రష్యా-భారత్ మధ్య స్నేహం

భారత్, రష్యాల స్నేహం కాలపరీక్షకు నిలిచి గెలిచిందంటూ, నిన్నామొన్నటి వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగిందని మోదీ సహర్షంగా చాటుతున్నారు. మూడు వారాల క్రితం చైనా ప్రధాని షి జిన్‌పింగ్ కోరిక మేరకు రెండు రోజుల సుహృద్భావ ఇష్టాగోష్ఠికి హాజరైన ప్రధాని మోదీ- సరిహద్దుల్లో ఉద్రిక్తతల ఉపశమనానికి నవశక సంకల్పాన్ని సాధించి వచ్చారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాధినేతలతో ఈ తరహా భేటీలు నిర్వహించిన పుతిన్ తాజా చొరవకు భిన్న పార్శ్వాలున్నాయనడంలో సందేహం లేదు. గంగా ఓలా సంగమమంటూ ఉభయ దేశాల మైత్రిని ఎంతగా శ్లాఘిస్తున్నా, 2000 సంవత్సరం నాటి దిల్లీ డిక్లరేషన్లో పొంగులువారిన సౌహార్దానికి అనుగుణంగా ద్వైపాక్షిక బాంధవ్యం పెనవడనే లేదు. 2025 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం మూడు వేలకోట్ల డాలర్లు కావాలని 2014 డిసెంబరులో నిర్ణయించినా 2015లో కంటే ఒకటిన్నర శాతం తక్కువగా 2016లో 717 కోట్ల డాలర్లకే అది పరిమితమైంది. అమెరికాతో ఇండియా అంటకాగుతోందన్న అనుమానంతో పాకిస్థాన్ వైపు మొగ్గుతున్న రష్యా- కశ్మీర్ వివాద పరిష్కారం పైనా మొన్నామధ్య బాణీ మార్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాపైనా ఆంక్షలతో విరుచుకుపడుతున్న తరుణంలో మాస్కో నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ఇండియాకూ క్లిష్టతరం కానుంది. పరస్పరం ముణగదీసుకొని కూర్చునేకంటే, మనసు విప్పి మాట్లాడుకొంటే వ్యూహాత్మకంగా అడుగులు కదపగలమన్న పుతిన్ ప్రాప్తకాలజ్ఞతతాజా భేటీకి నేపథ్యం. ఉగ్రవాదంపై పోరు, అఫ్ఘానిస్థాన్లో సుస్థిరత, బహుళ ధ్రువ ప్రపంచం కోసం కలివిడిగా సాగాలన్నది నిశ్చయంగా శుభసంకల్పం! తానిచ్చింది వరం, పెట్టింది. శాపంగా ఒంటెత్తు ధోరణితో కొనసాగిన అమెరికా, బరాక్ ఒబామా అధ్యక్షతలో కాస్తంత మెత్తబడింది. ఒబామా జమానా నాటి ఒప్పందాల్ని ఏకపక్షంగా కాలదన్ని శ్వేతసౌధం ప్రదర్శిస్తున్న ఇటీవలి ట్రంపరితనం- నాటో కూటమి దేశాల్నీ చీకాకు పరుస్తోంది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగిన ట్రంప్, దాని విదేశాంగ విధానానికి లక్ష్మణ రేఖలు గీస్తూ సరికొత్త ఒడంబడిక చట్రాన్ని తాజాగా ప్రతిపాదించారు. దానికి టెహరాన్ తలొగ్గని పక్షంలో ఆర్థికంగా ఇరానను కుంగదీసే ఆంక్షలకు సానపట్టిన అమెరికా- ఆ దేశంతో ఎవరూ ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ నిర్వహించరాదని, కాదని ముందడుగేసే దేశాలపైనా ఆంక్షల విధింపు తథ్యమని గుడ్లురుముతోంది. ఉక్కు అల్యూమినియం దిగుమతి సుంకాలతోను, ఇరాన్ ఆంక్షలతోనూ ట్రంప్ చెలరేగడం ఐరోపా సమాజానికి సుతరామూ నచ్చడంలేదు. ఇరాన్ లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు ద్వారా సరికొత్త నౌకాయాన మార్గం అభివృద్ధితో వాణిజ్య ప్రగతికి మేలుబాటలు పరుస్తున్న భారత్ కు, అమెరికా ఆంక్షలు గుదిబండలుగా మారనున్నాయి. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం సహా పలు అభియోగాలతో రష్యా పై కత్తికట్టిన అమెరికా, ఆంక్షల ద్వారా విరోధుల్ని ఎదుర్కొనే చట్టం (కాట్సా) ద్వారా మాస్కోకు ఉచ్చు బిగించాలనుకొంటోంది. దాదాపు రూ. 39 వేలకోట్ల వ్యయంతో రష్యా నుంచి ఇండియా ఒప్పందాల్ని ఏకపక్షంగా కాలదన్ని శ్వేతసౌధం ప్రదర్శిస్తున్న ఇటీవలి ట్రంపరితనం- నాటో కూటమి దేశాల్నీ చీకాకు పరుస్తోంది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగిన ట్రంప్, దాని విదేశాంగ విధానానికి లక్ష్మణ రేఖలు గీస్తూ సరికొత్త ఒడంబడిక చట్రాన్ని తాజాగా ప్రతిపాదించారు. దానికి టెహరాన్ తలొగ్గని పక్షంలో ఆర్థికంగా ఇరానను కుంగదీసే ఆంక్షలకు సానపట్టిన అమెరికా- ఆ దేశంతో ఎవరూ ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ నిర్వహించరాదని, కాదని ముందడుగేసే దేశాలపైనా ఆంక్షల విధింపు తథ్యమని గుడ్లురుముతోంది. ఉక్కు అల్యూమినియం దిగుమతి సుంకాలతోను, ఇరాన్ ఆంక్షలతోనూ ట్రంప్ చెలరేగడం ఐరోపా సమాజానికి సుతరామూ నచ్చడంలేదు. ఇరాన్ లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు ద్వారా సరికొత్త నౌకాయాన మార్గం అభివృద్ధితో వాణిజ్య ప్రగతికి మేలుబాటలు పరుస్తున్న భారత్ కు, అమెరికా ఆంక్షలు గుదిబండలుగా మారనున్నాయి. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం సహా పలు అభియోగాలతో రష్యా పై కత్తికట్టిన అమెరికా, ఆంక్షల ద్వారా విరోధుల్ని ఎదుర్కొనే చట్టం (కాట్సా) ద్వారా మాస్కోకు ఉచ్చు బిగించాలనుకొంటోంది. దాదాపు రూ. 39 వేలకోట్ల వ్యయంతో రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకోదలచిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ లావాదేవీలకూ ఆ చట్టం వర్తిస్తుందనడం ఇండియాకూ మింగుడు పడటంలేదు. అగ్రరాజ్యం నిర్దేశానుసారం ఇండియా రక్షణ కొనుగోళ్లు ఉండవని స్పష్టీకరించిన మోదీ ప్రభుత్వం- సంక్లిష్టభరితంగా మారుతున్న అంతర్జాతీయ వాతావరణంలో ఆచితూచి అడుగేయక తప్పదు! వాణిజ్య ప్రగతికి నూతన అవకాశాల అన్వేషణ, సుస్థిరాభివృద్ధి సాధన, విశ్వవ్యాప్తంగా శాంతి సుహ ృద్భావాల సంస్థాపన, అంతర్జాతీయంగా పారదర్శక పాలన విధానాలకు అండాదండా... ఇత్యాదులన్నీ 2016నాటి మోదీ, పుతిన్ శిఖరాగ్ర సదస్సు సంయుక్త తీర్మానంలో కొలువుతీరాయి. వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యానికి వీలుగా వాణిజ్య పెట్టుబడుల్లో సంతులనం సాధించేందుకు నీతి ఆయోగ్, రష్యా ఆర్థికాభివృద్ధి మంత్రిత్వ శాఖల మధ్య సంప్రతింపులకు తాజా ఇష్టాగోష్ఠి బాటలు పరచింది. అరమరికల్లేని నెయ్యంతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమనే అంశాన్ని విస్మరించి - భారత్ ఆందోళనల్ని ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా చైనా, పాకిస్థాన్లకు వంత పాడేలా నిరుడంతా రష్యా నెరపిన దౌత్యం - చిరకాల చెలిమినే ప్రశ్నార్థకం చేసింది. 'ఇద్దరు కొత్త మిత్రులకన్నా పాత స్నేహితుడు మిన్న' అన్న రష్యన్ సామెతను ప్రధాని మోదీ లోగడ ప్రస్తావించాల్సి రావడానికి పుతిన్ పెడసరమే పుణ్యం కట్టుకొంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత సాధనకు అమెరికా ఇండియా జపాన్ ఆస్ట్రేలియాల కూటమిపై గాలిపటాలు ఎగురుతున్న వేళ, తన అభ్యంతరాల్ని బాహాటంగానే వ్యక్తీకరించిన మాస్కో- చుట్టుముడుతున్న సంక్షోభం నుంచి ఒడ్డున పడే దూరాలోచనతోనే భారత్ ను తిరిగి అక్కున చేర్చుకొంటోంది. దిగుమతి సుంకాల రుబాబును చైనా అదే పంథాలో ఎదుర్కొనేసరికి అమెరికా తోకముడవడంతో- అగ్రరాజ్యం తెంపరితనాన్ని సమష్టిగా ఎదిరించడమే మేలన్న ధోరణి రష్యాలోనే కాదు జర్మనీ వంటి దేశాల్లోనూ బలపడుతోంది. ఈ స్పర్ద సరికొత్త ప్రచ్ఛన్న యుద్దాన్ని రాజేసే ప్రమాదాన్ని గుర్తించి, ఇండియా చాకచక్యంగా పావులు కదపాలి!