సమస్యల వలయంలో కాకతీయ విశ్వవిద్యాలయం...! తెలంగాణ రాష్ట్రంలోనే 2వ పెద్ద

తెలంగాణ రాష్ట్రంలోనే 2వ పెద్ద యూనివర్సిటీగా ఉన్న వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ( కేయూ) ఎంతోమంది మేధావులను అందించింది. 1976లో ఏర్పడిన కేయూ చరిత్ర దేశ నలుమూలలా విస్తరించిందనటంలో సందేహం లేదు. అయితే మన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు మారుతుంది. ఈ విశ్వవిద్యాలయం లో దయనీయంగా మారుతుంది. ఈ విశ్వవిద్యాలయం లో చదువుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుండి SC, ST, BC, మైనారిటీ విద్యార్థులే మెజారిటీ సంఖ్య లో విద్యాను అభ్యసింస్తుంటారు. ఎన్నో గొప్ప గొప్ప ఆశలతో చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు సమస్యలే “వెల్ కమ్” చెప్పే పరిస్థితి నెలకొందంటే అతియోశక్తి లేదు. జ్ఞానానికి, విభిన్న సంస్క తుల కలయికకు, ఉద్యమ చైతన్యానికి నిలయంగా చెప్పుకునే విశవిద్యాలయం పట్ల పాలకవర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు కేయూలోని సమస్య లే సాక్ష్యం గా నిలుస్తున్నాయి. విశ్వవిద్యాలయం లో చదువుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే అతలాకుతలం చేస్తున్నాయి. ఏమాత్రం నాణ్యతలేని ఆహారం, అపరిశుభ్రమైన వసతి గృహాలతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇక 24గంటలు అందుబాటులో ఉంచాల్సిన వైద్య సేవల ఉసేలేదు. ఫలితంగా విద్యార్థులు అనారోగ్య పాలైనప్పుడు గాని, అత్యవసర పరిస్థితులలో విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరో వైపు తరగతి గదులకు విద్యార్థులు రాక ,అటు పర్మినెంట్ ప్రొఫెసర్లు లేక తరగతి గదులు వెలవెలలాడుతున్నాయి. సరైన రోడ్ల నిర్మాణం లేక , ఉన్న ఉన్న రోడ్లు చెత్తతుప్పాలతో కమ్ముకుపోయిన పరిస్థితి కనబడుతుంది. విద్యుత్ స్తంభాలు కదిలిస్తేనే వెలిగే విద్యుత్ దీపాల వల్ల విద్యార్థులు రాత్రివేళల్లో బయటికి రావాలంటే జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటే కేయూ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల వసతి గృహాల చుట్టూ ప్రహరీ గోడలు లేక పందులు,కుక్కలు, పశువులు, స్వైరవిహారం చేయడం సర్వ సాధారణ అంశం గా మారింది. విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగపడని గ్రంధాలయంలోని ఓల్డ్ వర్షన్ పుస్తలు తప్ప లెటెస్టు ఎడిషన్ పుస్తకాలు అందించటంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడా రంగానికి ములభిందువుగా నిలిచే విశ్వవిద్యాలయ క్రీడాకారులు ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారం అందక స్టీమర్ రైస్ అన్నం తినడం వల్ల,అన్నం జీర్ణం కాక అనారోగ్యానికి గురైనపోతున్నా పరిస్థితులు ఉన్నాయంటే కాకతీయ యూనివర్శిటీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిపోతుంది. కనీసం ఉదయం టీఫిన్ చేయాలన్న గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి పీజీ, పిహెచ్ డి, బిపిఈడి తదితర డిపార్ట్మెంట్ విద్యార్థులందరికి ఒక్కటే కామన్ మెన్ కావటం వల్ల అనేకమైన ఇబ్బంది అనేకమైన రులందరికి ఏమాత్రం ఉపయోగపడని గ్రంధాలయంలోని ఓల్డ్ వర్షన్ పుస్తలు తప్ప లెటెస్టు ఎడిషన్ పుస్తకాలు అందించటంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి క్రీడా రంగానికి ములభిందువుగా నిలిచే విశ్వవిద్యాలయ క్రీడాకారులు ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన ఆహారం అందక స్టీమర్ రైస్ అన్నం తినడం వల్ల,అన్నం జీర్ణం కాక అనారోగ్యానికి గురైనపోతున్నా పరిస్థితులు ఉన్నాయంటే కాకతీయ యూనివర్శిటీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసిపోతుంది. కనీసం ఉదయం టీఫిన్ చేయాలన్న గంటల తరబడి లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి పీజీ, పిహెచ్ డి, బిపిఈడి తదితర డిపార్ట్మెంట్ విద్యార్థులందరికి ఒక్కటే కామన్ మెన్ కావటం వల్ల అనేకమైన ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్వించదగ్గ కళా, సంస ృతిక రంగాలలో ముందుండే విశ్వవిద్యాలయ విద్యార్థుల ఊసే కనపడట్లేదు. రాష్ట్ర అభివృద్ధికి,బలమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడే కొత్త కోర్సులని చేర్చితే బాగుంటుంది. దేశ అభివ ృద్ధికి విద్యార్థుల మేధస్సు తరగదిగదిలో మక్కిపోకుండా దేశ అభివ ృద్ధికి బాటలు వేసే మేధావులని తయారు చేయగలగాలి. ఇప్పటికైనా కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రొపెసర్ల కొరత లేకుండా చూడాలి. కాలిగా ఉన్న పోస్టులని వెంటనే భర్తీ చెయ్యాలి. శాశ్వత వైస్ ఛాన్సులర్ ని నియమించాలి. అన్ని రకాల సౌకర్యాలను అందించేందుకు తగినన్ని నిధులు వెచ్చించడం అవసరం ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయం లోని సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. ముందు.. ప్రభుత్వాలు అనేకమైన రులందరికి చెల్పూరి శ్రీకాంత్


ఎం.ఎ పుబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాకతీయ యూనివర్సిటీ - వరంగల్ సెల్ : 8297975713