మార్చి (1వ పేజీ తరువాయి) హైకోర్టు ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసిందని ప్రత్యేక పబ్లిక్ రాజీవ్ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఏ ఒక్క దోషి పిటిషన్ కూడా ఏ న్యాయస్థానంలోనూ పెండింగ్ లో లేదని వివరించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దోషుల ఉరితీతకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. మార్చి 3న దోషులను ఉరితీయాలంటూ తిహాడ్ జైలు అధికారులను ఆదేశించింది. ఉరి వాయిదా పడేలా దోషుల ప్రయత్నాలు దిల్లీ: నిర్భయ కేసులో వాయిదా పడేలా చేసేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. ఇక మరో దోషి పవన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మరో దోషి అక్షయ్ మరోసారి క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తున్నాడు. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు కొత్త డెత్ వారెంట్లు జారీ చేయాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం ఇటీవల దిల్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ ఓటరు కార్డు ఉన్నంత నిరాహార దీక్ష చేపట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో చట్టపరంగా అతడి పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయమూర్తి జైలు సూపరిండెంట్ ను ఆదేశించారు. మరోవైపు వినయ్ శర్మ తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేయలేమని వినయ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక మిగిలిన దోషులు కూడా ఉరి వాయిదా పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దోషి అక్షయ్ మరోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు అతడి తరఫున న్యాయవాది తెలిపారు. దోషి పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అతడు కూడా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తరఫున న్యాయవాది బృందా గ్రోవర్ వాదించడం తనకు ఇష్టం లేదని మరో దోషి ముకేశ్ కుమార్ దిల్లీ కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ స్థానంలో అడ్వొకేట్ రవీ ఖాజీని న్యాయస్థానం నియమించింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది.
మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి |