ప్రముఖ రచ్చి పెట్టిన తండ్రి "జీవితాన్ని చూసి భయపడి ఏమి సాధిస్తాం. అన్నింటికీ అణిగిమణిగి పడివున్న వాళ్ళకన్నా రాయ్తిరగబడిన వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నట్లు తోచదు. ఒకవేళ పడినా అవి ఇతరులు తెచ్చి పెట్టిన ఆ కష్టాలంతగా బాధించవు” అని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు' పంచకళ్యాణి' నవలలో సుశీల తన స్నేహితురాలు జానకికి ఉత్తరం రాస్తుంది. గోలి హనుమంతరావుకు పంచకళ్యాణి నవల గురించి, అందులోని పై మాటలు తెలియకపోయినా కొడవటిగంటి కుటుంబరావు గురించి బాగానే తెలుసు. తెనాలి దగ్గర వున్న కూచిపూడి స్వగ్రామం కాబట్టి. అణచివేతకు వ్యతిరేకంగా ఎదురు తిరగటం చిన్నప్పటి నుంచే లోనూగోలిహనుమంతరావుకు అలవాటైంది. కోరి కష్టాలు తెచ్చుకోవడం రోజులపాటు పోరాటాలతో పెట్టిన విద్యగా మారింది. విజయవాడకమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన కాగితాల కృష్ణమూర్తి ప్రభావంతో చేతపట్టిన ఎర్రజెండా చివరి వరకు వదల్లేదు. కూచిపూడిలో కమ్యూనిస్టు పార్టీ గ్రామశాఖ ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర పోషించి శక్తికి మించిన కృషి చేశాడు. కష్టాలను చూసి బెదిరిందే లేదు. సోదరుడు గోలి దామోదరరావు ఆయన పోరాటానికి, తెగువకు చేదోడుగా నిలిచాడు. అభ్యుదయ రచయిత, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు బొల్లిమంతశివరామక ృష్ణ, కనపర్తి నాగయ్య, వంగర వెంకటేశ్వర్లు ఇచ్చిన స్పూర్తిని గోలిహనుమంతరావు జీవితాంతం మరచిపోలేదు. పంచాయతీరాజ్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేసి 80 ఏళ్ళ పైబడిన మంగళగిరి చేనేత ప్రముఖుల్లో ఒకరైన బిట్రా వీరనారాయణ గారి ఆరోగ్యం బాగోకపోతే చూద్దామని ఇటీవలవెళ్ళి కాసేపు గడిపాను. 'మీ మేనమామ పెద్దగా చదువుకోకపోయినా అంతర్జాతీయ రాజకీయాలు, తదితరులు కమ్యూనిస్టు ఉద్యమం ధోరణులు గురించి చాలా బాగా మాట్లాడేవాడు' ఏర్చారు. కష్టాలను చూసి బెదిగువకు చేదోడుగా నిలిచాడు శివరామకృష్ణ, తండ్రి అడ్డంకం చేసుకున్నాయి. ఆ రోజుల్లో ప్రముఖ కమ్యూనిస్టు 306 అని జ్ఞాపకం చేసుకున్నారు. తొలి రోజుల్లో ప్రముఖ కమ్యూనిస్టు ఎంఎన్ రాయ్, ఆయన మానవతావాదం గురించి మాట్లాడటం విని ఆశ్చర్యపోయానని చెప్పారు. అప్పుడు ప్రముఖ చిత్రకారుడు మోహన్ తన తండ్రి తాడి అప్పలస్వామి గురించి ఒక వ్యాసంలో ఎం.ఎన్.రాయ్ ఏలూరు రావటం, ఆయనను అప్పలస్వామి కలోనియల్ థీసిస్ పై ప్రశ్నించటం గుర్తుకువచ్చాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన పి.సి.జోషి అంటే గోలిహనుమంతరావుకు వల్లమాలిన అభిమానం. భారతదేశ కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన ఎస్.ఎ.డాంగే అన్నా కూడా అంతకు మించిన అభిమానం. 1952లో ప్రగడ కోటయ్య నాయకత్వంలో 75 రోజులపాటు జరిగిన మద్రాసు చేనేతసత్యాగ్రహం లోనూ, తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జరిగిన చేనేత సత్యాగ్రహంలో 20 రోజులపాటు యువకార్యకర్తగా గోలి హనుమంతరావు పాల్గొన్నారు. పార్టీ చివరిదశలో ఈ ఉజ్జ్వలపోరాటాన్ని, ప్రగడ కోటయ్య జీవితాన్ని “చేనేతోద్యమ సూరీడు ప్రగడ కోటయ్య”గా రెండు పుస్తకాలను అక్షరబద్దం చేసి యువతరానికి అందించారు. 1974 లో చీరాలలో అఖిల భారత చేనేత సదస్సు విజయవంతానికి పుత్సలసత్యనారాయణ, మెట్ల వీరయ్యలతో కలసి పని చేశారు. 1985 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జౌళి విధానం అంటే చేనేత, జనపనార, పవర్ లూమ్, కాంపోజిట్, పత్తి, ఊలు, సిల్కు అన్నింటినీ ఒకే గాట కట్టిన కేంద్రప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జరిపిన పోరాటంలో అగ్రభాగాన నిలిచారు. మంగళగిరినుంచి వందలాదిమందిని సమీకరించి ఢిల్లీలో జరిగిన చేనేత ధర్నాకు తీసుకువెళ్ళారు. ఇందులోచిమ్మన నాగభూషణం, అందె నరసింహరావు, బిట్రా వెంకటసుబ్బారావు, బిట్రా లక్ష్మీరాజ్యం, దోనేపూడి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పవర్ లూమ్స్ వలన చేనేతకు ఎదురవుతున్న ప్రమాదం ఇప్పుడువిస్త ృతరూపం దాల్చింది. దీన్ని ఆపాలని ఎన్ని చర్యకు వ్యతిరేకంగాన నిలిచారు. ఆ పోరాటాలు చేసినా, విజ్ఞప్తులు చేసినాఫలితం లేకుండా వుంది. చేనేత కేంద్రాలైన గద్వాల, పోచంపల్లి, ధర్మవరం, మాధవరం,యాడికి, తాడిపత్రి, మదనపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లోని మాష్టర్ వీవర్లు పవర్ లూమ్ పై తయారైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టింగ్స్ చందన బ్రదర్స్ లాంటివారికి అమ్మడమే గాక ఫ్యాబ్ ఇండియా వంటి వాటికి కూడా చేనేత ఉత్పత్తులుగాఅమ్మూతూ చేనేత నడ్డి విరుస్తున్నారు. చేనేత రంగంలో మనుషులు కన్నా పెట్టుబడి వేగం పెరిగింది. పాలకులు చేనేతనువిస్మరించడమంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం సంక్షేమం, ఆర్టికల్ 39(ఎ)ప్రకారం ఉపాధికల్పన, ఆర్టికల్ 41 ప్రకారం పనిచేసే హక్కులను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లే లెక్క. మిల్లు యజమానుల లాభాల కోసం చేనేత కార్మికుల హక్కులను మగ్గం గుంటలలోనే పూడ్చి వేస్తున్నారు. కులం కార్డుతో తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ చేనేతకు ద్రోహం చేస్తున్న నాయకుల పట్ల అప్రమత్తంగా వుండాలి. తెల్లని దుస్తులతో, చెరగని చిరునవ్వులతో వుండే ఆయన రూపం భౌతికంగా దూరమై 13ఏళ్ళయినా ప్రతి చేనేత పోరాటంలోనూ గుర్తుకు వస్తూనే వుంటుంది. బక్కపలచని ఆయననల్లని శరీరంలో నరాలు దారాలుగా పోగు పోగు వడికిన జీవన తంత్రులుగా కనిపించేవి. చీకిపోయినవేళ్ళ చివర్ల నుంచి నూరో నెంబర్ మెరుపుదనాన్ని దేహంపై ఆరేసినట్లుగా కనిపించేవాడు. చేనేత నాయకులు ప్రగడ కోటయ్య పుత్సల సత్యనారాయణ, మోదుమూడి శ్రీహరిరావు, కడుపురాములు, మెట్ల వీరయ్య, చిలువేరి మాణిక్యాలరావు, గోలి హనుమంతరావు లాంటి జీవితాలు,చేనేత మనుగడ కోసం వారు చేసిన పోరాటాలు గుర్తు చేసుకుని చేనేతను సంరక్షించుకుందాం.
-కాగితాల రాజశేఖర్ 99483 17270(డిసెంబర్ 30, 2019 న 13వ వర్ధంతి సందర్భంగా)