మహిళా సాధికారత సాధ్య మేనా?

మహిళలకు సరైన భాగస్వామ్యం దక్కితేనే సామాజికాభివ ృద్ధి శీఘ్రతరమవుతుందని జాతిపిత ఏనాడో ఉద్బోధించారు. స్త్రీల జీవన ప్రమాణాలే దేశాభ్యున్నతి నిర్ధారణకు గీటురాళ్లవుతాయన్న ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, లింగపరమైన దుర్విచక్షణకు భరతవాక్యం పలకాలని అలనాడే పిలుపిచ్చారు. ఏడు దశాబ్దాల స్వపరిపాలనలో ఆ వారి మహితోక్తులకు మన్నన కొరవడ్డ పర్యవసానంగా, భారతావని- ప్రపంచం ఎదుట తల దించుకోవాల్సి వస్తోంది. ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యకరమైన జీవనం, రాజకీయ ప్రాతినిధ్యం- ఈ నాలుగు కీలకాంశాల ఆధారంగా 149 దేశాల గతిరీతులు మదింపువేసి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన అంతర్జాతీయ లింగవ్వత్వాస చాటుతూనే సూచీలో భారత్ వరసగా రెండో ఏడాదీ నూట ఎనిమిదో ర్యాంకుకు పరిమితమైంది. పదేళ్లుగా అగ్రస్థానాన నిలిచి ఐర్లాండ్ అబ్బురపరుస్తుండగా- నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ తరవాతి మూడు ర్యాంకుల్ని సగర్వంగా ఒడిసిపట్టాయి. ఆఫ్రికాదేశాలు రువాండా (6), నమీబియా (10) తొలి పది ర్యాంకుల్లో చోటు సంపాదించాయి. అదే, దక్షిణాసియాను పరికిస్తే- బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కన్నా ఇండియా వెనకబడటం దిగ్ర్భాంతపరుస్తోంది. ఆర్థిక భాగస్వామ్యం ప్రాతిపదికన ఫ్రాన్స్ (63), చైనా (86)లతో పోలిస్తే భారత్ 142వ స్థానం పొందడం దేశీయంగా మహిళల 'స్థాయి'ని కళ్లకు కడుతోంది. విద్యారంగంతోపాటు హింసమహిళల ఆరోగ్య పరిరక్షణ, ఉపాధి అవకాశాలపరంగానూ భారత్ మరింతగా పుంజుకోవాలన్నది అంతర్జాతీయ లింగ వ్యత్యాస సూచీ ప్రస్ఫుటీకరిస్తున్న సత్యం. పార్టీలు, నాయకులు ఎవరెంతగా స్త్రీ సాధికారతపై అలుపు లేకుండా ఊదరగొడుతున్నా- వాస్తవిక కార్యాచరణలో నిబద్ధత కరవేనని నిరూపిస్తున్న ఈ సూచీ, దేశవ్యాప్తంగా వ్యూహ నిర్ణేతలకు కనువిప్పు కావాలి. భారత రాజ్యాంగం స్త్రీ పురుష సమానత్వ భావనకు ఎత్తుపీట వేసింది. . లభించింది దేశ జనాభాలో దాదాపు అర్ధభాగమైన మహిళల విద్య, ఆరోగ్యాలపై ప్రభుత్వాలు మొదటినుంచీ ప్రణాళికాబద్ద కృషి చేపట్టి ఉంటేసిఫార్సుల్ని సామాజికార్థిక రంగాల్లో ఇప్పటికే అర్థవంతమైన సమ్మిళిత భాగస్వామ్యం నమోదై, ఎన్నో అద్భుత విజయాలకు గట్టి పునాది ఏర్పడి ఉండేది. దశాబ్దాల తరబడి ఆడపిల్లల పట్ల సమాజంలో వేరూనుకున్న చిన్నచూపు, నేటికీ దేశంలో పలుచోట్ల భ్రూణ హత్యల్ని ప్రజ్వరిల్లజేస్తూనే ఉంది. జాతికి బడ్జెట్లుఆంగ్ల పాలకుల చెరవీడిన ఇన్నేళ్ల తరవాతా 'బేటీ బచావో- బేటీ పఢావో' తరహా పథకాల్ని పట్టాలకు ఎక్కించాల్సి రావడం, మునుపటి ప్రభుత్వాల ప్రాథమ్యాలు గాడి తప్పాయనడానికి ప్రబల నిదర్శనం. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ సంం ఆ మధ్య వెల్లడించిన గణాంకాల ప్రకారం, 15-18 ఏళ్ల మధ్య వయస్కుల్లో 39 శాతానికి పైగా ఆడపిల్లలు ఏ చదువులకూ నోచడంలేదు. వారిలో అత్యధికులు ఇంటిపనుల్లోనో బిచ్చమెత్తుకుంటూనో గడుపుతున్నారు. బేటీ పఢావో వంటి పథకాలూ వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించలేకపోతున్నాయి! మహిళగా పరిపూర్ణత్వం పరిపూర్ణత్వం సంతరించుకోకుండానే బిడ్డలకు జన్మనిస్తున్న చిట్టితల్లుల సంతర ఉదంతాలు, పేరుగొప్ప మాతాశిశు సంరక్షణ యోజనల అసమర్థతకు రుజువుగా పెచ్చరిల్లుతున్న ప్రసవ మరణాలు, పౌష్టికాహార లోపాలుప్రభుత్వాలు వడివడిగా పూడ్చాల్సిన కంతలెన్నో ఉన్నాయని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ పోషకాహార నివేదికల్ని పరికిస్తేప్రజాప్రభుత్వాల ఉదాసిన వైఖరులు, పర్యవేక్షణ లోపాల కారణంగా ఎందరెందరు అనారోగ్యకర భారతావనికి ప్రతినిధులవుతున్నారో బోధపడుతుంది. ఈ గడ్డమీద కన్ను తెరిచిన ప్రతి ఆడపిల్లకూ కనీసం పద్దెనిమిదేళ్లదాకా ఉచిత, నిర్బంధ, ప్రయోజనకర విద్య అందించడానికి ప్రభుత్వాలు కంకణబద్ధమైతే- స్త్రీ జన సముద్ధరణలో అదో గొప్ప మైలురాయిగా నిలుస్తుంది! - ప్రపంచ ఆర్థిక వేదిక కూర్చిన లింగవ్యత్యాస సూచీ కన్నా ముందేదేశంలో మహిళల సామాజికార్థిక దుస్థితిగతులపై పలు సంస్థలు, ఎందరో నిపుణుల విశ్లేషణలు క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దంపట్టాయి. హింస, వేధింపులు, లింగ నిష్పత్తి క్షీణత, ఆర్థిక స్వావలంబన లేమిని అవి ప్రధానంగా వేలెత్తి చూపాయి. ఆ సమస్యలకు విరుగుడు, సాధికారతతోనే ముడివడి ఉంది! భారతీయ కట్టుబాట్లు, పాశ్చాత్య సంస్కృతికి భిన్నమైన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆంక్షల కారణంగా ఎందరో విద్యావంతులు సైతం గృహావరణానికే పరిమితం కావడం చూస్తున్నాం. 57 దేశాల మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సూచీలో భారత్కు లభించింది 52వ స్థానం. పదోతరగతి అనంతర విద్యాభ్యాసంలో యువతుల సంఖ్య పెరిగి, ఆర్థిక సేవల నిర్వహణలో స్వేచ్ఛ లభిస్తేనే మెరుగుదల సాధ్యమన్న సహేతుక సిఫార్సుల్ని ప్రభుత్వాలు పేరబెడుతున్నాయి. అవకాశాల పరికల్పనలో లింగ విచక్షణను రూపుమాపగలిగితే భారత్ అభివృద్ధి ప్రస్థానవేగం ఇతోధికమవుతుందని మెకిన్సే నివేదిక లోగడే స్పష్టీకరించింది. కేవలం సదాశయ ప్రకటనలు, ఘనతర తీర్మానాలతోనే స్త్రీ శక్తి ఇనుమడించదు. బడ్జెట్లు, ప్రణాళికలు, పథకాల అమలులో ఆడపిల్లల విద్య, ఆరోగ్యం , ఉపాధి భద్రతలకు ప్రభుత్వాలు సమధిక ప్రాధాన్యం కల్పించాలి. స్త్రీల శక్తి సామర్థ్యాలు జాతికి గరిష్ఠంగా ఉపయుక్తమయ్యే వాతావరణం నెలకొనాలంటే, ఇతోధిక రాజకీయ నిర్ణయాధికారం వారికి దఖలుపడాలి. చట్టసభల్లో మూడోవంతు కోటా కల్పించడానికి పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే- మార్పు నికరంగా మొదలైనట్లు. దేశంలో లింగవిచక్షణకు చెల్లుకొట్టి, మహిళాభ్యున్నతిని సాకారం చేసే క్రమంలో అదే నిర్ణయాత్మకమైన తొలిమెట్టు! మహిళా సమాజ స్పూర్తి ప్రదాత


మహిళా సమాజ స్పూర్తి ప్రదాత


స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి తరు పున మహిళా విభాగంలో ముందుండి పోరాడిన ధీర వనిత , భారతీయ కోకిల,మొట్టమొదటి మహిళా గవర్నర్, భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలు అయిన సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు.. తల్లిదండ్రు లు అఘోరనాథ చటో పాధ్యాయ, వరద సుందరీ దేవి. శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన అఘోరనాథ చటి పాధ్యాయ హైదరాబాద్లో నిజాం కాలేజీ ని స్థాపించి, ప్రిన్సుపాల్ చాలా కాలం పనిచేశారు. తల్లి వరద సుందరీ దేవి కవియిత్రి. ఈమె జన్మ దినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ దేశం బానిసత్వం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచి విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్చా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే సరోజినీ నాయుడు మహత్తర ఆశయం. భారతదేశంలో పురుషులే కాక, మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీర మహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు ప్రథమురాలు. సరోజిని నాయుడు మంచి రచయిత్రి. పద్య రచయిత. చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా ఇష్టం ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది సరోజిని నాయుడు పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్ లేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల శ్రద్ధ మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు దగ్గరలోని వీరి ఇంటిని సరోజినీ నాయుడుగారి తదనంతరం తమ ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డన్ థ్రెషోల్డ్ గా పేరు మార్చటం జరుగుతుంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్ యూనివర్శిటిగా రూపొందింది. పదమూడవ యేట చాలా పెద్ద రచన రచించింది. దానిపేరు సరోవరరాణి.