అష్టదరావతిని రాజ శారానికి, ముందుకుంటున్నారు. ఆ. ఆధునిక యువత పెరిగి తెలుగు ఈవేళ సమస్య అభిమాన దురభిమానాల గురించి కాదు. తెలుగు రాజకీయ శక్తుల భవిష్యత్తు మీద. తెలుగురానితనం ఆవిర్భవిస్తే, పత్రికలు చదివేవారు ఎవరు? మీ దూరదర్శన విశ్లేషణలు వినేవారు ఎవరు? మీ 'సినిమాలను' చూసేవారు ఎవరు? ఈ కోట్ల రూపాయల పెట్టుబడి భవిష్యత్తు ఏమిటి? మీ సినిమాలు ఇంగ్లీషులో తీస్తారా? శాసనసభలో ఇంగ్లీషులో ప్రసంగిస్తారా?.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను 'నవ్యాంధ్ర' అనీ, 'సీమాంధ్ర' అనీ, స్వర్ణాంధ్ర అనీ అభిమానులు పిలుచుకుంటున్నారు. పైగా 'శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌరానికీ, 'బుద్ధదేవుని బోధముద్రల'కూ కేంద్రమైన అమరావతిని రాజధానిగా ఎంచుకుని అభివృది చేసుకుంటున్నారు. అషదిగజాలూ, వారి భువన విజయ నాయకుడూ తెలుగు కవీంద్రులు. కవిత్రయం సీమాంధ్రవాసులు. వేమన్న, అన్నమయ్య, క్షేత్రయ్యాది ప్రజాకవులూ, పదకవులూ యిక్కడివారే. ఆధునిక యుగం పుట్టి పెరిగింది. నేలపైనే. అటువంటి నేలపై తెలుగు తెలియని యువత పెరిగిపోతోందని చెబితే, యిదేదో మాతృభాషా సంరక్షకుల నినాదమనో, తెలుగు మాధ్యమవాదుల వివాదమనో త్రోసి పారేయటానికి వీల్లేదు. కారణం, తెలుగురానితనం వలన జరగబోయే ప్రమాదం ప్రజల కన్నా ప్రభుత్వానికెక్కువ. సాహితీ రసికుల కన్నా రాజకీయ నాయకులకెక్కువ. సాంస్కృతిక సభా వేదికల కన్నా శాసన సభలకెక్కువ? 1970ల దాకా ఎస్.ఎస్.ఎల్.సి (11వ తరగతి) వరకూ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం వుండి, ఇంటర్మీడియట్ లో ఇంగ్లీషు మాధ్యమంలోనికి పిల్లలు దూకేవారు. తెలుగు మాధ్యమంతో పాటు బోధించే ఇంగ్లీషు బోధన (వ్యాకరణం, వాక్య నిర్మాణం, సాహిత్యం ) ఎంత పకడ్బందీగా సాగేదంటే, ఇంటర్మీడియట్ ఇంగ్లీషు మాధ్యమాన్ని పిల్లలు అవలీలగా అందుకునేవాళ్ళు. అప్పుడు కూడా ఇంటర్మీడియట్ లో, బి.ఎ., బి.ఎస్సీ., బి.కామ్ డిగ్రీలలో పార్ట్---?1 తెలుగూ, పార్ట్-?2 ఇంగ్లీషూ, పార్ట్-23లో ఎంచుకున్న సబ్జక్టులూ చదివేవాళ్పు (చరిత్రా, రాజకీయం, ఆర్థికశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, వాణిజ్యం), డిగ్రీ విద్యలో రెండవ సంవత్సరం దాకా తెలుగు భాషను అధ్యయనం చేయించటానికి కారణమేమిటి? అనంతరం పీజీ కోర్సులు కేవలం ఇంగ్లీషు మాధ్యమంలో వుండేవి. ఈ విధానాలు వారి వృత్తులకూ, యిటు తెలుగు భాషా శక్తి గ్రహించి ఉత్తమ వ్యకులుగా తయారు కావటానికి ఉపయోగపడేవి. ఇది వాళ్ళు మాతృభాషామూర్తిపై అధిక ప్రేమతో చేసింది కాదు. తెలుగు రానిదే తెలుగు సంస్కృతి, రాజకీయం, సమాజ జీవనం అర్థం కావు అని వారి నిర్ణయం మేరకే. వేమన్న పద్యాలు. పోతన్న భాగవతం, మాయాబజార్ సినిమా, తిరుపతి వేంకట కవుల 'పాండవోద్యోగ విజయాలు', విశ్వనాథ 'పద్యాలు', శ్రీశ్రీ గేయాలూ, గురజాడ, కందుకూరి గార్ల యుగం తెలుగులో ప్రవేశించటానికి దోహదం చేశాయి. రాష్ట్ర అవతరణ, అనంతరం విశాలాంధ్ర అవతరణ తర్వాత తెలుగు సంస్కృతీ వైభవం ఢిల్లీకి చేరటానికి (ఒక ప్రధాని, ఇద్దరు రాష్ట్రపతులూ తెలుగువారు) దోహదపడింది. తెలుగు సంస్కృతీ తెలుగు మాధ్యమంతో పాటు ఇంగ్లీషు మాధ్యమంలోనికి వెలుగు మాధ్యమం ఇద్దరు రాష్ట్రపతులు గు సంస్కృతీ వైభవం ఢిల్లీకి చేరటానికి విశాలాంధ్ర ఇంగ్లీషు సామాజిక ఉన్నతి కేవలం చైతన్యాత్సాహాలు కావు. పచ్చి ప్రజాజీవన అవసరాలు. తెలుగు మాట్లాడటం ప్రజలకు నేర్పనవసరం లేదు. మరికొన్ని వందల ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతూనే వుంటారు. కాని పత్రికల్లో పాత్రికేయులూ, కవులూ, రచయితలూ, నటులూ, నాటకకర్తలూ, రేడియో, టీవీల్లో రచయితలూ, సినిమా స్క్రిప్టు రచయితలూ, పాటల కర్తలూ, వాణిజ్య నిర్వాహకులూ బ్రతికి బట్టకట్టడానికి తెలుగు కావాలి. అది అవసరమా, అలంకారమా ప్రభుత్వ బాధ్యతా... తెలుగు ప్రేమికుల కర్తవ్యమా అన్నది ఆలోచించగలం. నేటికీ దేశంలో 30శాతం నిరక్షరాస్యులూ (కేవలం సంతకం ఆలోచించగలం. నేటికి దేశంలో 30శాతం నిరక్షరాస్యులూ (కేవలం సంతకం చేయటం, దినపత్రిక పేరును కూడబలుక్కుని చదవటం అక్షరాస్యత కాదు), పది శాతం సామాన్య అక్షరాస్యులూ ఉన్నారు. గ్రాడ్యుయేట్లు పదిహేను శాతం, పీజీలు పది శాతం, వృత్తి విద్యా నిపుణులైన (ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యవసాయ, జీవ శాస్త్రజ్ఞులు) వారు 20 శాతం ఉన్నారు. మిగతా 15 శాతం యువత ఉన్నత పరిశోధన, పోటీ పరీక్షలు, యాజమాన్య విద్య, అంతర్జాతీయ ప్రమాణాలు సంతరించుకున్నవారూ వున్నారు. మన విద్యావిధానంలోని ప్రమాణాలు సంతరించుకున్నవారూ వున్నారు. మన విద్యావిధానంలోని “ఇంగ్లీషు మాధ్యమం గొప్పది, మంచిది, బ్రతుకు తెరువు కల్పించేది” అన్న ప్రచారం మేరకు తెలుగును చదివి, రాసి, మాట్లాడగల యువత ఇరవై శాతం దాటడం లేదు. నిరక్షరాస్యులు, అక్షరాస్యులు సరేసరి. గ్రాడ్యుయేట్లు, పీజీలు తెలుగును ప్రాణప్రదాయిని అని భావించటం లేదు. కారణం, “వీరికి ఇంగ్లీషు రాదు. ఉద్యోగాలకు పనికి రారు” అంటారేమోనని. నిజమే ఆధునిక సాంకేతిక, ప్రాపంచిక మార్కెట్లో బ్రతుకు తెరువుకు ఆంగ్లం అవసరమే. సాంకేతిక, ప్రాపంచిక మార్కెట్లో బ్రతుకు తెరువుకు ఆంగ్లం అవసరమే. కాదన్నదెవరు? అర్హులైన వారిలో పదింట ఒకరు కూడా ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. కారణం -మాతృభాష సరిగ్గా రాకపోతే 'పితృభాష' కూడా సరిగ్గా రాదు. ఇది కేవలం చమత్కారం కాదు. సాంకేతిక సత్యం!! జర్మనీ, జపాన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు మాతృభాషలోనే ఉన్నత విద్య దాకా బోధిస్తారు. అనంతరం ఒక్క సంవత్సరం (లేక రెండు) ఇంగ్లీషు నేర్పించి వ్యాపార ప్రపంచం మీదకు వదులుతారు. వారి ఇంగ్లీషు నామ మాత్రమే అయినా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలలో జపాన్, చైనీయులు ప్రథమ స్థానంలో ఆహ్వానితులు: భారతీయులు తర్వాత శ్రేణి. నిజానికి భారతీయుల ఇంగ్లీషు వారి కంటే చాలా మెరుగైందని తెలుసు. కానీ... మాతృభాషలో వారు నేర్చిన సాంకేతిక పాండిత్య సామాగ్రి, నైపుణ్యం మనకంటే పదునుగా, మెరుగ్గా ఉంటుందన్నది సత్యం. ఉద్యోగాల నిచ్చేవారు నిజమే చెబుతారు కదా! వారికది వాణిజ్య అవసరం కదా? నిజమే. అనేక కారణాల వలన భారతీయుల ఆంగ్లభాషా ప్రవేశం చాలా శక్తివంతమైనదని ప్రపంచానికి తెలుసు. కాని సాంకేతిక నైపుణ్యానికి కూడా మాతృభాషా ప్రావీణ్యం అవసరమన్న మాట. జర్మన్లు, ఫ్రెంచివారు, చైనీయులు, రష్యనులు, జపానీయులు వారి మాతృభాషకు ఎంత గౌరవమిస్తారో ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. వారి భాషా జాతీయత ఎంత గట్టిదో పలకరిస్తే గ్రహించగలరు. సంక్లిష్ట జాతీయ పరిణామాల వలన, భారతీయులు పలు భాషల్లో పుట్టి పెరగటం వలన, ఇంగ్లీషు ప్రాణాధారంగా పరిణమించటం వలన, రాదు. ఉదోణప్రదాయిని తెలుస్తుంది. వారి రాష్ట్రాలలో విద్యావిధానం 'మాధ్యమం'లో కొట్టుమిట్టాడటం వలన, యువత త్రిశంకు స్వర్గంలో పడిపోయింది. ఈ పరిణామాల వలన తెలుగు నాట (ప్రజలు తెలుగువారు... రాష్ట్రం పేరు తెలుగు... పాలించే పార్టీ తెలుగు దేశం.. రాజధాని తెలుగువారి పుణ్యభూమి) యువత తెలుగురాని తరంగా ఆవిర్బవిస్తోంది. మాట్లాడటం తప్ప, తెలుగు రాయలేరు, చదవలేరు (నాలు దశాబ్దాలు ఉన్నత విద్యార్థుల మధ్య వున్న ఉపాధ్యాయుడిగా నా సాక్ష్యం చెల్లుతుందనుకుంటాను) 'లాహిరి లాహిరి లాహిరిలో' అన్న పాటను వదిలి 'కెవ్వు కేక' అన్న పాటను ఆనందిస్తున్నారు. 'మాయాబజార్' సినిమాను 'కెవ్వు కేక' అన్న ఆనందించలేని అశక్తులుగా తయారవుతున్నారు. టివీలో దృశ్యాలను, సీరియళ్ళను, సినిమాలను “చూసి” ఆనందిస్తూ, క్రింద వచ్చే “స్కోల్స్" చదవకుండా వదిలేస్తున్నారు. ఒబామా భారత రిపబ్లిక్ దినోత్సవ అతిథి అని పత్రికలలో కాదు, టీవీ న్యూస్ రీడర్ చెప్పగా విని తెలుసుకుంటున్నారు. సినిమా నటీనటుల జీవన గాథలు, ప్రేమాయణాలు ట్విట్టర్లో చూసి ఆనందిస్తున్నారు ఆనందిస్తున్నారు. ఫేస్ బుక్, యూట్యూబ్ లో భావ వినిమయాలను గావించి సంతోషిస్తున్నారు. తెలుగురాని, ఇంగ్లీషు రాని స్థితిలో ఇరుక్కుపోయారు. వారి బుద్ధికుశలతనూ, కృషినీ, చిత్తశుద్దినీ చూస్తే ఆశ్చర్యపోతాం. వారి ప్రాపంచిక అవగాహనకు ఆనందపడతాం. కానీ గురజాడ 'దేశమును ప్రేమించుమన్నా' గీతం పాడలేని అశక్తతకు ఆగ్రహించి లాభం ఏముంది. ప్రిన్సిపాల్ గా నేను ఒక కాలేజీలో ఆగ్రహిస్తే "పాడతాం సార్, క్షమించండి, ఇంగ్లీషులో రాసివ్వండి" అ రాసివ్వండి” అని కోరారు. “.'ఈవేళ సమస్య అభిమాన దురభిమానాల గురించి కాదు. తెలుగు రాజకీయశక్తుల భవిష్యత్తు మీద. తెలుగు రానితనం ఆవిర్భవిస్తే, పత్రికలు చదివేవారు ఎవరు? మీ దూరదర్శన విశ్లేషణలు వినేవారు ఎవర్? మీ 'సినిమాలను' చూసేవారు ఎవరు? మీ కోట్ల రూపాయల పెట్టుబడి భవిష్యత్తు ఏమిటి? ఈ సినిమాలు ఇంగ్లీషులో తీస్తారా? మీ శాసన సభల్లో ఇంగ్లీషులో ప్రసంగిస్తారా? ఈవేళ గంట సేపు ఆంగ్లంలో పోలవరం మీద, రాజధాని అవసరాల మీద, కులాల రిజర్వేషన మీద శాసన సభలో మాట్లాడగలవారెందరున్నారు? వారు తెలుగులో కూడా అర్థవంతంగా మాట్లాడలేకపోవటానికి కారణం భాషాశక్తి లేకపోవటం. ఈ నేపథ్యంలో ఇంతటి మహత్తర పరిణామాలు పొంచివున్న తరుణంలో, తెలుగు ఎలా నేర్పుతారు? తెలుగు మాధ్యమమా, ఇంగ్లీషు మాధ్య మమా ప్రభుత్వం తేల్చుకోవాలి. రెండూ కలిపిన వివేకవి న్వాసమా... జాతీయ అవసరమా వారే తేల్చుకోవాలి. మనం ఊపిరాడకుండా ఊదరగొట్టవలసిన అవసరమే ముంది? కారణం ఈ ప్రక్రియ ఫలితం ప్రభుత్వానిది, ప్రజలది, అధికారులది, శాసనకర్తలది. కోట్ల రూపాయల వాణిజ్య అవసరాలు కల్గిన దూరదర్శనం, చలనచిత్ర నిర్మాతలది. ఆయా నటులదీ, రచయితలదీ. తెలుగు భాషా జ్ఞానం యువతలో అవసరమో, కాదో వారే తెలుసుకోవాలి. మేల్కొని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి.
అమ్మతనం.. మాతృభాష తీయదనం..