ఉగ్ర నిర్మూలనతోనే శాంతిస్థాపన

ఉగ్ర నిర్మూలనతోనే పాకిస్థాన్ ఐఎన్ఏ తొత్తులుగా మారి భారత వాణిజ్య రాజధానిని గడగడలాడించడానికి దావూద్ ఇబ్రహీం, మెమన్లతో పాటు ఈ ముఠా పన్నిన భయానక కుట్ర 257మంది అమాయకుల ప్రాణాల్ని కబళించింది. మరెందరినో క్షతగాత్రులుగా మిగిల్చింది. వరస బాంబు పేలుళ్ల ధాటికి ఎయిరిండియా భవంతి, స్టాక్ ఎక్సే ఛేంజ్, జవేరీ బజార్, అయిదు నక్షత్రాల హోటళ్లు సీరాక్, జుహు సెంటార్ పరిసర ప్రాంతాలు భయవిహ్వలమయ్యాయి. అత్యంత జనసమ్మర్థం గల కూడళ్లను ఎంచుకొని కారు, స్కూటర్, సూట్ కేస్ బాంబులతో మహా మారణహోమం సృష్టించిన భయంకర ఉగ్రదాడి అది. ఆ కేసులో మలి అంచె శిక్షల విధింపునకు ఎకాయెకి రెండు పుష్కరాల సుదీర్ఘకాలం పట్టింది. జాతి జీవనాడి పై క్రూరంగా దండెత్తిన విచ్చిన్న శక్తుల్ని చట్టపరంగా శిక్షించడానికి ఇన్నేళ్ల నిరీక్షణ- భిన్న భద్రతా యంత్రాంగాల మధ్య సమన్వయ రాహిత్యాన్ని, శాసనాలు పదునుతేలాల్సిన ఆవశ్యకతను ప్రస్ఫుటీకరిస్తోంది! ఇరవై నాలుగేళ్ల క్రితం ఆసేతు హిమాచలాన్నీగాంతపరచిన వరస బాంబు పేలుళ్ల దుర్పటనకు సంబంధించి ఆయుధాలు, పేలుడు పదార్థాలను దొంగచాటుగా రవాణా చేసిన ఖదీర్ అహ్మద్ అనే వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం, గుజరాత్ పోలీసులు రెండు నెలల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. దొరక్కుండా మరెంతమంది తప్పించుకు తిరుగుతున్నారో ఎవరికెరుక! చోటా పాత్రధారులే కాదు, బడా సూత్రధారులకూ దేశీయ నేర న్యాయవ్యవస్థ తాలూకు ఉదార విధానాలు అయాచిత వరాలవుతున్నాయి. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ఇదే టాడా కోర్టు యాకూబ్ మెమన్ సహా పన్నెండుగురికి మరణశిక్ష, ఇంకో 20మందికి యావజ్జీవం విధించింది. అప్పీళ్ల దరిమిలా యాకూబ్ మినహా తక్కినవారికి యావజ్జీవ శిక్షను 2013లో సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అదే పద్దతిలో ఇప్పుడూ తాహిర్, ఫిరోజ్ ఉరిశిక్షను సర్వోన్నత న్యాయస్థాన డివిజన్ బెంచ్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. వివిధ నిబంధనల కింద దోషిత్వం రుజువైనా అబూసలేం ఉరికంబం ఎక్కకుండాపోర్చుగల్, భారత్ ల మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం చక్రం అడ్డువేసింది. అధోజగత్ చక్రవర్తి దావూద్ ఇబ్రహీమ్ తో సాన్నిహిత్యం కలిగిన అబూ పోర్చుగల్ పారిపోయి, దొరికినా ఉరిశిక్ష భీతి లేకుండా 'రక్షణ' పొందగలగడం- దేశాల నడుమ నేరగాళ్ల ఒప్పందాల క్షాళన అవసరాన్ని స్పష్టీకరిస్తోంది. ఇప్పటికీ ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం, అతగాడి సోదరుడు అనీస్ ఇబ్రహీం, టైగర్ మెమన్, ముస్తఫా సోదరుడు మహమ్మద్ దోసా సహా ముప్పై ముగ్గురు నిందితులు పరారీ జాబితాలోనే ఉన్నారు. అమాయక పౌరుల్ని అమానుషంగా పొట్టన పెట్టుకున్న రాక్షస సంతతిలో ప్రతి ఒక్కరికీ శిక్ష పడేదాకా, బాధిత హృదయాలకు సాంత్వన దక్కదు! బాలిపూర్, అహ్మదాబాద్, దిలీ. ప్రతిష్ణ నేరం చేసి తప్పించుకోలేమన్న భీతి ఉంటేనే దురాగతాల జోరు మందగించేది. దేశంలో అందుకు విరుద్ధ వాతావరణం తిష్ఠ వేసిందనడానికి - ముంబయి దరిమిలా జైపూర్, అహ్మదాబాద్, దిల్లీ, పుణె, బెంగళూరు, వారణాసి, హైదరాబాద్ తదితర నగరాలపై ఉగ్ర మూకల నెత్తుటి సంతకాలే దాఖలా. 1993 ముంబయి వరస పేలుళ్లతో పాటు 2001 నాటి పార్లమెంటుపై దాడి, 2008 ముంబయి మారణకాండ, 2013 దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులలో దోషులకు ఉరిశిక్ష విధించిన మాట నిజం. ప్రత్యేక న్యాయస్థానాలు కఠినంగా తీర్పిచ్చినా, కొన్ని సందర్భాల్లా దండనను సుప్రీంకోర్టు ఖరారు చేసినా- శిక్ష అమలులో కొన్ని సందర్భాల్లో దండనను సుప్రీంకోర్టు ఖరారు చేసినా- శిక్ష అమలులో ఎన్నో మారాముళ్లు పడటం ఉగ్రవాద తండాలకు కోరలు మొలిపిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించిన ఉరిశిక్షను అమలుపరచడంలోనూ కుటిల రాజకీయాలు పొటమరించి, జాతి భద్రతకే తూట్లు పొడుస్తున్నాయి. ప్రత్యేక కోర్టులో శిక్ష విధింపు, ఆపై దాని ధ్రువీకరణ, అటు పిమ్మట అప్పీలు, తీర్పు పునఃపరిశీలన అర్జీలకు వెసులుబాటు - పౌరుల జీవించే హక్కును కిరాతకంగా తుంగలో తొక్కుతున్న విచ్చిన్నశక్తుల పాలిట అపాత్రదానమే. ఇంతటి సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, ఉగ్రదాడుల్లో అయినవాళ్లను కోల్పోయిన బాధితుల గుండెల్ని భగ్గుమనిపించేదే. గ్లాస్లో(స్కాట్లాండ్) విమానాశ్రయంపై దాడి కేసు, బాలి(ఇండొనేసియా) బాంబుదాడి కేసు ఆరునెలల్లో పే కారకుణ్ని అమెరికా న్యూయార్క్ లో టైమ్స్ స్వేర్ కారుణ పరిష్కారమయ్యాయి. న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ కారుబాంబు కుట్రకు కారకుణ్ని అమెరికా మూడురోజుల లోపల వలవేసి పట్టుకుంది. అందుకు విరుద్ధంగా ఇక్కడ కేసుల నమోదు, విచారణ, శిక్షల ఖరారు, అమలు ఏళ్లూపూళ్లూ దేకుతున్నాయి. ' చావుకు తెగించి భారత గడ్డపై కాలుమోపినవాడికి చావే గతి కావాలి' అని ప్రధానిగా వాజ్ పేయీ గర్జించారు. ఉగ్రభూతం కోరలు తుంచేదాకా విశ్రమించేది లేదంటున్న మోదీ ప్రభుత్వం - అమెరికా, బ్రిటన్ల తరహాలో భిన్న యంత్రాంగాల మధ్య అర్థవంతమైన సమన్వయ సాధనకు కంకణబద్ధం కావాలి. ఉగ్రతండాల్ని సత్వరం కఠినంగా దండించేలా చట్టాలు, విధివిధానాల్ని సాంతం సత్వరం కఠినంగా ప్రక్షాళించాలి!