ఇదేమి భారతం స్వామి ?

భారతం స్వామి ? ఇదేమి భారతము స్వామి మా తాతలు వేదాలు చదివారు, వేదాలు రాశారు దేవతలు మేము పిలిస్తే పలికారు దేవుళ్ళను కూడా మంత్రాలతో ప్రత్యక్షము చేయించుకునే శక్తులు మాకే ఉన్నాయని- మాకే ఉన్నాయని ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా లేని గొప్ప సంస్కృతి సాంప్రదాయము మా దేశం స్వంతం సంస్కృతము చదివి వేదాలను , ఉపనిషత్తులను పురాణాలను , ఇతిహాసాలను ఆవుపోసన పట్టడం మాకే సాధ్యం ఇంకెవరికి ,ఏదేశస్తుడికి సాధ్యం కాదు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ దేశములో ఈ పవిత్ర భారతదేశంలో ఇదేమి కర్మమొ రోజు హత్యలు మానభంగాలు సర్వసాధారణమైపోయాయిజి నెలల పసి పిల్లనుండి చావుకు దగ్గరవుతున్న వృద్ధ మహిళల వరకు ఏ మహిళను, ఆడబిడ్డలను మానభంగం చేయకుండా వదలము అన్న దుర్మార్గపు ఆలోచన తో నిండిన కామాంధులు ,మానవ రూపంలో మృగాలు ఈ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నారు ఎవరు దీనికి బాధ్యులు? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వాళ్లు నడుపుతున్న ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా దుర్మార్గులను పెంచి పోషిస్తూ ప్రతి వాడిని కూడా అవసరమైనప్పుడు మా పార్టీ వాడు అంటూ అడ్డమైన పనులు చేసినప్పుడు మా వాడు కాదు అని చెప్పుకుంటూ ఇతరుల మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తున్న మన రాజ కీయ పార్టీలు ప్రభుత్వాలు ఈ 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సాదించిన అభివృద్ధి ఇదేనా ? ఇతర దేశస్తులు ఈ దేశాన్ని చూసి అసహ్యించుకునేలా పాలిస్తున్నమన దేశ పాలకులు అప్పుడప్పుడు దుర్మార్గపు మానభంగాలు హత్యలు చేసిన కొంతమంది బడుగు బలహీన వర్గాల దోషులను ఎన్‌కౌంటర్ల పేరుతో తెల్లవారుజామున తీసుకెళ్లి కాల్చి చంపి తిరిగి వారు పోలీసుల మీద దాడి చేశారని , తుపాకులతో పోలీసుల మీద దాడి చేశారని కట్టుకథలు పిట్టకథలు చెప్పే ఈ పోలీసులు అదే అగ్రకులాలకు చెందిన దుర్మార్గులను అలా ఎందుకు చేయరు? ఎందుకు చేయలేదొ? ప్రజలకు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశ రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉన్న ప్రజలంతా సమానమే కానీ కులమతాల వివక్షతో కొందరిని కాపాడుకుంటూ కొందరిని మాత్రమే శిక్షించడం అంటే ఇదే చట్టాలు న్యాయస్థానాలు చివరకు న్యాయం కూడా సిగ్గు పడేలా ఉందని ఈ దేశ పాలకులు తెలుసుకుంటే ఈ దేశం సంతోసిస్తుంది ఆ రోజు ఎప్పుడు వస్తుందో వస్తాదో రాదో అని భరతమాత బాదపడుతు కన్నీరు పెట్టుకుంటుంది -


నేరెళ్ళ కోటేశ్వరరావు