సంపాదకీయం | మంగళవారం 28 జనవరి, 2020 నేటి బాలలే రేపటి పౌరులు. వేరే మాటల్లో, వారే దేశ భావి నిర్ణేతలు. జాతి సంపదగా సంరకించుకోవాల్సిన పసివారిని వేధించి హింసించే కార్యం ఇండియాలో పెచ్చరిల్లుతోందంటూ యునిసెఫ్-'ప్రయాస్' అధ్యయనం వెల్లడించిన | పిల్లల్ని వివరాలు పదేళ్ల క్రితం గగ్గోలు పుట్టించాయి. 53 శాతం పిల్లలు లైంగిక వేధింపులకు పిల్లలపై గురవుతున్నారన్నది అప్పట్లో ఆ సంయుక్త సర్వే చెప్పిన లెక్క. దశాబ్దం తరవాతా పోటీపడుతున్నాయంటున్న బాలభారతానికి వేధింపుల చెర వీడలేదన్న కఠోర యథార్థాన్ని 'ప్రథమ్' తాజా | గణాంకాలుఅధ్యయన నివేదికాంశాలు కళ్లకు కడుతున్నాయి. భారత్ లోని పలు నగరాల్లో బాలల భద్రతపై చిన్నారుల అభిప్రాయాల క్రోడీకరణ- ఏడు నుంచి పదేళ్ల లోపువారూ వేధింపుల బారిన పడుతున్నట్లు తెలియజెబుతోంది. పాఠశాలకు వెళ్ళి వచ్చే మార్గంలో, విద్యాలయ ప్రాంగణాల్లో సూటిపోటి మాటలు, వెకిలి చేష్టలకు లేత మనసులెన్నో విలవిల్లాడుతున్నాయంటున్న 'ప్రథమ్' నివేదిక మరో కీలక పార్శ్వాన్ని ఆవిష్కరించింది. బస్తీల్లో తాగుడుకు బానిలైన వారిని చూసి 70 శాతానికి పైగా పిల్లలు భయభ్రాంతులవుతున్నారన్నది తీవ్రంగా కలచివేసే వాస్తవం. | పోలీసులు లంచాలు వేస్తారని, సక్రమంగా విధులు నిర్వర్తించరని, వేధింపుల బాధితులకు వారినుంచి దక్కే రక్షణ అంతంత మాత్రమేనని అత్యధికులు తలపోస్తుండటం- అవ్యవస్థకు నిలువుటద్దం. నాలుగైదు నిమిషాలకో పసికందుపై ఘోరం నమోదవుతున్నట్లు నేరగణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. తోటి విద్యార్థులు, | ఉపాధ్యాయులు, పోలీసులనేముంది- సన్నిహితులు, కుటుంబ సభ్యులనుంచీ - లేతమొగలకు రక్షణ, భరోసా కొరవడుతునటు కేంద్ర సర్కారు నిర్వహింపజేసిన జాతీయ నమూనా సేకరణ నివేదికే స్పష్టీకరించింది. వెరసి, ఇది పసితనంపై పైశాచికత్వం. ఒక్కముక్కలో, అభద్ర బాలభారతం! దేశవ్యాప్తంగా ర్యాగింగ్ ను సర్వోన్నత న్యాయస్థానం పదహారేళ్ల క్రితమే నిషేధించింది. ర్యాగింగ్ కు పాల్పడ్డవాళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు 2007లోనే పిలుపిచ్చింది. వాస్తవంలో పేరు, ప్రాంతం, సందర్భాలతో నిమిత్తం లేకుండా 2020 పాఠశాల స్థాయికీ వేధింపుల జాడ్యం విస్తరించి బాల్యాన్నే కుంగదీసేంతగా విజృంభిస్తోంది. | విజృంభిస్తోంది. ప్రాథమిక తరగతుల విద్యార్థులూ పోకిరి బెడదను తప్పించుకోలేని దుస్థితి, బాలల భద్రత ఎండమావేనని నిరూపిస్తోంది. లైంగిక దాడుల నుంచి | పిల్లల్ని కాపాడేందుకంటూ 2012లో 'పోక్సో' పేరిట 'కఠిన చట్టం' తెచ్చారు. పిల్లలపై నేరాలూ ఘోరాల్లో మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ లాంటివి పోటీపడుతున్నాయంటున్న బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంఘం | గణాంకాలు- ఆ చట్టం ఆచరణలో చట్టుబండలైందనేందుకు రుజువులు. పిల్లలపై ఎ వేధింపులు, అఘాయిత్యాలు జోరందుకుంటున్నా శిక్షల రెటు మూడుశాతం లోపే | , కావడం నిశ్చేష్టపరుస్తోంది. కొందరు ఉపాధ్యాయుల అతి పోకడలు రచ్చకెక్కిన నేపథ్యంలో పాశవిక పాఠశాలలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ | ఇటీవల కొరడా ఝళిపించింది. చిన్నారులపై శారీరక, మానసిక వేధింపుల్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలూ బాధితులకు ఆసరాగా నిలుస్తామంటున్నా, ప్రభుత్వపరంగానూ 'భరోసా' కల్పిస్తామంటున్నా- నికరంగా సాయం దక్కుతున్నది వేళ్లపై లెక్కించగల సందర్భాల్లోనే. కేవలం 35 | శాతం పిల్లలకే 'హెల్ప్ లైన్' నంబర్లు తెలుసునంటున్న 'ప్రథమ్' అధ్యయనం- విస్తృత జనతన కార్యక్రమాల ఆవశ్యకతను ఉద్బధిస్తోంది. బహార్, మహారాష్ట్ర విస్తృత జనచేతన కార్యక్రమాల ఆవశ్యకతను ఉద్బోధిస్తోంది. బిహార్, మహారాష్ట్ర లాంటిచోట్ల ఉపాధ్యాయులే విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడిన దుర్ఘటనలు, తెలుగు రాష్ట్రాల్లోనూ వేధింపుల ఉదృతి - బాలల వికాసం, రక్షణలన్నవి ఎంతగా ఛిద్రమవుతున్నాయో తేటపరుస్తున్నాయి! పిల్లలపై నేరాల రేటులో ఎకాయెకి 26 శాతం వృద్ధి నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ చెబుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లోనే ఏడాది వ్యవధిలో నమోదైన కేసులు 38 వేలకు మించిపోయాయి. వెలుగులోకి రాని ఉదంతాలెన్నో ఎవరికెరుక? బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, సిక్కిం, ఝార్ఖండ్, పశ్చిమ్ బంగ ప్రభృత రాష్ట్రాల్లో చిలవలు పలవలు వేసుకుపోతున్న పిల్లల అక్రమ రవాణాబాల్యాన్ని కర్కశంగా చిదిమేయడంలో ముఖ్య ప్రతినాయక పాత్ర పోషిస్తోంది. పసిపిల్లల లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు 16 దాకా 'భారత యాత్ర' తలపెట్టిన నోబెల్ పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి- తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా - పిల్లలతో నిత్యం మెలిగే ఉపాధ్యాయులు, బస్సు డ్రైవర్లు, ఆయాలు తదితరులందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించాలన్నది ఆయన సిఫార్సు. అంతర్జాల విప్లవం పుణ్యమా అని దేశంలోని 8-16 ఏళ్ల పిల్లల్లో అత్యధికులు సామాజిక ప్రసార మాధ్యమాలకు అలవాటు పడగా, వారిలో అయిదో వంతు బాలల్లో విపరీత ధోరణులు చోటుచేసుకుంటున్నాయన్న 'ఇంటెల్ సెక్యూరిటీ' అధ్యయనం మరింత ప్రమాదకర కోణాన్ని ఆవిష్కరించింది. మాదక ద్రవ్యాల వాడకం, బ్లూవేల్ తరహా ప్రకోపాలకు అక్కడే బీజాలు పడుతున్నాయి! నార్వే వంటి దేశాలు పిల్లలపై ఎటువంటి నేరాలకైనా కఠిన శిక్షలు అమలుపరుస్తున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్ వంటివి కచ్చితమైన విధినిషేధాలతో బాలల సంరక్షణకు గొడుగు పడుతున్నాయి. స్వేచ్ఛ, రక్షణ, విశ్వాసంతో కూడిన బాల్యదశను పొందడం పిల్లల హక్కు. ఐరాస బాలల హక్కుల ప్రకటనపై మూడున్నర దశాబ్దాల నాడు సంతకం చేసిన భారత్ స్వీయ బాధ్యతా నిర్వహణలో ఇక ఎంత మాత్రం అలసత్వం వహిం వహించకూడదు. పిల్లలకు భద్రమైన బాల్యాన్ని ఇవ్వగలిగితేనే ఏ దేశానికైనా ఉజ్వల భవిష్యత్తు!
పసితనంపై పైశాచికత్వం