దేశంలోనే అతి పెద్ద బంగారు గని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ లోని సోనభద్ర జిల్లాలో ప్రభుత్వం భారీ బంగారు నిక్షేపాలను గుర్తించింది ఈ జిల్లాలోని సోన్ పహాడీ ప్రాంతంలో 2,700 టనులు, హారి. ప్రాంతంలో మరో 650 టన్నుల బంగారం కలిపి మొత్తంగా 3,350 టన్నుల బంగారు నిక్షేపాలు గుర్తించినట్టుగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లోని కొండల దిగువన.. బంగారంతోపాటు ఇనుము, పొటాషియం వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్టు గుర్తించారు.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ డైరెక్టోరేట్ ఆఫ్ జియోలాజీ మైనింగ్ అధికారుల అంచనా ప్రకారం.. సోనభద్ర జిల్లాలోని సోన్ పహాడి-హర్ది గ్రామాల మధ్య 3వేల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలను వేలం వేయడం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల బృందాన్ని నియమించిన ప్రభుత్వం.. ఈ-వేలాన్ని చేపట్టనుంది. అలాగే ఈ టీమ్ అక్కడి ప్రాంతం మొత్తాన్ని జియో ట్యాగింగ్ చేశారు. ఆ ప్రాంతంలో బంగారు ఖనిజాలున్నట్టు 2012 లోనే శాస్త్రవేత్తలు గుర్తించినప్పటికీ అది ఇప్పుడు నిజమైంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మైనింగ్ ఆఫీసర్ కె.కె. రాయ్ నిర్ధారించారు. ప్రభుత్వం ఈ బంగారు గనులను మైనింగ్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. జియోలాజికల్ అధికారులు రాసిన అధికారిక లేఖలో సోన్ పహాడి బ్లాకులో 2943.26 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని.. హర్ది బ్లాకులో 646. 15 కేజీల బంగారు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రస్తుతం భారతదేశ గోల్డ్ నిక్షేపాల నిలువ 626 టన్నులు మాత్రమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ నిక్షేపాలు ఐదు రెట్లు పెద్దవి. వీటి విలువ దాదాపు రూ. 12లక్షల కోట్లు. సోనభద్ర జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఇక్కడ 1992-93 నుంచి బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందు.. గతంలో బ్రిటీష్ అధికారులు సోనభద్రలో బంగారు నిక్షేపాల కోసం అన్వేషించినట్టు డబ్బలు చెబుతారు. సోనభద్ర ప్రాంతంలో దాదాపు ఒక కిలో మీటరు పొడవు, 18మీ. ఎత్తు, 15మీ. వెడల్పుతో బంగారు నిక్షేపాలు ఉన్నాయని బంగారు చెప్పారు. సోన్ కాగా, మన దేశంలో ప్రస్తుతం నాలుగు బంగారు గనులు ఉన్నాయి. . అందులో మూడు కర్ణాటకలో ఉండగా, ఒకటి జారిండ్ లో ఉంది. బంగారం తాజాగా యూపీలో గుర్తించిన గని.. వాటన్నింటికన్నా చాలా పెద్దది. ఆ నాలుగు బంగారు గనులు కలిపినా కూడా.. ఇప్పుడు యూపీలో గుర్తించిన గనిలోనే ఎక్కువ బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేం కాదంటున్న జీఎస్ట్ యూపీ సోనభద్రలో 108 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు గనులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే... ఇప్పుడు అంతా తూచ్... అక్కడ బంగారం ఏమీ లేదంటోంది జియోలాజిల్ సర్వే ఆఫ్ ఇండియా. సోనభద్రలో బంగారు గని ఉందని తాము ఎలాంటి ప్రకటన చేయలేదని... ఆ ప్రచారంతో తమకు సంబంధం లేదంటోంది జీఎస్ఎ.సోన్ భద్ర జిల్లాకు ప్రచారం చెందిన మైనింగ్ అధికారి ఇచ్చిన సమాచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జీఎస్ట్ డైరెక్టర్ జనరల్ శ్రీధర్. సోనభద్రలో బంగారు గనిపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అక్కడ బంగారు నిల్వలు లేవుని స్పష్టం చేసింది. జీఎస్ఎ. వివిధ ఖనిజాలు దొరికే ఈ ప్రాంతంలో ప్రతి టన్నుకు 3 గ్రాముల బంగారం లభిస్తుందన్నారు. జీఎస్ట్ డైరెక్టర్ జనరల్ శ్రీధర్. అంటే ఇక్కడ మొత్తం 52 వేల 806 టన్నుల ముడి ఖనిజం లభిస్తే అందులో నుంచి 160 కిలోల బంగారం వస్తుందన్నారాయన. అంతేకాని... 3 వేల టన్నుల బంగారం రాదని స్పష్టం చేశారు. మొత్తానికి సోద్రలో టన్నుల కొద్దీ బంగారం లేదని జీఎస్ఇ స్పష్టం చేయడంతో దేశం మొత్తం నిరాశ చెందింది. సోభద్ర నిక్షేపాలతో దేశం మొత్తం బంగారు మయమవుతుందని ఆశించిన వారందరికీ నిరాశే మిగిలింది.
(ప్రభు పులవర్తి, ఫ్రీ లా)న్స్ జర్నలిస్ట్, విజయవాడ)