సికింద్రాబాద్, హైదరాబాద్ నుండి ప్రారంభం అయ్యే రైళ్లలో జనరల్ బోగీలు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్.టి.సి. బస్సుల టికెట్ రేట్లు ఈ మధ్య కాలంలో పెంచటం వలన అధిక సంఖ్యలో ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గు చూపిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లొనే ఉన్న జనరల్ బోగీలో ప్రయాణికులు నిండి పోతున్నా సమర్థ్యానికి మించి టికెట్స్ జారీ చేయడం వలన ప్రయాణికులు నిలబడి తోపులాటలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు మరుగుదొడ్లు లో కూడా నిల్చొని ప్రయాణం చేస్తున్నారు.. ముఖ్యంగా స్త్రీలు , చిన్నపిల్లలు కూడా అవస్థలు పడుతున్నారు. కాబట్టి రైల్వే అధికారులు ప్రయాణికులు రద్దీని దృష్టిలో ఉంచుకుని వెంటనే జనరల్ బోగీల సంఖ్యను పెంచాలి. సామర్థ్యానికి మించి టిక్కెట్లు జారీ చేయకుండా స్త్రీలకు ప్రత్యేక అదనపు బోగీలు ఏర్పాటు చేయాలి.
కందగట్ల శ్రవణ్ కుమార్, అధ్యక్షుడు
సామాజిక రచయితల సంఘం
వరంగల్ అర్బన్ జిల్లా