ఆనంద స్వరూపం

పత్యం, ధర్మం, న్యాయం అన్న పదాలు అనాదిగా వినిపిస్తున్నాయి. సత్యం కానిది అసత్యం అని, న్యాయం జరగనప్పుడు అన్యాయం అని ఖండిస్తారు. ధర్మానికి విరుదం అధర్మం అంటు న్నప్పుడు ఏది ముందు, ఏది వెనక అన్న అనుమానం కలుగుతుం ది. అసలు ఇది సత్యం, ఇది. ధర్మం, ఇది న్యాయం అని ఎవరు చెప్పా రు? ఈ ప్రశ్నకు సమాధానం - శాస్త్రం. శాస్త్రం అంటే శాసించేది. ఈ సృష్టిని శాసించే అధికారం ఆ పరమాత్మకే ఉన్నది. ఆయన పలికిన రుక్కులు వేద వాక్కులు. శ్రుతులు, స్మృతులు, శాస్త్రాలు అన్నింటికీ పుట్టిల్లు - వేదవ్మాయం. వేదానికి అర్ధం చెప్పగల సమరుడు ఆ పరమాత్మ. ఏదైతే ఎల్లకాలం ఉంటుందో అదే సత్యం. అలా ఉండకపోతే అసత్యం. సృష్టిలో చరాలు, అచరా లు- కదిలేవి, కదలనివి ఉన్నాయి. ప్రకృతి స్వభావం చలనం. దానికి సహజమైన సత్వ, రజస్, తమో గుణాలు జీవరాశుల్ని ప్రభావితం చేస్తున్నాయి. క్షణక్షణం మారుతున్న ప్రకృతిని అసత్యం అనే వీల్లేదు.కనుక'మాయ'అనే ముసుగు తొడగాల్సి వచ్చింది. రాత్రి- పగలుబీ మంచి-చెడు వంటి పరస్పర వ్యతిరేకతలు సృష్టి ఆది నుంచీ ఉన్నట్లు భావించటం సమంజసం. అహింస అనే పదం హింస అనే పదానికి ముందు పుట్టిందా, వెనక వచ్చిందా చెప్పడం కుదరదు. హింసను చూశాక, జీవహింస తగదని తథాగతుడు అహింస అనే పదాన్ని సృష్టించాడనుకుందాం. అదే పరమధర్మం అయితే ముందు జరిగినదంతా హింసాత్మకమైన అధర్మమే అనుకో వాలి. సృష్టి ఆదినుంచీ పులి లేడిని చంపుతున్నది- అది పులి సహ జ ప్రవృత్తి. ఇది ప్రకృతి ధర్మం అయినప్పుడు అధర్మం అంటే ఎ లా కుదురుతుంది. ఈ చిక్కుముడిని విప్పడానికి వేరే దారులే లేవా? ఈ సమస్యకు పరిష్కార మార్గాలు మూడు. త్రిమతా చార్యులు తమదైన బాణిలో ఆత్మ, పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరిం చారు. జీవాత్మ, పరమాత్మ ఒకటేనని శంకరులంటే- ఆ రెండూ ప్రకృతి అంటూ రామానుజులు వేర్వేరని మధ్వులు తమకు అను కూలంగా వేదాలను, ఉపనిషత్తులను మలచుకొని ప్రతిపాదనలు చేశారు. కనిపించేది సత్యం అనాలా, కనిపించనిది సత్యం అని నమ్మాలా అన్న మీమాంస మాత్రం మిగిలిపోయింది. జీవాత్మ, పరమాత్మ వేరు అయితే, ఏది సత్యమైంది, ఏది అసత్యమైందో ఎలా చెప్పడం? ఏది నిత్యమో అది నిత్య సత్యంబి కేవలం రూపం మార్చితే అది అనిత్యం అవుతుంది కానీ, అసత్యం కాదు. నీళ్ళు బాగా చల్లబడితే మంచుగడ్డ అవుతుంది. వేడి చేస్తే ఆవిరి అవుతుంది. శీతోష్ణ స్థితులను బట్టి రూపం మారినా, నీటి మౌలిక ధర్మం మారదు. ప్రకృతి ధర్మం, జీవధర్మం- ఒకే వృక్షానికి చెందిన రెండు కొమ్మలు. పరమాత్మ, ప్రకృతి, వ్యక్తి- వీటిని ఏకం, అనేకం అంటూ కూడికలు, తీసివేతలు, చేయటం కన్నా మూడింటిని మూడు స్థితులుగా, స్థాయులుగా గుర్తిస్తే పరిష్కారం లభిస్తుంది. అద్వితీయమైన పరమాత్మ తప్ప- విశ్వంలో, వ్యక్తిలో, తారతమ్యాలున్నాయి. అలా ఉండటానికి అవి అద్వితీయాలు కాకపోవడమే కారణం. మతం అంటే మన మనసుకు, హృదయానికి సంబంధించిన ఒక చింతన. అందువల్ల అందరికీ కాకపోయినా, ఎక్కువమందికి సమ్మతమై ఉండాలి. అందరం కోరుకునేది ఆనందం. అది ఎంత సులభంగా అందుకోగలిగితే అంత చక్కగా ఆ మతాన్ని ఆదరిస్తాం. తాను భక్తసులభుడినని పరమాత్మ చెప్పాడు. భక్తి ప్రభావాన్ని బట్టి భగవద్భక్తులకు ఆనంద రసాస్వాదన అందుబాటులో ఉంటుంది. భగవంతుడి అసలు స్వరూపం ఆనందం. ఆ రసామృతమే మోక్షం. పరమాత్మ సృష్టి చేయగలడు, సర్వాంతర్యామి. జీవాత్మకు ఈ గుణాలు లేవు. అదే జీవాత్మ, పరమాత్మల మధ్య భేదం. అది మన బుద్ధికి అందుబాటులో లేని చింతన. భేదం ఉందా లేదా అని చెప్పడం కుదరదు. ఈ విధంగా ద్వైతం తారతమ్యం చెబుతూనే, అందరికీ వీలైన భక్తిమార్గాన్ని చూపుతుంది. స్వరూపానందాన్నే మోక్షంగా చెబుతుంది. భక్తి లేనిది ముక్తి లేదు. మధ్వాచార్యులు పూర్ణప్రజ్ఞులని, ఆనందతీర్తులని, హరిగురువుల సేవలో తరించవచ్చునని మధ్వులు విశ్వసిస్తారు.