"తెలంగాణ ఉద్యమ పునాదిరాయి " అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేళ. ఎందరో తెలంగాణ వీరయోధుల, అమరుల ఆకాం క్షలకు దర్పణం. ఆ వీర తెలంగాణ అమరుల ముందు వరుసలో కాలంలో బియ్యాల జనార్దన్‌రావు ప్రథముడు. భూముల ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనా ర్ధనరావు తెలంగాణ సకల జనుల మనసుల్లో చెర గని ముద్రవేశారు. బియ్యాల పబ్లిక్ తొలి అనుబంధం ఆది వాసులతో, మలి అనుబంధం తెలంగాణ స్వరాష్ట్రం కోసమే. ఆయన వరంగల్ జిలా నెలికుదురు మం డలం మునిగలవీడు ఎష్టి గ్రామంలో కిషన్ రావు. అంజనములకు 1955, అక్టోబర్ 12న జన్మించారు. చిన్న నాటి నుంచి తనకు ఏజెన్సీ గూడేల ఆదివాసీలతో ఏర్పడిన అనుబంధంతో వారి సాంప్రదాయ, వార సత్వ, జీవన విధానంపై ఆకళింపు కలిగింది. మరో పక్క ఏజెన్సీ భూములు, అటవీ వనరులు పరాయీ కరణ చెందడంపై ఆవేదనతో ఆదివాసీల భూసమ స్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి తోడ్పడాలనే సంకల్పంతా కృషి చేశారు. 1983లో కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తిచేసి, పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా చేరారు. ఆ కాలంలో ఆదివాసుల మౌలిక సమస్యలపై దృష్టి పెట్టారు. గిరి జన భూముల పరాయీకరణ అనే అం శంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్డీ పట్టా పొందిన తొలి గిరిజనేతర వ్యక్తి ఈయనే. ఆ తర్వాత కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగపు ప్రధానాచార్యునిగా పనిచేశారు. 1993- 1995 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదివాసీ ఉద్య మాలు, 1/70 చట్టం, ఏజెన్సీ ప్రాంత గ్రామీణ సమస్యలపై ఎక్కువ ద ఎష్టి పెట్టారు. ఆదిలాబాద్ జిల్లా లోని గోండు గిరిజనుల త్యాగాలకు గుర్తుగా ఇంద్ర వెల్లి అమరులను స్మరించడానికి తరచుగా ఉట్నూరు, ఆసిఫాబాద్, కెరిమెరి వెళ్లేవారు. 2001లో నేను స్థానిక ఆదివాసీగా ఆయన ఆయనను కలవడానికి కేయూ హ్యూమానిటీస్ చాంబర్‌లోకి వెళ్తే వెన్ను తట్టి పలక రించిన తీరు మరువలేనిది. (మిగతా రేపు) గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ రచయితల సంఘం
తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా బియ్యాల