శాయంపేట, ఆత్మకూర్ స్టోన్ క్రషర్లకు అధికారుల ఆశీస్సులు..!

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట, ఆత్మకూర్ మండలాల పరిధిలోని స్టోన్ క్రషర్లకు సంబంధిత శాఖల ఆశీస్సులు ఉన్నాయంటే నొచ్చుకుంటారేమో కానీ, యధేచ్చగా నిర్వహింబడుతున్న క్రషర్లపై ఎందుకు ఎందుకు సమగ్రమైన విచారణ చేపట్టడం లేదు..? నిబంధనలు అతిక్రమిస్తూ బోర్ బ్లాస్టింగ్ లు చేస్తున్న స్టోన్ క్రషర్లపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటే సమాధానం చెప్పగలరా..? అయితే నిబంధనలు అతిక్రమిస్తున్న స్టోన్ క్రషర్ల నిర్వహణపై, పన్నులు సక్రమంగా చెల్లించని తీరుపై సంబంధిత శాఖలు చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. ఆత్మకూర్, శాయంపేట మండలాల్లోని స్టోన్ క్రషర్లే ఇందుకు ఉదాహరణ. ఈ మండలాల్లోని ఎస్వీసీ స్టోన్ క్రషర్, సాయిరాం స్టోన్ క్రషర్, అధిజా స్టోన్ క్రషర్ లు చెల్లించే సినరేజ్ చార్జీలను ఒకసారి నిర్దిష్టంగా విజిలెన్స్, ఎన్ఫోర్డ్మెంట్ తో విచారణ చేస్తే అసలు బాగోతం తెలుస్తుంది. మరోవైపు ఇదే ఆత్మకూర్ మండల కొత్తగట్టు- మల్కపేట గ్రామాల పరిధిలోని " స్టోన్ క్రషర్లతో బతుకలేక పోతున్నాం. నిత్యం బోర్ బ్లాస్టింగ్ లు చేస్తున్నారు. దుమ్ము దుము ఊరిని కమ్మేస్తుంది. ఊపిరాడటం లేదు. ఇదేంటని అడిగినందుకు 17 బాధితులు మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఉదాంతాన్ని కూడా మరువరాదు. ఇది స్టోన్ క్రషర్ నిర్వహణను అడ్డగించి జైలు పాలైన బాధితుల గోడు. మంవైపు మరోవైపు శాయంపేట మండల పరిధిలోని అభిరామ్ స్టోన్ క్రషర్ లో గోడుఅంగ బోర్ బ్లాస్టింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు రెడ్ హండెడ్ గా దొరికినా కూడా ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియకుండా మరుగునపడేశారనటంలోనూ అతియోశక్తి లేదు. పోలీసులు స్టోన్ క్రషర్లు విచ్చలవిడిగా ఉండటం, అభ్యంతరం చెప్పిన ప్లాన్ కవర్లు దళిత, బహుజనులను జైలుకు పంపిన ఘటన ఉందనేది గమనించాల్సిన అంశం. కొత్తగట్టు, మల్కపేట గ్రామాల పరిధిలో క్రషర్లను ఏర్పాటు చేసి బోరు బ్లాస్టింగ్ లతో గుట్టలను పేల్చివేస్తూ గ్రామంలోని ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తుంటే సంబంధిత శాఖలు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ చర్యలు చేపట్టడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇట్టి క్రషర్లపై కనీసం పర్యవేక్షణ కూడా చేయకపోవటం అధికారుల సమర్థత ఏపాటిదో తెలుపుతుంది. రోజు వందకు పైగా లారీలు ఊరు మధ్య నుండి పోవడం వల్ల దుమ్ము ధూళితో గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగడమే కాకుండా బోర్ బ్లాస్టింగ్ ల వల్ల ఇల్లు ఈ వల్ల ఇల్లు బీటలు బారుతున్నాయని ఊరిలో బతకడం కష్టమవుతుందని బాధితులు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. ఇది ఒక కొత్తగట్టు, మల్కపేట గ్రామాల జైలు బాధితుల గోడు మాత్రమే కాదు. ఆత్మకూర్, శాయంపేట మండలాల పరిధిలో ఉన్న స్టోన్ క్రషర్ల బాధితుల గోడు. పన్నుల ఎగవేతలో పైన పేర్కొన అధిజా, సాయిరాం, ఎస్వీసీ, సాయిరాం స్టోన్ క్రషర్లే కాదు మిగతా అన్నింటి పరిస్థితి ఇదే అనేది గమనించాలి. శాయంపేట మండలంలోని అభిరాం స్టోన్ క్రషర్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే బోర్ బ్లాస్టింగ్ లు ఎలా విచ్చలవిడిగా జరుగుతున్నాయో చెప్పటానికి నిదర్శనమని గుర్తించాలి. ఇదే తరుణంలో ఇట్టి ఘటనపై చేపట్టిన చర్యలు ఏమిటో కూడా అధికారులు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా స్టోన్ క్రషర్ల నిర్వహణ తీరుపై సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖలు చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి. .


రాజేందర్ దామెర ( జర్నలిస్ట్) సహజ వనరుల పరిరక్షణ వేదిక -


వరంగల్ సెల్ : 8096202751