ములుగురోడ్డులోని గార్డియన్ మల్టీ స్పెషాలిటీ ప్రయివేటు ఆసుపత్రి” వైద్యవ్యాపార కేంద్రంగా వర్ధిల్లు తుందంటే ఎవరైనా నొచ్చుకుంటారేమో కానీ ఆసుపత్రి అనుమతులు ఎలా ఇచ్చారో... నిర్వహణ తీరు ఎలా ఉందో సమగ్ర విచారణ చేపట్టి అసలు గుట్టు తేటతెల్లం చేసే సాహసం చేయగలరా అనేది ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆసుపత్రి భవనానికి ఫైర్ ఎలా ఇచ్చారం టే సమాదానం చెప్పగలరా..? విరుద్ధంగా ఉన్న ఆసుపత్రి భవనానికి ఫైర్ సేఫ్టీ అనుమతులు ఎలా ఇచ్చారం టే సమాదానం చెప్పగలరా..? నిబంధనలు పాటించకున్నా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టకపోవటానికి కారణమేమిటనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఫైర్ సేఫ్టీ అనుమతులకు భిన్నమైన రీతిలో ఆసుపత్రి భవనం ఉండటం ఫలితంగా ఏదేని అనుకోని సంఘటన సంభవిస్తే ఆ నష్టానికి బాధ్యత వహించే శాఖాధిపతులు ఎవరనేది ఆలోచించాలి. నిబందనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నా కనీసం పర్యవేక్షణ చేయకపోవటం, చర్యలు చేపట్టడం లేదంటే ఏమనుకోవాలి. సేవా దృక్పథం మరిచి వ్యాపారమే ధ్యేయంగా ఆసుపత్రుల భవనాలను నిర్మాణం చేస్తూ కొనసాగుతున్న ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వాల్సిన సంబంధిత శాఖలు ఎంతటి ఉదాశీనతగా వ్యవహరిస్తున్నారో చెప్పటానికి ఇంతకన్న సాక్ష్యం ఏం కావాలి. నిబంధనలకు అనుగుణంగా ఫైర్ హహనం తిరిగే విధంగా భవన సముదాయం లేకున్నా అగ్ని మాపక శాఖ ఎలా గుడ్డిగా అనుమతులు ఇచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైర్ నిరంభ్యతర అనుమతులు అవసరం ఉన్న భవనాల చుట్టూ అగ్నిమాపక వాహనం తిరుగటానికి అనువైన ఖాళీ స్థలం ఉండాలని జీఓ నెంబర్ 168, ( 07. 04. 2012 ) మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ఉత్తర్వులు తెలుపుతున్నప్పటికీ కనీసం పాటించటం లేదనేది గమనించాలి. ఇక భవనం లోపలికి ప్రవేశించటానికి, తిరిగి బయటకు రావటానికి 6 మీటర్ల వెడల్పు గల ఇన్ గేట్, ఔట్ గేట్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు సైతం గార్డియన్ ఆసుపత్రిలో ఎక్కడ కనిపించవంటే అతియోశక్తి లేదు. ఈ ఇదిలావుంటే మరోవైపు ఆసుపత్రిలో వైద్య సేవలు, వైద్య సిబ్బంది తీరు ఫంకూ వ్యాపారమయంగా ఉండటం బహిరంగ రహసమే అనటంలోనూ సందేహించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య శ్రీ సేవల అంశంలో, ఫీజుల అంశంలో కనిపించని మాయాజాలం జరుగుతుందనటంలోనూ వెనుకాడాల్సిన పని లేదు. ఆసుపత్రి అసలు గుట్టు తెలియాలంటే నిబంధనలకు విరుద్దంగా ఆసుపత్రి భవనానికి ఫైర్ నిరభ్యంత అనుమతులు ఎలా ఇచ్చారో సమగ్ర విచారణ జరిపితే తెలుస్తుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు,ఫీజులు, పాటిస్తున్న నిబంధనలపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ తేపట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ సేవల అంశంలో ఆదాయవ్యయాలను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఐఎంఏ ఓరుగలులోని గార్డియన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ తీరుపై చర్యలు చేపట్టి చిత్తశు ద్దిని చాటుకోవాల్సిన అవసరం ఉంది.
నమిండ్ల ప్రమోద్ జర్నలిస్ట్ -
వరంగల్-సెల్ :63056 38569