ప్రకృతి విపత్తు

భారత్ లో జూన్ లో కురిసిన కుండపోత వర్పాలకు మిజోరం, అసోం, త్రిపుర, పశ్చిమ్ బంగ, మహారాష్ట్ర భారీ ఆస్తి నష్టాలతోపాటు ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. జులైలో కేరళను జలప్రళయం ముంచెత్తింది. దిల్లీతో సహా అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ వరదల వల్ల వేల మంది నిర్వాసితులయ్యారు. తమిళనాడుకు గజ, ఆంధ్రప్రదేశ్ కు తిల్లీ, పెథాయ్ తుపానులు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ప్రపంచంలో వాతావరణ విపత్తులకు ఎక్కువగా గురయ్యే దేశాల జాబితాలో హైతీ, జింబాబ్వే, ఫిజీ, శ్రీలంక, వియత్నామ్ తరవాతి స్థానం భారతదేశానిదే. ప్రతి లక్ష మంది జనాభాలో వాతావరణ వైపరీత్యాలకు ఎంతమంది నష్టపోతున్నారో గణించి జర్మన్ వాచ్ అనే సంస్థ ఈ జాబితాను రూపొందించింది. వరదలు, తుపానులు, అనావ ృష్టి, వడగాడ్పులు పోనుపోను తీవ్రమవుతూ అల్పాదాయ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. 2016లో ప్రకృతి విపత్తుల కారణంగా 2119 మంది మృతిచెందారు. సుమారు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. 2005-2014 మధ్య భారత్ 167 ప్రక తి వైపరీత్యాలకు గురై దాదాపు 3.3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను జరిగే నష్టపోయింది. 1998-2017 మధ్య కాలంలో ప్రకృతి విపత్తులు దేశానికి రూ. 5,60,000 కోట్ల నష్టం కలిగించాయని ఐక్యరాజ్యసమితి లెక్కగట్టింది. ఈ విధంగా అపార నష్టం చవిచూసిన దేశాల జాబితాలో భారత్ అయిదో స్థానంలో ఉందని ఐరాస విపత్తు నివారణ సంస్థ అధ్యయనం వెల్లడించింది. గత రెండు దశాబ్దాల్లో ప్రకృతి ఉత్పాతాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలమంది మరణించగా, రూ.210 లక్షల కోట్ల దాకా ఆర్థిక నష్టం జరిగినట్లు అంచనా. భారీ వరద తాకిడికి గురైన ప్రాంతం పూర్తిగా తేరుకోవడానికి పదేళ్లు పడుతుందని 2015లో అంబేడ్కర్ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ప్రకాశ్ త్రిపాఠీ అధ్యయన పత్రం వివరించింది. సహాయ పునరావాస కార్యక్రమాలకు సగటున రెండు సంవత్సరాలు పడితే జీవావరణ సమతౌల్య పునరుద్ధరణకు అయిదేళ్లకు పైగా సమయం 2020 తీసుకుంటుంది. ఈ లెక్కన ఏటా తుపానులు, వరదలకు గురవుతున్న రాష్ట్రాల్లో తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడం రాష్ట్రాల్లోకన్నా కష్టమే! వరదలను నివారించలేం కానీ, వాటి వల్ల కలిగే నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి పరిమితం చేయవచ్చు. వాతావరణ వైపరీత్యాలను ముందే పసిగట్టి, ప్రజలను అప్రమత్తం చేయడం అన్నింటికన్నా ముఖ్యం. వరద నీటిని ఒడిసిపట్టే జలాశయాలు, వరద నీటిని మళ్లించే కాల్వలను నిర్మించడం అవసరం. వరద తీవ్రతను నిరోధించే కరకట్టలను నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాలను హిమాచల్ నియంత్రించేందుకు భారత్ రకరకాల పథకాలు రచించినా అవి కాగితాల మీదే ఉండిపోయాయి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలని తెలిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జనావాసాలు, కర్మాగారాలు ఏర్పాటవుతున్నాయి. వసతుల నిర్మాణం యథేచ్ఛగా సాగిపోతోంది.నదులు, ఉపనదులపై లెక్కకు మించి ఆనకట్టలు నిర్మిస్తే జరిగే నష్టమేమిటో ఈ ఏడాది కేరళ వరదలు చాటిచెప్పాయి. నూరేళ్లలో కనీవినీ ఎరగని వరదలను తట్టుకోవడానికి రాష్ట్రంలోని అన్ని ఆనకట్టల గేట్లు ఎత్తేయక తప్పలేదు. దేశంలో మొత్తం 4,862 ఆనకట్టలు ఉన్నాయి. వాటిలో 349 ఆనకట్టలకు మాత్రమే వరదలకు సంబంధించిన అత్యవసర కార్యాచరణ పథకాలను రూపొందించారని 2017లో కాగ్ నివేదిక వెల్లడించింది. కేరళలోని 44 నదులపై 61 ఆనకట్టలు నిర్మించినా వాటికి అత్యవసర కార్యాచరణ పథకాలను కానీ, విపత్తు నిభాయింపు విధివిధానాలను కానీ సిద్ధం చేయలేదు. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం వరద హెచ్చరిక వ్యవస్థలైనా లేవని కాగ్ పేర్కొంది. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలోకెల్లా దేశ రాజధాని దిల్లీకే ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువని కేంద్ర హోం శాఖ ముసాయిదా నివేదిక తెలిపింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ సంస్థ (యూఎన్టీపీ) సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో జాతీయ ప్రకృతి విధ్వంస ప్రమాద సూచీని పొందుపరచారు. దాని ప్రకారం అన్ని రాష్ట్రాల్లోకన్నా మహారాష్ట్రకే ముప్పు ఎక్కువని తేలింది. దాని తరవాతి స్థానాల్లో పశ్చిమ్ బంగ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. వరదల వల్ల ప్రజలు, వ్యవసాయం, పశుగణం, పర్యావరణాలకు ఎక్కువ నష్టం వాటిల్లుతున్న రాష్ట్రాలతో ఈ సూచీని రూపొందించారు. అందులో ఆంధ్రప్రదేశ్ సైతం ఉంది. వరదలు, తుపానులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వరద తీవ్రతను తట్టుకునే కట్టడాలనూ నిర్మించడంలో గుజరాత్, తమిళనాడు, అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ ముందు న్నాయి. అందుకే అవి జన నష్టాన్ని, ఆర్థిక నష్టాలను తగ్గించగలుగుతున్నాయి. వరదలు ఏవో కొన్ని రాష్ట్రాలకే పరిమితమని ఉదాసీనత వహించకూడదు. ప్రపంచంలో వరదల వల్ల అత్యధిక ప్రజలు నిర్వాసితులైంది భారతదేశమేనని జెనీవాకు చెందిన అంతర్గత నిర్వాసిత పరిశోధన కేంద్రం (ఐడీఎంసీ) సెప్టెంబరు 12న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ ఆరు నెలలకు ఒకటి చొప్పున ఏటా రెండు నివేదికలు వెలువరిస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన ప్రథమార్ధ నివేదిక ప్రపంచంలో జూన్ వరకు వరదలు సృష్టించిన బీభత్సాన్ని అంచనా వేసింది. అందువల్లనే జులై నుంచి కేరళ, కర్ణాటక, నాగాలాండ్ లో వరదలు సృష్టించిన నష్టాలను నివేదికలో ఉటంకించలేదు. కేరళ వరద విలయంలో సుమారు 500 మంది మరణించగా 15 లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఇతర దేశాల్లో అంతర్యుద్ధాలు, భూకంపాలు, సునామీల వల్ల ఎక్కువమంది నిర్వాసితులైతే- భారత్ లో ప్రధానంగా వరదల తాకిడికి జనం కకావికలమవుతున్నారు.