సూర్యుడు కవిత


చీకటిని తరుముటకే... ఉదయించేవాడు, అస్తమించగలనని... తెలిసే ఉదయించేవాడు, విశ్వంలో వెలుగులు ... నింపుటకే తాను ఎర్రగా... మండుతుండేవాడు, నిరంతరం తాను... మండుతూ ఉండేవాడు, వెచ్చని కౌగిలి నిచ్చే... రవి రాజు ఇతడు,. ప్రతి ఉదయం ... ఉషాకిరణాల తాకిడికి... ఉలిక్కిపడి లేచును... ఈ ప్రకృతి, ఎర్రని కిరణాల... వెచ్చదనానికీ... ఫక్కున నవ్వినట్లు... వికసించును “తామరలు”, పక్షుల కిల కిల రావాలు, జంతు పిల్లల గెంతులాటలు, తుమ్మెదల ఝంకారాలు , కీచురాళ్ళ కీచులాటలు, అనేక సవ్వడులతో... సందడి మొదలెట్టును... ఈ దినకరుడు,. పచ్చని ప్రకృతి పోషణలో... శక్తిని ఇచ్చును మెండుగా , జంతు జాలపు జీవన శైలిలో... మార్పును చూపును నిండుగా, ప్రజల బ్రతుకు తెరువు... పెనుగులాటలో... మార్గము చూపును దండిగా, విశ్వాంత రాలపు... ప్రాణికోటి కీ ఉత్తేజం కలిగిస్తూ... పండును ఈ భాస్కరుడు,. పగటి పూటకు... రాజును ఇతడు, పనుల పర్యవేక్షణ... చేయును ఇతడు, ప్రకృతి అందాలను... ఆశ్వాదించును ఇతడు, మిట్ట మధ్యాహ్నం వేళ... వెండి కాంతులు... వెదజల్లు ఇతడు, ప్రాణికోటి అలసిన వేళ.... చల్లని చెట్లనీడకూ... చేర్చునితడు , సాయంకాలంసమయాన.. . ప్రకృతినిపర్వసింపజేయునట్టి, సౌందర్య రూపం పొందే... అరుణ కిరణుడు ఇతడు,. రచన:యం.తారాసింగ్,