'మాఫియాను నియంత్రించడం కోసమంటూ వాళ్లు చేసే పనుల్ని ప్రభుత్వాలు చెయ్యవచ్చా?'- లోగడ ముఖ్యమంత్రిగా వైఎస్ తెచ్చిన ఎక్సైజ్ పాలసీని సూటిగా నిలదీస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంధించిన ప్రశ్న అది. పుష్కర కాలంగా దానికి సమాధానం చెప్పిన నాథుడు లేడుగానిమాఫియా శక్తులతో అంటకాగి ప్రభుత్వ యంత్రాంగాలే తరించిపోయే టంత సాయిలో పరోగతి సాధ్యపడింది. వ్యసనపరులకు ఏమేమి కావాలో అవన్నీ ఎలాంటి అవరోధాలూ లేకుండా అందుబాటులో ఉంచడమే ృత్యుక్రీడలాడుతున్నారన్నది సంక్షేమరాజ్య భావన పరమార్థమన్న తెలివిడి సచివుల నుంచి అత్యున్నతాధికార శ్రేణుల దాకా అందరిలోనూ నోట్ల కట్టలు తెంచుకొని మరీ ప్రవహిస్తోంది. ఒక్కసారి తమిళనాడు కేంద్రంగా సెలవేసిన గుట్కా కుంభకోణం ఆనుపానుల్ని పరికిస్తే- అవినీతి విహిత కర్తవ్య నిర్వహణలో అధికార కేంద్రాలు ఎంతలా తలమునకలై ఉన్నదీ బోధపడుతుంది! గుట్కా పాన్ మసాలా, నమిలే పొగాకు వంటివాటిపై తమిళనాడు ప్రభుత్వం 2013లోనే నిషేధం విధించింది. ఆ నిషేధాజ్ఞలు కాగితాల్లోనే నీరోడుతున్నా యనడానికి సాక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ గుట్కా పాన్ మసాలా ప్యాకెట్ల జడలు దర్శనమిస్తూనే ఉన్నాయి. అది ఒక్క తమిళనాడు వ్యధ మాత్రమే కాదు- అన్ని రాష్ట్రాలదీ అదే తరహా! కానీ తక్కినవాటికి భిన్నమైనది తమిళ తంబిల కథ. మొన్న నాడు కేదస (సీబీఐ) బృందం తమిళనాట 35చోట్ల, కర్ణాటక, ముంబయి, పుదుచ్చేరితోపాటు గుంటూరులోనూ సోదాలు నిర్వహించింది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై మాజీ పోలీస్ కమిషనర్ ఎస్ జార్జి సహా మరెందరివో ఇళ్లను జల్లెడ పట్టింది. మంత్రి పుంగవుడి నివాసంలో ఇదివరకే ఐటీ సోదాలు జరిగిన చరిత్ర ఉంది. పదవిలో ఉన్న రాష్ట్ర పోలీసు బాసు నివాసంలో కేదస సోదాయే సంచలనాత్మకంగా మారింది. ఇదంతా ఎందుకన్న తీగలాగితే, గుట్కా వ్యాపారి మాధవరావు ఇంటిమీద నిరుడు ఐటీ అధికారులు జరిపిన దాడి తాలుకూ డొంక కదులుతోంది. అతగాడు రూ.250 కోట్ల ఆదాయం పన్ను ఎగవేశాడంటూ ఐటీ అధికారులు మాధవరావు ఇళ్లు కార్యాలయాలు, గోదాములపై దాడులు చేసిన సందర్భంలో వెలుగు చూసిన డైరీ- పెద్ద తలకాయల అవినీతి జాతకాల్ని బయటపెట్టింది. రూ. 40 కోట్ల మేర పెద్దలంతా లంచాలు బొక్కినట్లున్న ఈ కేసు దర్యాప్తును కేదసకు అప్పగించడానికే రాష్ట్ర హైకోర్టులో న్యాయపోరాటం చేయాల్సివచ్చింది. కేదస దర్యాప్తును నిలువరించడానికి సుప్రీంకోర్టునూ నిందితులు ఆశ్రయించారంటే- అవినీతి కాళియమర్దనం అంత సులభం కాదన్న సంగతి అర్థమవుతుంది. ఎక్కడున్నా నేరగాళ్లను వెతికి పట్టేయడంలో చట్టం చేతులు బహుబారెడు అనుకొంటాంగాని, రక్షకభట వ్యవస్తే దోషులతో దోస్తానా చేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు నడుస్తున్న చరిత్రే సమాధానం! కంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించిన నిధానాన్ని గుట్కాయిన్వాహ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించిన నిషేధాస్రాన్నే గుట్కాయస్వాహా చేసిన ప్రబుద్ధులు- దేశవ్యాప్తంగా జనారోగ్యంతో మ ఉంచడమే ృత్యుక్రీడలాడుతున్నారన్నది నిజం. తమిళనాడు గుట్కా కుంభకోణం ఆ ఉన్న కానిదనీ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదని, సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు మాధవరావు దేశాలకూ విస్తరించిన ఈ నేరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులెందరో ఉన్నారని మొన్న మే నెలలో సుప్రీంకోర్టు పన్ను స్పష్టీకరించింది. ప్రజారోగ్యాన్ని క్యాన్సర్ మహమ్మారికి నైవేద్యం , పెడుతున్న పొగాకు ఉత్పాదనల్ని నిషేధించి తీరాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాక కూడా- గుట్కాలు, జర్గాలు, పాన్ మసాలాలు మేర విచ్చలవిడిగా లభ్యం కావడం వెనక వాడవాడలా ఊడలు దిగిన కేదసకు మాఫియా శక్తుల ప్రత్యక్ష ప్రమేయం ఉంది. నిషేధం తరవాత తమిళనాట ృత్యుబేహారులకు . గుట్కాలు మరింత ఖరీదయ్యాయనేగాని, లభ్యతకు లోటు లేదని నిందితులు అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సర్వే నిరుడు మే నెలలో నిర్ధారించింది. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా మంత్రులకు, పోలీసు పెద్దలకు కొన్ని కోట్లు సమర్పించేస్తే ఎలాంటి అమానుష దందాల్ని అయినా అనాయాసంగా జరుపుకోగల వీలు- దేశీయంగా చట్టబద్ధ పాలననే చట్టుబండలు చేస్తోంది!నోటి క్యాన్సర్ కేసుల్లో 80 శాతానికి పొగాకు ఉత్పాదనలే కారణమవుతున్నాయి. పొగాకును సేవించేవారిలో 75 శాతం గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, మవా వంటివాటికి బానిసలై ప్రాణం మీదకు నమసాలా, ఖ తెచ్చుకొంటున్నారని, అంతకంతకూ ఇవి జనంలోకి చొచ్చుకుపోతూ వ్యసనపరుల సంఖ్యను, అర్గాయుష్కుల్ని పెంచుతున్నాయని పలు అధ్యయనాలు ఎలుగెత్తుతున్నాయి. దశాబ్దాల తరబడి మీనమేషాలు లెక్కించాక - పొగాకు, నికోటిన్ కలగలసిన ఆహార పదార్థాల్ని ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నిషేధించినా, దాన్ని అధిగమించడానికి గుట్కా తయారీ సంస్థలు కొత్త మార్గాలు అన్వేషించాయి. పొట్లాం చించి నోట్లో వేసుకొనేలా కాకుండా రెండు వేర్వేరు ప్యాకెట్లలో పదార్థాల్ని నింపి, వినియోగదారులు వాటిని స్వయంగా కలిపి వినియోగించే వైపరీత్యానికి తెరదీశాయి. ఆ దుర్మార్గం చెల్లదని 2016 సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్పష్టీకరించడంతో- కేంద్రం తనవంతుగా మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. కంచే చేను మేసినట్లుగా నిషేధాన్ని నిక్కచ్చిగా అమలు చెయ్యాల్సిన ఖాకీ పెద్దలే కాసుల మత్తులో జోగుతుంటే- గుట్కా రాబందుల వీరవిహారం విశృంఖలంగా సాగుతూనే ఉంది. తాజా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ కమిషనర్ జార్జి ఓ కీలక ప్రశ్న లేవనెత్తారు. 'కేవలం ఒక్క కమిషనర్ ఆశీస్సులతోనే అంతస్థాయిలో అక్రమాలు జరిగే అవకాశం ఉందా?' అని ప్రశ్నించి, అది సాధ్యం కానిదనీ తానే కుండ బద్దలు కొట్టారు. కింద నుంచి పైస్థాయి దాకా పోలీసు యంత్రాంగం అవినీతితో పుచ్చిపోయిందని, అందువల్లే గుట్కా కుంభ కోణం అంత విస్తృతంగా సాగిందనీ ఆయన సెలవిస్తు న్నారు. పొగాకు సంబంధ వ్యాధులకు చికిత్స మొత్తం ప్రభుత్వాలు, ప్రైవేటు వ్యక్తులు ఖర్చు చేస్తున్నది. ఏటా రూ.30 వేలకోట్లు! గుట్కాలు, పాన్‌మసాలాల బారినపడి ఏటా లక్షలమంది ప్రాణాంతక వ్యాధులతో అర్ధాయుష్కుల వుతుంటే, ఆ మహా వైపరీత్యాన్ని నిలువరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలు అవినీతి ఊబిలో కూరుకుపోయి, మ ృత్యుబేహారులకు గులాంగిరీ చేస్తుంటే- జన సామాన్యాన్ని కాచేదెవ్వరు? గుట్కా విషగుళికల నుంచి, మత్తు మాదక ద్రవ్యాల విష పరిష్వంగం నుంచి దేశాన్ని బ్రోచేదెవ్వరు?
పొగాకు ఉత్పత్తుల నియంత్రణ సాధ్యమయ్యేనా!?