కేంద్ర ఓబీసీ జాబితాలో 2600 కులాలు ఉండగా 2520 కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశంలోని 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుంచి బీసీ వర్గానికి చెందిన ఒక్కరు కూడా పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశ జనాభాలో 56 శాతంగా వున్న బీసీలకు 14 శాతం రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే ఇదేమి ప్రజాస్వామ్యం అవుతుంది? ఓబీసీలలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని, ఓబీసీ -జాబితాలో ఉన్న అన్ని కులాలకు జనాభా నిష్పత్తిలో సమన్యాయం జరగాలని సంకల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీ- రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేయాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. అలాగే ఇంకొక అడుగు ముందుకు వేసి తెలుగు ఆడబిడ్డ, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రోహిణిని చైర్మన్‌గా నియమించడంతో అందుతుంది. గత మార్చిలో జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్దమైన హోదా కల్పించిన ప్రధాని మోదీ ఇప్పుడు దేశ ప్రజల అభిమానం మరింతగా చూరగొన్నారు. 1993 నుంచే బీసీ సంక్షేమ సంఘం బీసీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఎలాంటి వివాదం లేని ఈ డిమాండను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ప్రధానిగా మోదీ బాధ్య తలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు బీసీల సమస్యలపై చర్చలు జరపడం జరిగింది. ఈ నెలలో కలిసినపుడు మరోసారి ఇతర డిమాండ్లతో పాటు వర్గీకరణ గురించి గుర్తుచేయడం జరిగింది. దీనికి స్పందించిన ప్రధానమంత్రి సమాజంలో వివాదాస్పదం కాని బీసీల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ డిమాండు వెంటనే అంగీకరించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం వలన కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్న 2600 కులాలకు న్యాయం జరుగుతుంది. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రంలో ఓబీసీ -రిజర్వేషన్లను 1993 నుంచి అమలు చేస్తున్నప్పటికీ 2600 బీసీ కులాలలో ఇంతవరకు 1470 కులాలు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు ఫలితాలు పొందలేకపోయాయి. బీసీ కులాలలో కూడా చాలా హెచ్చు తగ్గుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు ఉన్నవి. ఇప్పుడు వర్గీకరణ చేయడం వలన అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది. దేశంలోని 29 రాష్ట్రాలలో 26 రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఇందులో 9 రాష్ట్రాలు వివిధ రూపాలలో వర్గీకరించి అమలు జరుపుతున్నాయి. ఇప్పుడు కమిషన్ నియామకంతో వర్గీకరణ జరిగి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అమలు జరిపే పరిస్థితి ఏర్పడింది. వర్గీకరణ కసరత్తు చాలా క్లిష్టమైనది, సున్నితమైనది. వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలి. -సమన్యాయం జరిగే విధంగా ఉండాలి. ఎలాంటి వత్తిడిలకు, ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా జరగాలి. ఒక్కొక రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని కసరత్తు చేయవలిసి ఉంటుంది. ఇప్పటికే 9 రాష్ట్రాలు వర్గీకరణ చేసి అమలు జరుపుతున్నాయి. ఒక్కొక రాష్ట్రంలో ఒక్కో విధంగా వర్గీకరణ ఉంది. తమిళనాడులో రెండు రకాలుగా ఉంది. వెనుకబడిన తరగతులు,- అత్యంత వెనుకబడిన తరగతులుగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏబీసీడీఈ లు ఐదు గ్రూపులుగా ఉంది. కర్ణాటకలో 8 గ్రూపులుగా ఉంది. మహారాష్ట్రలో రెండు గ్రూపులతో పాటు కర్ణాటకలో 8 గ్రూపులుగా ఉంది. మహారాష్ట్రలో రెండు గ్రూపులతో పాటు డీఎన్స్ గ్రూపుగా, సంచార జాతులుగా వర్గీకరణ ఉంది. చాలా రాష్ట్రాలలో రకరకాలుగా వర్గీకరణ ఉంది. అసలు వర్గీకరణ లేని 17 రాష్ట్రాలలో వర్గీకరణ చేపట్టాలి. కేంద్రంలో మూడు గ్రూపులుగా లేదా నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేపట్టిన విశ్లేషణ - పరిశోధనతో చాలా కసరత్తు చేయవలసి ఉంది. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం విధించిన మూడు నెలలు సరిపోదు. బీసీ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించవలసి ఉంటుంది. క్షేత్రస్థాయి సర్వే చేయాలి. అన్ని సంఘాల వారిని కలుసుకొని వారి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆయా రాష్ట్రాల బీసీ కమిషన్, బీసీ సంఘాలతో, కుల సంఘాలతో భేటీ అయ్యి చర్చించాలి. ఇలా చాలా కసరత్తు చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క కులం సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. దేశంలోని 29 రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక తీరుగా బీసీ జాబితా ఉంది. దేశంలో ఒకే కులం విభిన్న సామాజిక వర్గాలుగా బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో ఉన్నాయి. ఒకే కులం వివిధ రాష్ట్రాలలో వివిధ వృత్తులు, వివిధ రకాలైన సామాజిక, సాంఘిక, భౌగోళిక పరిస్థితులలో జీవిస్తున్నారు. వీటన్నిటిపై కమిషన్ సంపూర్ణంగా, శాస్త్రీయంగా అధ్యయనం జరుపవలసిన అవసరం ఉంది. 2011 జనాభా లెక్కలలో కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలను కూడా సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేక కమిటీని వేసింది. కానీ ఇంతవరకు కులాల వారీ లెక్కలు ప్రకటించలేదు. కులాలవారీ లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ జరుగుతుంది. ఎందుకంటే, గ్రూప్లలో చేర్చే కులాల జనాభా తెలిస్తే జనాభా ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి వీలవుతుంది. అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరుగుతుంది. మండల్ కమిషన్ ప్రకారం కేంద్రస్థాయి రిజర్వేషన్లు ప్రవేశపెట్టి 24 సంవ త్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు 14 శాతం దాటడం లేదు. దీనికి కారణం ఏమిటి? ఒకటి క్రిమిలేయర్ అవరోధం కాగా మరొకటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం. మూడవది చాలా రాష్ట్రాల్లో స్కాలర్ షిన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేకపోవడం వలన బీసీలు చదువుకోలేకపోతున్నారు. దీనిమూలంగా అర్హులైన అభ్యర్థులు లభించడం లేదు. దీనితో ఓబీసీ రిజర్వేషన్లు భర్తీ కావడం 2010లో కేంద్రప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులు 9 శాతం లేరు. ఇప్పుడు 2017లో ఇది 14 శాతానికి చేరి ఉంటుందని ప్లానింగ్ శాఖ అంచనా! అన్ని కులాలలో ఉన్న ప్రతిభావంతుల మేధాశక్తిని వెలికితీసి జాతి | వెలికితీసి జాతి ప్రగతికి వినియోగించవలసిన అవసరం ఉంది. 52 శాతం జనాభా గల బీసీల మేధాసంపతి, నైపుణ్యం, ప్రతిభను వెలికితీసి జాతి ప్రగతికి, దేశాభివృదిలో వారిని భాగస్వాములుగా చేయవలసిన అవసరం ఉంది. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, శిల్పి, కంసాల తదితర వృత్తి కులాలవారికి ఉన్న తరతరాల వృత్తి నైపుణ్యాన్ని విద్య, విజ్ఞానం వైపు మళ్లించడం నేటి చారిత్రక అవసరం. ఎందుకంటే పారిశ్రామికీకరణ, కంప్యూటరీకరణ వేగవంతంగా జరుగుతున్న నేటి సంధి కాలంలో కుల వృత్తులకు, చేతి వృత్తులకు కాలం చెల్లింది. వీరి నైపుణ్యం, ప్రతిభ మారుతున్న కాలానుగుణంగా మరల్చవలసిన అవసరం ఉంది. ఇక రాజకీయ రంగంలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో లోకసభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, కేంద్ర-రాష్ట్ర మంత్రి వర్గాలలో బీసీల శాతాన్ని 2014లో లెక్కిస్తే 14శాతం ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు తేల్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. - ఇది ప్రజాస్వామ్య మౌలిక లక్షణం, రాజ్యాంగబద్ధమైన హక్కు. కేంద్ర ఓబీసీ - జాబితాలో 2600 కులాలు ఉండగా 2520 కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశంలోని 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుంచి బీసీ వర్గానికి చెందిన ఒక్కరు కూడా పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశ జనాభాలో 56 శాతంగా వున్న బీసీలకు 14 శాతం రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే ఇదేమి ప్రజాస్వామ్యం అవుతుంది? కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ సంవత్సర ఆదాయ పరిమితి రూ. 6 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచింది. అయితే క్రిమిలేయర్ నిబంధనను పూర్తిగా తొలగించాలని బీసీలు కోరుతున్నారు. రిజర్వేషన్లు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ, మహిళ, వికలాంగులు, ఎన్‌సీసీ/ ఎయయస్- ఇలా ఏడు వర్గాలకు ఉన్నవి. మిగతా ఆరు వర్గాలకు లేని క్రిమిలేయర్ ఒక్క బీసీలకు విధించడం వివక్ష కాదా! పైగా రిజర్వేషన్ల లక్ష్యం పేదరిక నిర్మూలన పథకం కాదు, ఆర్థికాభివృద్ధి పథకం కాదు. రిజర్వేషన్ల లక్ష్యం-, స్ఫూర్తి వేరు. సమాజంలో కుల వివక్షకు గురవుతున్న కులాలకు విద్య, ఉద్యోగం, అధికారం ద్వారా కుల వివక్షను తొలగించడం ఒక లక్ష్యమైతే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించడం మరో లక్ష్యం. ఈ వాస్తవాలను గుర్తించకుండా ఇదేదో పేదరిక నిర్ములన పథకం లాగా ఆర్థిక పరిమితిని నిర్ణయించడం సరికాదు. ఇది రిజర్వేషన్ స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది. దీన్ని పూర్తిగా తొలగించాలి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలి.
వరీకరణతోనే ఓబీసీలకు సమన్యాయం