సూల దేశీయోతతి (జీడీపీ) వది రేట సవరణ నేడు బారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఫుట్ బాల్ ఆటగా మారింది. వ ృద్ధి రేటు సాధనలో తమదే పైచేయి అని ఎవరికివారు చాటుకొంటున్నారు. జీడీపీ వృద్ధిరేటు లెక్కించే విధానం మారడం వల్ల సంభవించిన తంటా ఇది. సాధారణంగా జీడీపీ వృద్ధి గణించడానికి ఆర్థికంగా పెద్దగా ఒడుదొడుకులు లేని సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆ మూల సంవత్సరం నుంచి వరసగా కొనేళపాటు జీడీపీ గణాంకాలను సేకరిస్తారు. ఆర్థిక వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చే మార్పులను కచ్చితంగా పట్టుకోవడానికి ప్రాతిపదిక సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఇలా మార్పు సంభవించినప్పుడు పాత లెక్కలు మారి కొత్తవి వస్తాయి. పాతవాటిని జీడీపీ పూర్వశ్రేణిగా, కొత్త లెక్కలను నూతన శ్రేణిగా వ్యవహరిస్తారు. దేశ ఆర్థిక కార్యకలాపాలను మూల్యాంకనం చేసే జాతీయ ఖాతాల వ్యవస్థ (ఎస్ఎస్)ను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎఓ) అజమాయిషీ చేస్తుంది. జాతీయ ఖాతాల్లో జీడీపీ అనేది కీలక అంతర్భాగం. గతంలో 2004-05ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని ఆర్థిక కార్యకలాపాలను తద్వారా జీడీపీ వృద్ధిని గణించేవారు. 2015 జనవరిలో ఎన్ఏఎస్ 2011-12 సంవత్సరాన్ని కొత్త ప్రాతిపదికగా తీసుకుంది. కాలక్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థలో సహజంగానే మార్పులు, హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పాత సర్వేల్లో వెల్లడైన సమాచారం కొత్త సర్వేల్లో మారిపోతుంది. మారిన వాస్తవ చిత్రాన్ని ప్రతిబింబించడానికి సాధారణంగా పదేళ్లకు ఒకసారి కొత్త ప్రాతిపదిక సంవత్సరాన్ని తీసుకుంటారు. ఈసారి ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చడంతోపాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జాతీయ ఖాతాల వ్యవస్థ (ఎస్ఏఎస్) విధివిధానాలను సరిదిద్దారు. ప్రపంచ దేశాల జాతీయ ఖాతాలను పోల్చిచూసి కచ్చితమైన నిర్ధారణలకు రావడానికి ఈ మార్గదర్శక సూత్రాలు ఉపకరిస్తాయి. కానీ, జీడీపీ నూతన శ్రేణిని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే వాటి ఆమోదనీయత, సాధికారత మీద వివాదం రేగింది. 'సాధారణంగా ప్రాతిపదిక సంవత్సరం మారినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం స్వల్పంగా పెరుగుతుంది. వృద్ధిరేట్లు పెద్దగా మారవు. కానీ, జీడీపీ నూతన శ్రేణి ప్రకారం ఇది తారుమారైంది. కొత్త గణాంకాల ప్రకారం ఆరిక పరిమాణం స్వల్పంగా తగి జీడీపీ తదితర వ ఎది రేటు స్వల్పంగా పెరిగాయి' అని ప్రముఖ విశేషకులు పొఫెసర్ మహేంద్ర దేవ్, ప్రొఫెసర్ నాగపాల్ వివరించారు. ఉదాహరణకు జీడీపీ ఉంటాయి. ఈ వాస్తవ ప్రాతిపదిక వడంతోపాటు పూర్వ శ్రేణి ప్రకారం 2013-14లో జీడీపీ వృద్ధిరేటు 4.8 శాతం. నూతన శ్రేణి ప్రకారం అది 6.2 శాతం. నూతన శ్రేణి ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. విమర్శకులు దీన్ని ఉపాధిరహిత అభివృద్ధి అని ఈసడిస్తున్నారు. జీడీపీ కొత్త శ్రేణి అనుసరించిన పద్దతిలో గతంకన్నా భిన్నమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి సంశ్రామిక సంస్థల ఉత్పత్తిని గణించడానికి వార్షిక పరిశ్రమలు సర్వే సమాచారానికి తోడు ఎమ్ సి ఏ21 (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ 21) విభాగ సమాచారాన్ని తీసుకున్నారు. ఈ-పరిపాలన కింద కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు 5.24 లక్షల ప్రైవేటు సంస్థలు (ఫైనాన్స్ కంపెనీలు కాకుండా) సమర్పించిన వార్షిక ఖాతా వివరాలు ఎమ్ సీఏ21లో ఉంటాయి. ఎమ్ సీఏ21 2006లో మాత్రమే అమలులోకి వచ్చింది. 2011-12కి ముందు ఎంసీఏ21 సమాచారం అందుబాటులో ఉండేది కాదు. అందువల్ల జీడీపీ గణన పకడ్బందీగా సాగలేదు. రెండు- ఎంటర్ ప్రైజ్ అనే పదానికి బదులు ఎస్టాబ్లిష్ మెంట్ అనే పదం వాడారు. ఏ కర్మాగారానికి ఆ కర్మాగారం వంతున సమాచారం సేకరించే బదులు మొత్తం సంస్థ సమాచారం సేకరించడానికి ఈ మార్పు ఉపకరించింది. ఒక భారీ వ్యాపార సంస్థ (ఎంటర్ ప్రైజ్) కింద ఎన్ని కర్మాగారాలు కాకుండా) ఎమసీఏ 21 121 సమాచార సాగలేదు. వాడారు. (ఎస్టాబ్లిష్ మెంట్స్) ఉండవచ్చునని ఇక్కడ గమనించాలి. మూడు- స్టాక్ ఎక్స్చేంజీలు, మ్యూచువల్ ఫండ్లు, పింఛను నిధులు, సెబి, పీఎస్ఆర్డీఏ, ఐఆర్టీఏ వంటి నియంత్రణ సంస్థల గురించి సమాచారం సేకరించారు. నాలుగు- స్థానిక సంస్థల ఖాతాలను మరింత లోతుగా పరిశీలించారు. అయిదు- అసంఘటిత రంగ కార్మికుల ఉత్పాదకతను గణించే పద్ధతి మార్చారు. ఆ వ్యాపార సమాచార సేకరణకు మరింత సమర్థమైన పద్దతి అనుసరించారు. జీడీపీ పూర్వశ్రేణి (2004-05)కి, నూతన శ్రేణి (2011-12)కి మధ్య గల ప్రధాన వ్యత్యాసాలివి. జీడీపీ విభాగాల (ఎస్టాబ్లిష్ మెంట్స్) ఉండవచ్చునని ఇక్కడ గమనించాలి. మూడు- స్టాక్ ఎక్స్చేంజీలు, మ్యూచువల్ ఫండ్లు, పింఛను నిధులు, సెబి, పీఎస్ఆర్డీఏ, ఐఆర్టీఏ వంటి నియంత్రణ సంస్థల గురించి సమాచారం సేకరించారు. నాలుగు- స్థానిక సంస్థల ఖాతాలను మరింత లోతుగా పరిశీలించారు. అయిదు- అసంఘటిత రంగ కార్మికుల ఉత్పాదకతను గణించే పద్ధతి మార్చారు. ఆ వ్యాపార సమాచార సేకరణకు మరింత సమర్థమైన పద్దతి అనుసరించారు. జీడీపీ పూర్వశ్రేణి (2004-05)కి, నూతన శ్రేణి (2011-12)కి మధ్య గల ప్రధాన వ్యత్యాసాలివి. జీడీపీ పూర్వ శ్రేణి సమాచారాన్ని నూతన శ్రేణికి అనుగుణంగా సవరించి భాష్యం చెప్పారు. అందువల్ల 1993 సమాచారాన్ని 2011-12 సమాచారంతో పోల్చి చూడటం వీలైంది. సాధారణంగా కొత్త ప్రాతిపదిక సంవత్సరంతో జీడీపీ నూతన శ్రేణి వివరాలను విడుదల చేసినప్పుడు పూర్వశ్రేణి వివరాలనూ విడుదల చేస్తారు. కానీ, సీఎఓ ఈసారి అలా చేయలేదు. జాతీయ గణాంక కమిషన్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాములోకన్నా యూపీఏ జమానాలో (2004-05 నుంచి 2013-14 వరకు) ఆర్థికాభివృద్ధి వడివడిగా చోటుచేసుకుంది. కానీ జీడీపీ నూతన శ్రేణి గణాంకాలను వర్తింపజేసినప్పుడు అభివృద్ధి చిత్రం మారుతుంది. మొత్తంమీద జీడీపీ నూతన శ్రేణి ప్రకారం పారిశ్రామికోత్పత్తి కొంత పెరిగి సేవారంగ వాటా కాస్త తగ్గింది. మళ్ళీ సేవారంగంలో హోటళ్లు, వ్యాపారం, కమ్యూనికేషన్లు, రవాణా విభాగాల వాటా తగ్గి- ఫైనాన్స్, బీమా, స్థిరాస్తి రంగాల వాటా కొంత పెరిగింది. ఈ హెచ్చుతగ్గులకు కారణాలను సశాస్త్రీయంగా వివరించాల్సి ఉంది. - జీడీపీ నూతన శ్రేణిలో మార్పుల వల్ల అభివృద్ధి రేటు కాస్త ఎక్కువగా కనబడుతోంది. ఉదాహరణకు పూర్వ శ్రేణి ప్రకారం వృద్ధిరేటు 10.26 శాతమైతే నూతన శ్రేణి కింద అది 10.78 శాతంగా కనిపిస్తోంది. ఇది కేవలం 0.5 శాతం పెరుగుదల. ఈ మాత్రానికే యూపీఏ, ఎన్డీయేలు గొప్పలకుపోతుండటం విడ్డూరంగా ఉంది. ఈ స్వల్ప వ్యత్యాసం కూడా విధివిధానాల్లో మార్పుల వల్ల కనిపించిందే తప్ప- బ్రహ్మాండం ఏదో బద్దలైందని కాదు. అందుబాటులో ఉన్న అన్ని విధివిధానాల ప్రకారం జీడీపీ శ్రేణులను లెక్కించి ఒకదానితో ఒకటి పోల్చి వాస్తవ చిత్రాన్ని సీఎజ్ అందించాలి. రాజకీయ పార్టీలు ఆ వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి తప్ప, అహేతుక వాదనలతో వివాదాలకు దిగకూడదు.
జీడీపీ లెక్కల పితలాటకం