రహదారుల భద్రతపై దృష్టి

2 మానవ “ఏ దేశ సంపదలోనెనా మూడింట రెండొంతుల వాటా సుసంపన్న వనరులదే... సహజ వనరుల కంటే, ఉత్పాదక మూలధనం కంటే అది ఎంతో విలువైనది' - టోక్యోలో జరిగిన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ ఫోరం సదస్సులో ప్రపంచ బ్యాంకు అధ్యక్షులవారి అభిభాషణ అది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 12.5 లక్షలమంది చనిపోతుంటే, అయిదు కోట్లమంది దాకా క్షతగాత్రులవుతున్న మహా మానవ విషాదంలో ఇండియా వాటా ఎకాయెకి 13శాతంగా ఉండటం భారత ధాత్రిని నిలువునా కుంగదీస్తోంది. మృత్యువు రహదార్లపైనే తిష్ఠవేసిందా అన్నట్లు ప్రతి మూడు నిమిషాలకో మరణం- ప్రయాణానికి ప్రమాదం అన్న దురర్థాన్ని స్థిరీకరించి లక్షల కుటుంబాల్ని కర్కశంగా చిదిమేస్తోంది. ఏ రోజు దిన పత్రిక తిరగేసినా గుండె తరుకుపోయే రహదారి ప్రమాద దుర్వార లే. మితిమీరిన వేగం, వాహన చోదకుల అలక్ష్యం, రహదారి నిబంధనల్ని పాటించకపోవడం, మద్యం మత్తులో దూసుకుపోవ డం- ఇవన్నీ రహదార్లపై విషాద వృష్టికి కారణమవుతున్నాయి. వాటితోపాటు రహదార్ల నిర్మాణంలో లోపాలు సైతం తమ వంతు బలి కోరుతున్నాయి! రహదార్ల నిర్మాణ దశలో భద్రతా ప్రమాణాల్ని రాష్ట్రాలను పాటించకపోవడం ఎన్నో ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తోందంటూ ఒక పౌరుడు రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాకీదులు జారీ చేసింది. రహదార్లపై మరమ్మతులు జరుగుతున్న చోట ప్రమాద హెచ్చరికలు పెట్టకపోవడంలో గుత్తేదార్ల కక్కుర్తి, అధికారుల అలక్ష్యం ఎన్నో మరణాలకు కారణమవుతున్నాయనడంలో మరో మాట లేదు. ఈ తరహా నిష్పూచీతనానికి నిలువు పాతరేసి, భద్రమైన రహదారులకోసం గట్టి కార్యాచరణను సత్వరం పట్టాలకెక్కించక 2020 తప్పదు.దేశవ్యాప్తంగా రోడ్ల వ్యవస్థలో జాతీయ రహదారుల వాటా పట్టుమని 1.8శాతమే అయినా వాటి పైనే 30శాతం దాకా ప్రమాదాలు, 34.5శాతం మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం 3.14శాతంగా ఉన్న రాష్ట్ర రహదారులపై పాతిక శాతంపైగా ప్రమా దాలు, 28శాతం మరణాలు చోటు చేసుకొంటున్నాయి. అంటే అయిదు శాతం కూడా లేని కీలక రహదారులపైనే మూడింట రెండొంతుల మరణాలు నమోదు కావడం- అనేకానేక వ్యవస్థాగత లోపాల్ని పట్టిస్తోంది. 66.5శాతం ప్రమాదా లకు, 61శాతం మరణాలకు మితిమీరిన వేగమే పుణ్యం కట్టుకొంటోందని అధికారులు అంటున్నా- శాస్త్రీయత కొరవడిన రోడ్ల నిర్మాణంలో లొసుగులు, లోపాల్ని విస్మరించగలమా? మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద చిన్న కల్వర్టును వెడల్పు చెయ్యకపోవడంవల్ల బెంగళూరునుంచి వస్తున్న ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురై 45 నిండు ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ అనునిత్యం 13వేల భారీ మధ్య తరహా వాహనాలు తిరుగాడే 65 నెంబరు జాతీయ రహదారిపై 21 ప్రమాదకర ప్రాంతాలున్నట్లు అధికారగణమే గుర్తించింది. ప్రమాదకర ప్రాంతాల్లో 14-16 అండర్ పాసులు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఎప్పుడు మోక్షం దక్కుతుందో గానిఏటికేడు ఈ మార్గంలో ప్రమాదాలు, మృతుల సంఖ్య బెంబేలెత్తిస్తోంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న రహదారి నిర్మాణ శాస్త్ర విజ్ఞానాన్ని అందిపుచ్చుకోకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్న డివైడర్లే అనేక సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. దానికి విరుగుడు మంత్రంగా యూకేకు చెందిన ట్రాన్స్ పోర్ట్ రీసర్చ్ లేబొరేటరీ రూపొందించిన విభాగినుల (డివైడర్స్) వినియోగం ఎంతో శ్రేయస్కరమని నిపుణులు మొత్తుకొంటున్నారు. పరలో కానికి రహదారులుగా భ్రష్టుపట్టిన ప్రస్తుత దురవస్థను దునుమాడాలంటే దూరదృష్టి, ఆధునిక పరిజ్ఞానాల్ని మేళవించి రోడ్ల వ్యవస్థను సంస్కరించక తప్పదు!రహదారి భద్రతపై 2015లో బ్రెజిల్ లో జరిగిన అంతర్జాతీయ సద స్సు 2020 నాటికి ప్రమాదాల్ని సగానికి తగ్గించాలంటూ వెలువరించిన బ్రసీ లియా ప్రకటనను ఇండియా సైతం ఆమోదించింది. ఏటా లక్షన్నర మందికి పైగా అభా గ్యుల్ని కబళిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో 86శాతం 13 రాష్ట్రాల్లోనే చోటుచేసు కొంటున్నాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో, తెలంగాణ తొమ్మిదో స్థానంలో కొలువుతీరాయని సర్కారీ గణాంకాలే ఎలుగెత్తుతున్నాయి. 2018 నాటికే ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించేలా బహుముఖ కార్యా చరణ వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రతిపాదించినా అది ఆచరణలో నీరో డింది. డిజైన్ల దశలోనే రహదారి భద్రతపై నిశిత దృష్టి, పదేపదే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల బాగుత, భద్రతాంశాల పరంగా వాహన తయారీలో మెరుగుదల, చట్టాలను కట్టుదిట్టం చేసి గట్టిగా అమలు చెయ్యడంవంటి శుభ సంకల్పాల వల్లెవేతతో ఏం ఒరగలేదు కాబట్టే, నిరుడు డిసెంబరులో సుప్రీంకోర్టు తనవంతుగా పాతిక మార్గదర్శకాల్ని వెలువరించింది. వాటికీ ఏపాటి మన్నన దక్కుతోందో వరస వెంబడి ఘోర ప్రమాదాల ఉరవడే వెల్లడిస్తోంది.