వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలో వైన్ షాపులు బార్లు గా నిర్వహించబడుతున్నాయి. ఇందుకు మండలంలోని ధర్మారం ప్రధాన రహదారి లో ఉన్న వైన్ షాపు,అదే దారిలోని మెయిన్ రోడ్డులోని వైన్ షాపులే నిబంధనలను అతిక్రమిస్తూ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తూ యధేచ్చగా వైన్స్ షాపులు బార్లను తలపించేలా నిర్వహించబడుతుంటే చర్యలు చేపటాల్సిన ఎక్సెజ్ శాఖ అధికారలు నిద్రమతులో ఉంటున్నారు. అయితే ప్రధాన రహదిరిలో ఉన్న ధర్మారం లోని వైన్ షాపుతో పాటు కొనాయిమాకులు, ఇదే దారిలోని వైన్ షాపులు తమను అడిగే నాధుడే లేరన్నటుగా, ఎక్సెజ్ శాఖ తమ జేబులో ఉన్నటుగా వ్యవహరించటం బహిరంగ రహస్యం గా మారిందనటంలో అతియోశక్తి లేదు. వైన్ షాపుల్లో బార్లను తలపించే విధంగా సిట్టింగ్ లు, ప్రత్యేకమైన ఆవరణ సిట్టింగ్ ఉండటం, క్యాంటీన్ నిర్వహించటమే వైన్స్ ఇష్టారాజ్యంగా నిర్వహించబడుతున్నాయనటాని సాక్ష్యం. ఈ చర్యలన్నీ ఎక్సైజ్ శాఖ చూస్తూ ఊరుకుంటుందంటే వైన్ షాపుల యాజమాన్యానికి ఎక్సైజ్ శాఖకు మధ్య ఎలాంటి సమన్వయం, ఒప్పంధం ఉంతో తెలుపుతుంది. ప్రధాన రహదారిపై ఉండే వైన్ షోపులు ఎంత దూరంలో ఉండాలో, ఎలాంటి నిబంధనలు పాటించాలో ఎక్సైజ్ శాఖ ఎందుకంటే అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇంతటి బహిరంగంగా వైన్ షాపులు బార్లు గా నిర్వహిస్తుంటే కనిసం చర్యలు చేపట్టకపోవటాన్ని ఏమనుకోవాలి..? ఇవన్ని ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే ఉన్నాయనుకోవాలా..? లేక ముడుపుల మతులో ఊదాసీనతతో వ్యవహరిస్తున్నారనుకోవాలో అధికారులే చెప్పాలి. అయితే ఇది ఈ ఒక్క గీసుగొండ మండలం వరకే పరిమితం కాలేదు. వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా ఇదే స్థితి కొనసొగుతుందంటే ఎక్సైజ్ శాఖ అధికారుల పరిస్థితి ఎలా,వారి పని తీరు, పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. వైన్ షాపుల నిర్వకులు అధికారుల " లవ్” జర్నీ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ అటు ఎక్సైజ్ శాఖ అధికారులు,ఇటు వైన్ షాపుల నిర్వకుల సమన్వయం ఫలితంగా వైన్ షాపులు బార్లుగా మారి వర్ధిల్లుతుందనటంలో సందేహం లేదు. ఉన్నతధికారులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. వైన్ షాపుల నిర్వహన తీరుపై పర్యవేక్షణ చేయాలి. బార్లను తలపించేలా వైన్ షాపులను నిర్వహించే వైన్ షాపులపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
నమిండ్ల ప్రమోద్ జర్నలిస్ట్ - వరంగల్-
సెల్ : 6305638569