ఈనాడు సమాజంలో చెడులు, దుష్కార్యాల విస్త ృతి చాలా ప్రబలంగా ఉంది. మానవ జీవితంలోని అన్ని రంగాలను ఈ రుగ్మతలు పరివేష్టించి ఉన్నాయి. చెడులతో పోల్చుకుంటే మంచి మరుగుజ్జులా కనబడుతోంది. నిజానికి మంచి అన్న మేరు పర్వతం ముందు చెడు చీడ పురుగు, పేడ పురుగులా నీచంగా గోచరించ వలసింది. కాని దురద ృష్ట వశాత్తూ దుర్మార్గమే దొడ్డుగా ఉన్నట్లు కనబడుతోంది. ఈ దుస్థితి వెంటనే మారాలి. మార్చాల్సిన బాధ్యత సమాజ శ్రేయోభిలాషులందరిపై ఉంది. ముఖ్యంగా దైవ విశ్వాసులపై మరీ "తగ్గాల స్మూలన ' సత్కార్యాల స్థావన పైన మానవాళి సాఫల్యం ఆధారపడి ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను గుర్తు చేస్తూ పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది:'మీలో కొందరు, ప్రజలను మంచి వైపుకు పిలిచేవారు,సత్కార్యాలు చేయమని ఆదేశించే వారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇహ పర లోకాలలో సాఫల్యం పొందేవారు'.. (3-104). మరొక చోట ఇలా ఉంది. 'విశ్వాసులారా ! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరే.. మీరు సత్కార్యాలు చేయమని ప్రజలను ఆదేశిస్తారు., దుష్కార్యాలనుండి వారిస్తారు. దైవాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు. (3-110) పవిత్ర ఖురాన్ లోని ఈ వాక్యాల్లో దైవ విశ్వాసుల జీవిత లక్ష్యం ఏమిటో,వారు నిర్వర్తించవలసిన బాధ్యతలేమిటో విశదీకరించటం జరిగింది. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు తమ తమ శక్తి సామర్థ్యాల మేరకు సమాజంలో ప్రబలి ఉన్న చెడులను రుగ్మతలను అరికడుతూ, మంచిని , మానవీయ విలువలను వ్యాపింపచేస్తూ ప్రజలను సంస్కరించడానికి క ృషి చేయాలని మనకు అర్థమవుతోంది. అందుకే పవిత్ర ఖురాన్ , ప్రజల్లో దైవ భీతిని ,పరలోక చింతనను జనింపజేసి తద్వారా వారిని నితి మంతులుగా, సత్పౌరులుగా తీర్లు, దురాచారాలతో సహా ప్రపంచంలోని అన్నిరకాల చెడులను నిర్మూలించి చక్కని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పదలిచింది. ఈ లక్ష్య సాధన కొరకు పవిత్ర ఖురాన్ దైవ విశాసులపై మంచిని పెంచే చెడును నిర్మూలించే బృహత్తర బాధ్యతను నిర్బంధం చేసింది. దీనికోసం విశ్వాసులు ఒక సంఘటిత శక్తిగా రూపొందాల్సిన ఆవశ్యకతను అది గుర్తు చేస్తోంది. నిరంతర కృషి అవసరం సమాజ సంస్కరణ, సత్సమాజ నిర్మాణం ,మానవాళి ఇహపర సాఫల్యం.. దీనికోసమే దేవప్రవక మొహమ్మద్(స) వారి కాలంలోఆతరువాతి ఖులఫాయెరాషిదీన్ ల కాలంలో దైవ విశ్వాసులు ధర్మంకోసం ,న్యాయంకోసం తమ సర్వస్వాన్ని ధారపోసి కృషిచేశారు. సమాజంలో ఎక్కడ ఏ కొది చెడు కనిపించినా దాన్ని అంతం చేసేవరకు ప్రశాంతంగా నిద్రపోయేవారుకాదు. ప్రజల్లో పాప భీతిని,దైవభీతిని నూరిపోస్తూ, దుర్మార్గాలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. దీని ఫలితంగా ఆనాడు సమాజంలో ఎల్లెడలా నీతి,న్యాయం, శాంతి, సౌశీల్యం,సౌబ్రాత్ర తలు వెల్లివిరిశాయి. ధర్మ పరాయణత, బాధ్యతాభావం, జవాబుదారీతనం, పరస్పర గౌరవాభిమానాలు సర్వత్రా విస్తరించాయి. నిజంగానే అదొక పరస్పర స్వర్ణయుగం, ప్రపంచమంతా కీర్తించిన కాంతియుగం. కాని ఆయుగం అంతరించింది. ఆ కాంతి, శాంతి కనుమరుగైపోయాయి. ఈనాడు ప్రపంచంలో ఎటుచూసినా అరాచకమే రాజ్యమేలుతోంది. అవినీతి, అక్రమాలు ,అన్యాయం, అశ్లీలం,మత్తుపదార్థాల సేవనం,హత్యలు, అత్యాచా రాలు సర్వ సామన్యమై పోయాయి. సమాజం అన్నివిధాలా భ్రష్టుపట్టిపోయింది. దీన్ని నిరోధించా ల్సిన వారు సైతం చేడుల్లో పీకలదాకా కూరుకుపోయి ఉన్నారు. ఈ దుస్థితి మారాలంటే మనుషుల్లో పరివర్తన రావాలి. ఉదాసీనత వీడాలి.'మనకెం దుకులే' అన్న వైఖరి మారాలి. చెడులకు వ్యతిరేకంగా గొంతువిప్పాలి. కలసికట్టుగా నడుం బిగించాలి. చెడులు అంతమయ్యే వరకూ అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే సమాజ సంస్కరణ సాధ్యమవుతుంది. ఇహపర సాఫల్యం సిద్ధిస్తుంది. - యండి. ఉస్మానఖాన్ చిదిద్దాలని అభిలషిస్తోంది. మూఢనమ్మకా
సమాజ సంస్కరణ మనందరి బాధ్యత