చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో దత్తత చట్టానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గతంలోనే పదును పెట్టింది. బాలల న్యాయచట్టం (జువైనల్ జస్టిస్- జేజే) ఆధారంగా నూతన మార్గదర్శకాలు రూపొందించింది. అన్ని బాలల సంరక్షణ కేంద్రాల (సీసీఐ)ను 'జేజే' చట్టం కింద తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంది. చట్టవిరుద్ధంగా దత్తత ఇస్తున్న ది. చట్టవిరుద్ధంగా దత్తత ఇస్తున్న ఆస్పత్రులు, గుర్తింపు లేని సీసీఐలపై కఠిన చర్యలు తీసుకునే బాధ్యతను సీడబ్ల్యూసీలకు అప్పగించింది. అయినా ఇప్పటికీ వెలుగు చూస్తున్న శిశు విక్రయాల ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. రెండేళ్లలోపు పిల్లలను దత్తత తీసుకునేందుకే దంపతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఆ వయసు పిల్లలు తగినంత మంది లేరు. బాలల దత్తత వనరుల సమాచార, మార్గదర్శక వ్యవస్థ (కేరింగ్స్) నివేదిక ప్రకారం, దత్తతకు దరఖాస్తు చేసుకున్న ప్రతి తొమ్మిది మంది దంపతులకు ఒక చిన్నారి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరుడు మే నాటికి దత్తత కోసం 15,200 మంది దరఖాస్తుదారులు ముందుకు రాగా, 1,766 మంది చిన్నారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీరిలో 1,279 మంది దివ్యాంగులైన 'ప్రత్యేక అవసరాలు' కలిగినవారున్నారని అంచనా. , దేశంలో దత్తత అవకాశం రాని పిల్లలను, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను విదేశీ దంపతులు దత్తత తీసుకొంటున్నారు. ఈ విషయంలో మంత్రిత్వశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక అమెరికా పౌరుడు దత్తత తీసుకున్న మూడేళ్ల భారతీయ బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో కేంద్ర దత్తత వనరుల సంస్థ (కారా) నిబంధనలు కఠినతరం చేసింది. దత్తత కోరే విదేశీయులు, ప్రవాస భారతీయులు తమ మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉందని 2020 ధ్రువపత్రం సమర్పించాలని సూచించింది. బిహార్‌కు చెందిన మూడేళ్ల బాలిక సరస్వతిని 2016 జులైలో టెక్సాస్ కు చెందిన రిచర్డ్ సన్ దంపతులు దత్తత తీసుకుని షేరిన్ మాధ్వుగా పేరు మార్చారు. అమెరికా వెళ్లిన తరవాత అనుమానాస్పద పరిస్థితుల్లో బాలిక మృతి చెందడంతో న్యాయస్థానం ఆ దంపతులకు జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి దత్తత పిల్లలకు పాస్పోర్ట్ నిబంధనలను విదేశాంగ శాఖ కఠినతరం చేసింది. దతత ప్రక్రియలో వేగాన్ని పెంచేందుకు కేంద్ర మహిళా, శిశు అభివృది శాఖ దత్తత ప్రక్రియలో వేగాన్ని పెంచేందుకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటోంది. కుటుంబ న్యాయస్థానం నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి దత్తత న్యాయ వ్యవహారాలను బదిలీ చేయడానికి సుముఖత తెలిపింది. నలభై ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు దత్తతలో ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించింది. దంపతులతో పోలిస్తే ఒంటరి మహిళలకు ప్రాధాన్యం కల్పించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆరేళ్లుగా దత్తత పొందిన చిన్నారుల్లో 60 శాతం బాలికలే ఉన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ముందుంది. కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. 2017-18లో దేశవ్యాప్తంగా 3,276 మంది పిల్లలను దత్తత ఇవ్వగా, వారిలో 1,858 మంది బాలికలు. 1418 మంది బాలురు ఉన్నారు. అధికారులు, స్వచ్చంద సంసల బాలికలు, 1,418 మంది బాలురు ఉన్నారు. అధికారులు, స్వచ్చంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవలి కాలంలో దత్తతలు పెరుగుతున్నాయి. దేశాంతర దత్తతలూ అధికం కావడం- అనాథ పిల్లల పాలిట ఆశాదీపం. భారతీయ బాలలు దత్తత కుటుంబంతో సహా అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో నివసిస్తున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయిదేళ్ల సరాసరి పరిశీలిస్తే 59.77 శాతం దంపతులు బాలికలను, 40.23 శాతం బాలురను దత్తత తీసుకున్నారు. సమాజంలో బాలికల పట్ల వస్తున్న సానుకూల దృక్పథానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. లింగనిష్పత్తి తక్కువగా ఉన్న హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ లోనూ బాలికల దత్తతకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 17 రాష్ట్రాల్లో లింగనిష్పత్తి శాతం తగ్గుతోందని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడిస్తోంది. 2014లో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలున్న గుజరాత్ లో తాజాగా ఆ సంఖ్య 854కు పది పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లల దత్తత కోసం తెలంగాణలో 1000 మంది దరఖాస్తు చేసుకోగా 330 మంది, ఆంధ్రప్రదేశ్ లో 380 మంది చిన్నారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దత్తతకు సంబంధించి గత ఏడాది జనవరి 16 నుంచి కేంద్రం నూతన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ముందుగా దంపతులు దత్తత కేంద్రాలు లేదా ఆన్లైన్ లో ఆధార్ కారు, ఆదాయ వివరాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దత్తతకు గిరాకీ ఉన్న స్థాయిలో పిల్లలు అందుబాటులో లేకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది. జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో బృందం క్షేత్రస్థాయిలో దత్తత వివరాలు సేకరిస్తోంది. సీపీఐలలో ఉంటున్న పిల్లలు, సంరక్షకులు, నిర్వాహకులతో మాట్లాడి వాటి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. ఫలితంగా దత్తతల కొరత కొంతమేర తీరే అవకాశం కనిషి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు పౌర సమాజం చొరవ తీసుకుంటే అనాధ బాలలకు కుటుంబ బంధాలు మరింత బలపడతాయి! -
అనాద బాలలకు ఆసరా ఏది!?