హైదరాబాదు అత్యంత సమీపంలో ఉమ్మడి నల్లగొం డ, జిల్లా రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో సంస్థాన్ మండ ల పరిధిలో ఉన్న రాచకొం గుట్టలకు ఎంతో ప్రత్యేకత ఉంది. చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే రాచకొండకు ఘనమైన చరిత్ర ఉంది. యాత్రిక జీవనానికి కాలుష్యానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి చక్కటి విడిది రాచకొండ. చరిత్ర సాక్ష్యంగా నిలిచిన రాచకొండ కోట ముఖద్వారం స్వాగతం పలు కుతూ పూర్వంలోకి తీసుకెళ్తుంది. బలిష్టమైన బండరాళ్లతో శత్రుదుర్బే ద్యంగా నిర్మించిన ప్రాకారాలు, ఆనాటి రక్షణ వ్యవస్థ మన కళ్ళముందుంచుతుంది. 600 వందల అడుగు ల ఎత్తయిన ఆ కొండ పై రాచకొండ పద్మనాయకుల ప్రభువులు కొలువుదీరేవారట ఆ కొండ చుట్టూ దుర్భిక్ష మైన ప్రకారం మధ్య మధ్యన ఎత్తైన బురుజులు వాటిపై పేల్చడానికి సిద్ధంగా ఉన్న ఫిరంగులు, అమరికలు దాటితే కొండపైకి చేరవచ్చు. ఈ కొండపైనే మండపాలు, రాజప్రాసా దాలు, తటాకాలు, జలాశయాలు కనిపిస్తాయి. రెండు పెద్ద బండరాళ్ల చీలిక మధ్య సంకెళ్ల బావి ఉంది. అందులో అన్ని కాలాలలో నీళ్లు ఉండటం విశేషం. కాకతీయ రాజ్య పతనానంతరం రేచర్ల పద్మనాయకుల పాలన రాచకొండ తీవ్రంగా సుమారు 100 సంవత్సరాలు కొనసాగింది. వారు 1361లో ఆమనగల్లు నుండి రాజధానిని రాచకొండకు మార్చారు. ృద్ధికి నేటి తెలంగాణ అంతటికీ తమ రాజ్యాన్ని విస్తరించారు. రేచర్ల పద్మనాయ కుల వంశీయులైన అనపోతనాయుడు 1861 నుండి 1384 వరకు ఆ రాచకొండను సాధించారు. అతని కాలంలోనే ఈ దుర్గాన్ని నిర్మించారు. కొంతకాలం తరువాత బహు మనీ సుల్తానుల దాడికి రాచకొండ రాజ్యం పతనమైం ది. నేటికీ ఆ నాటి రాచకొండ రాచరిక అవశేషాలు, విధ్వంసపు చిహ్నలు రాచకొండను దర్శించే పర్యాట కులను కనువిందు చేస్తాయి. రాచకొండ రాజా స్థానంలో వేదంగాలు ఇతిహాసాలు, పురాణాలు, అలంకారశాస్త్రాలు, రాజనీతి ధర్మాచరణ, సంగీత కళా శాస్త్రాలను అవపో సనపట్టిన దిట్టలుం డేవారట. నాటి అగ్రహారాలు దేవాలయాలు విద్యా లయాలుగా 11 వీలసిల్లేవి. రాచకొండ ను పాలించిన మూడో సింగభూపాలుడు యేటా వసంతోత్స వాలను ఏర్పాటుచేసి సకలకళా కోవిదులను సన్మానించేవారు. రాజా స్వరాష్ట్ర సింగభూపాలుడు స్వయంగా కవి కూడా, విశ్వకవి, పశుపతి, నాగ పండితుడు, బొమ్మకంటి అప్పయ్యవర్యుడు. గౌరన్న ఇతని ఆస్థానంలోని వారే. అతని కుమారుడే హరిశ్చంద్ర చరిత్ర రచించిన గౌరన్న. ఇంత గొప్ప చరిత్ర కలిగిన రాచకొండను ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేశాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత అభివ ృద్ధికి పునాదులు పడ్డాయి, కానీ పురావస్తుశాఖ వారు నిరాదరణ చూపారు. ఫలితంగా చరిత్రకు గుర్తుగా నిలవాల్సిన చరిత్ర కట్టడాలు శిథిలావస్థ కు చేరుకున్నాయి. రక్షణ ఏర్పాటు లేకపోవడంతో శిల్ప సంపద తరలిపో తుంది. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న రాచకొండ ప్రాంతంలో 150కి పై చిలుకు దేవాలయాలను, చరిత్రకు సాక్ష్యంగా నిలిచే కట్టడాలను శిథిలావస్థకు చేరకుండా చూడాలి. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయటపడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల నుండి తండోపతండాలుగా ప్రజలు వస్తుంటారు. ఈ ప్రాం తానికి రాష్ట్ర ప్రభుత్వం సాగు, తాగునీరు అందించేందుకు 1.72 కోట్లు విడుదల చేసింది. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా ప్రతి శివరాత్రికి రాచకొండలో ఉన్న గాలిబ్ సాబ్ ఉర్సు ఉత్సవాలకు 3,4 రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో విచ్చే స్తారు. మతాలకతీతంగా జరగడం ఇక్కడి ప్రత్యేకతా అన్నీ మతాలవాల్లు ఈ ఉత్సవాలలో పాల్గొనటం విశేషం. రాచకొండ ప్రాంతాని కి తాగు, సాగునీరు వస్తుం దంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మండలి విప్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కృషి ఎనలేనిదాని ప్రజలు భావిస్తు న్నారు. రాచకొండ ప్రాంతంలోని ప్రతి సమస్యను విజ్ఞప్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతుడయ్యాడు.
గుండమల్ల సతీష్ కుమార్, సంస్థాన్ నారాయణపురం. 94931 55523.