి. మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నవారి పట్ల సమాజం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఈ అమానుషాలు ఆగకపోడం, బంగారం వంటి ఆడబిడ్డలు చెప్పనలవికాని అవమానానికి, హింసకు గురయి అర్ధంతరంగా అంతమైపోతూ కన్నవారికి గర్భశోకం మిగల్చడం అంతం కావడం లేదు, లోపం ఎక్కడ ఉంది? ఆడపిల్లలను ఎంతగా ప్రేమిస్తున్నామో మగ పిల్లల్లో అంతగా పురుష దురహంకారాన్ని దట్టిస్తున్నాము.మనది స్త్రీ పురుష భేదం లేని సమాజంగా కాకుండా పురుషాధిక్య సమాజంగా కొనసాగాలనే వైఖరిని ఎంచుకుంటున్నాము. మగ పిల్లలను మనం పెంచుతున్న తీరులోనే అసలు లోపం దాగి ఉంది. ఈ విషయమై ఒక సమాజంగా లోతైన ఆత్మవిమర్శ చేసుకొని మగ సంతానాన్ని పెంచుతున్న తీరులో సమూలమైన మార్పును ఆవిష్కరించుకోకపోతే భవిష్యత్తులో మరెందరో ప్రియాంకలు, మానసలను బలి ఇచ్చుకోక తప్పని దుస్థితి తొలగదు. సానుభూతి కాదు కనువిప్పు కావాలి జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డిసైడ్ అనేది ఆంగ్ల సామెత తెలుగులో అర్థం న్యాయం చేయటం ఆలస్యం చేస్తే న్యాయం చేయటాన్ని అలక్ష్యం చేసినట్లేఅంటే అన్యాయం చేసినట్లు గానే భావించాలి , జస్టిస్ హేస్ట్ ఈజ్ జస్టిస్ వేస్ట్ అంటే ఆతృత న్యాయ నిర్ణయం నిరర్ధకం అని కూడా అంటారు. మధ్యేమార్గంగా సత్వర అర్థవంతమైన న్యాయ నిర్ణయం బాధితులకు కనీస న్యాయం చేసేదిగా ఉండే విధానం ఉత్తమం అని అంటారు.మరి అలాంటిది భారతీయ న్యాయస్థానాల్లో కోట్ల సంఖ్యలో కేసులు కుప్పలు తెప్పలుగా దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా పడి ఉంటున్నాయి. అలాంటి చోట్ల బాధితులు న్యాయాన్ని ఆశించటం మృగతృష్ణలో నీరు తాగటమే. అందుకే దేశంలో న్యాయవ్యవస్థ మీద చాలా మంది విమర్శలు గుప్పిస్తుంటారు. ఒకసారి వివాదం కోర్టుకు వెళితే, ఎప్పటికి తేలుతుందో, అని సందేహిస్తుంటారు. ఎప్పుడో తాతల నాటి కేసులను వారసులు కూడా కోర్టుల్లో పోరాడుతూ ఉంటారు. (మిగతా రేపు)


పులవర్తి ప్రభు,సినియర్ జర్నలిస్టు విజయవాడ