టీటీడీ లడ్డూల వ్యాపారం చేస్తోందా?

జగన్ మోహనెడి 2019 లో అదికారం లోనికి వచ్చిన తర్వాత అంతకు ముందున్న టి గురు టీ డి బోర్డ్ కంటే కాల పెద్దజుంబో సైజ్ లో బోర్డు ఏర్పాటు చేసి ఆయన పెద నానగారైన సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా నియమించటం జరిగింది. ఆయన పదవి బాద్యతలు తీసుకునే సమయం లో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించటంలో ముందుంటాను , దేవుని సొమ్ములను పారదర్శకంగా , నిజాయితీగా ఖర్చు పెడతాము అని అందరిలానే స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది . టీటీడీ కొత్త బోర్డు టిడిపి అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని నెలలు మాత్రమే అయినప్పటికీ వారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే భక్తులకు స్వామివారి దర్శనం ,కొండమీద భక్తులకు వసతి సదుపాయాలు మెరుగుపరచటం పెద్ద చేయకపోయినప్పటికి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గా భావించే లడ్డూల మీద పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలన్న విధంగా టీటీడీ బోర్డు వారు మరియు గౌరవ చైర్మన్ గారు అడుగులు వేస్తున్నట్టుగా వాళ్ళిచ్చిన ప్రకటనల ద్వారా తెలుస్తుంది . కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి భక్తునికి ఒక లడ్డు ఫ్రీగా ఇచ్చి తర్వాత ఒకటి 50 రూపాయలు ఇకమీదట చెల్లించాల్సి ఉంటుంది అని సుబ్బారెడ్డి గారు పత్రికా ప్రకటన చేయడం జరిగింది ఇది చూసిన తర్వాత చాలామంది భక్తులకు ఎవరైతే తరచుగా తిరుపతి వెళ్ళటం జరుగుతుందో , ఎవరైతే ఎక్కువ సంఖ్యలో లడ్డూలు కొని బంధుమిత్రులకు ప్రసాదంగా ఇప్పటి వరకు పంచుతు వస్తున్నారో వాళ్లందరికీ ఈ ప్రకటన చూసిన తర్వాత చాలా బాధ కలిగించందన్న విషయం టిటిడి వారి గమనించాలి కారణం ప్రతిరోజు పత్రికా ప్రకటన ద్వారా టిటిడి లో కలెకన్ అందరూ చూస్తూనే ఉన్నారు. మూడున్నర 3.25 కోట నుండి 3.5 కోట వరకు ప్రతి ఉగ్ర నిర్మూలనతోనే దినం సుమారుగా కలెక్షన్ రూపంలో వస్తున్నట్లుగా ప్రకటన ద్వారా టిటిడి బిడ్డు ప్రజలకు బోర్డు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇంకోవైపు అన్నదానానికి ఇతర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారికి కానుకల రూపంలో వస్తు రూపంలో లక్షలు , కోట్లలోనే ఇస్తున్న విషయం కూడా పాఠకులందరికీ తెలిసిందే మరి ప్రతి దినము భక్తులు సమర్పించే కానుకలు రూపంలో ఇస్తున్న కోట్ల రూపాయల డబ్బులు , వివిద సేవల పేరుతో వసూలు చేస్తున్న డబ్బులన్నీ మరి దీనికి ఖర్చు పెడుతున్నారు ? ఆ వెంకటేశ్వర స్వామి కి టిటిడి బోర్డు మెంబర్స్ కి తెలియాలి ఎక్కడ నుండి ఎన్నో వ్యయప్రయాసలకు ఎదుర్కొని తిరుపతి కొండ చేరిన భక్తులకు కనీసం మూడు సెకన్ల దర్శనం కూడా దొరకటం లేదూ అనేది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ అత్యంత భక్తితో లక్షల్లో యాత్రికులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆ అనుభూతి తో కొన్ని లడ్లు తీసుకొని పోయి బంధుమిత్రులకు పంచుకోవటం చాలా కాలం నుండి నడుస్తున్న సాంప్రదాయం కానీ ఇప్పుడు మన సుబ్బారెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం ఒక లడ్డు యాత్రికులకు ఇస్తే దాని ప్రసాదంగా అక్కడే స్వీకరించి ఇక ఇంటి దగ్గర బంధుమిత్రులకు పంచడానికి వందల్లో ఖర్చు పెడితే తప్ప వాళ్లకు కనీసం ఒక కుటుంబానికి కనీసం పావు లడ్డు కూడా పంచే పరిస్థితి ఇకమీదట సాధ్యం కాదేమో నాని చాలామంది యాత్రికులు బాధపడుతున్నారు లడ్డూలు తయారీలో వాడే పదార్థాల ధరలు పెరిగాయి కాబట్టి మేము లడ్డు ధరను కూడా పెంచుతామని ఇక మీదట ఎలాంటి సబ్సిడీ యాత్రికుల కోసం లేదు అని టిటిడి పాలక వర్గం భావిస్తే వాళ్ళు వ్యాపారం చేసి అమ్మకం ద్వారా లాభాలు పొందాలని ఆశించినట్లుగానే కనిపిస్తుంది కానీ కోట్లాది మంది భక్తులకు దేవుడి ప్రసాదం గా అత్యంత తక్కువ ధరకు అందుబాటులో తిరుపతి ప్రసాదమైన లడ్డును ఇవ్వాలన్న ఆలోచన టీటీడీ వారికీ ఉన్నట్టుగా కనబడటం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం అందువలన టిటిడి బోర్డు గౌరవ సుబ్బారెడ్డి చైర్మన్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇదివరకులా లడ్డూలను భక్తులకు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి లడ్డుల మీద వ్యాపార ధోరణి పద్దతిలో లాభనష్టాల బేరీజు వేసుకొని పెంచాలా అన్న ఆలోచన దయచేసి విరమించుకోవాలని విజ్ఞప్తి -


నేరెళ్ళ కోటేశ్వరరావు