దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జీవనాడి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాల్లో అపరిమిత ఆలస్యం రాజ్యమేలుతోంది. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం ఫలితంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం హరించుకుపోతోంది. ప్రాజెక్టుల ప్రారంభ సమయంలో ఇవి పూర్తయితే- దేశ ఆర్థిక ప్రగతికి రథ చక్రాల్లా మారుతాయని వాటి ప్రణాళికా పత్రాల్లో ఘనంగా చెప్పడం ఆనవాయితీగా మారింది. కానీ ఆయా నిర్మాణాలు జరుగుతున్న తీరు, అంతులేని కాలహరణంతో అవి మింగేస్తున్న ప్రజాధనాన్ని చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం చేస్తానని ప్రకటించారు. వీటి నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుంది. తాజా అంచనా ప్రకారం ఇప్పటికే నిర్మాణంలో జాప్యం వల్ల అదనంగా మోయాల్సిన భారం రూ.3.37 లక్షల కోట్ల వరకూ ఉంటుందని గుర్తించారు. కనీసం అరడజను రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకు సమానమైన ఇంతటి భారీ మొత్తాన్ని కేవలం పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు జేబుల నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలస్యానికి కారణాలు అనేకం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనదేశం ముందుందని నేతలు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మొత్తం 1,417 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించినప్పుడు తొలి అంచనా వ్యయాలు రూ. 17.38 లక్షల కోట్లు. ఇప్పుడు ఏకంగా మరో రూ.3.39 లక్షల కోట్లు పెరిగి రూ. 20.77 లక్షల కోట్లకు చేరినట్లు 'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ' తాజా నివేదిక వెల్లడించింది. అంచనా వ్యయం ఏకంగా 19.55 శాతం అధికమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే వాటిలో రూ.150 కోట్లకు మించి వ్యయమయ్యే వాటిని ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. రహదారులు, రైల్వే, టెలికం, స్టీల్, విద్యుత్, బొగ్గు, విమాన, నౌకాశ్రయాలు తదితర రంగాల్లో చేపట్టే పనులను మౌలిక సదుపాయాల రంగం కింద ప్రకటిస్తారు. ఇప్పటికిప్పుడు ఇవి పూర్తయ్యే సూచనలు లేవు. ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేనాటికి నిర్మాణ వ్యయం మరెంతగా పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. వీటిలో 57శాతం ప్రాజెక్టులు నిర్ణీత గడువుకన్నా రెండేళ్ల నుంచి అయిదేళ్లకు పైగా సాగుతున్నాయి. ఇందులో 296 ప్రాజెక్టుల సగటు ఆలస్యం 48 నెలలుగా తేలింది. అంటే ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు పేర్కొన్న గడువుకన్నా మరో నాలుగేళ్లు దాటినా పూర్తి కావడం లేదు. భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతిలో జాప్యం, నిర్మాణ సామగ్రి పంపిణీలో నిర్లక్ష్యం, కూలీలు, నిధుల కొరత తదితర కారణాల వల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. యూనివర్శిటీల్లో అధ్యయనం కేంద్ర విశ్వవిద్యాలయాలలో జాతీయ ప్రాధాన్యత గల అంశాలనే పి.హెచ్.డి లో పరిశోధన అంశాలుగా విద్యార్థులు ఎంచుకోవా లన్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ప్రతిపాదనలు పరిశోధన స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి ఎందుకంటే కేవలం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాధాన్యత గల అంశాలనే పరిశోధకులు తమ పిహెచి ఎంచుకుంటే మారుమూల గ్రామీణ, గిరిజన సామాజిక అంశాలు ఏ విధంగా అధ్యయనం చేస్తారు, కేవలం జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలను మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రతిపాదనలు అనుగుణంగా ఏ విధంగా గుర్తించాలి దీనివల్ల పరిశోధక విద్యార్థులకు పరిశోధన స్పూర్తి స్వేచ్చలు కోల్పోతారు కొన్ని అంశాలు ఆయా రాష్ట్రాలకు చెందిన ఆయా ప్రాంతాలకు చెందిన సామాజిక సమస్యలు ఉంటాయి. కొన్ని విభాగాలకు దేశ స్థాయీ అంశాలు సరిపోవు అలాంటి సమయంలో వారి పరిస్థితి ఏమిటి?, అలాంటప్పుడు సెంట్రల్ యూనివర్సిటీల విద్యార్థులు దేశ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పైనే అందరూ చేస్తే ప్రాంతీయ సమస్యలపై అధ్యయనం చేసే వారు ఉండక క్రింది స్థాయిలో ఉన్న ప్రాంతాల ప్రాధమిక సమస్యల అధ్యయనం జరగదు. పరిశోధన అనేది జాతీయస్థాయిలో అయినా లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న దానికి కొన్ని పరిమితులుంటాయి, ఆయా పరిమితులకు మేర పరిశోధకులు ఒక అంశంపై అధ్యయనం చేసి తమ ఫలితాలను వెల్లడిస్తారు. కానీ మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పరిశోధన దేశ ప్రాధాన్యత అంశాలపైనే చేయలేమని ఒక ప్రొఫెసర్ తన పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. కేంద్ర విశ్వవిద్యాలయాలలో పీహెద్దీ ముఖాముఖి పరీక్షలోనే జాతీయ అంశాలను గుర్తించి వారిని మాత్రమే ఎంపిక చేయాలన్న భావన వల్ల నేటి పరిశోధన విద్యార్థుల స్పూర్తి, ఆసక్తులను కోల్పోయి ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెంటనే ఆ ప్రతిపాదనలను సవరించి కేంద్ర విశ్వవిద్యాలయాలలో జాతీయ స్థాయిలో మరియు ప్రాంతీయ స్థాయిలో అక్కడి ప్రాంతాలకు అనుకూలంగా తమ తమ పరిశోధన అంశాలను ఎన్నుకునే విధంగా పరిశోధన విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలి పరిశోధనలకు కావాల్సిన పూర్తిస్థాయి సౌకర్యాలను నిధులను అధిక మొత్తంలో కేటాయించాలి ఎందుకంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పరిశోధనలపై ఖర్చు చేస్తున్న చాలా చాలా తక్కువ మనం కల్పించేటువంటి సౌకర్యాలు నిధుల వల్లే పరిశోధన ఫలితాలు ఉంటాయి ఇప్పటికైనా మానవ వనరుల మంత్రిత్వ శాఖ , జాతీయ విశ్వవిద్యాలయం నిధుల సంఘం ఈ అంశంపై సమాలోచనలు చేయాల్సిన ఎంతైనా ఉంది.
ఆలస్యంతోనే కుంటుపడుతున్న ప్రగతి