సబ్ కే సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ. రిలయన్స్ గుప్పెట్లో భారతదేశం. సంస్కరణలు ఎవరికోసం. రిలయన్స్ భారతదేశం. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు పూర్తయిన భారతదేశం ఎటువంటి అభివృద్ధి సాధించలేదని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అరవై సంవత్సరాలలో సాధించని అభివ అద్ధిని 60 నెలలు సాధిస్తానని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. గత ఐదు సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సాధించిన ప్రగతి కంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ 60 నెలలు దాటవేసింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడం కంటే ప్రజలను ఎక్కువగా కష్ట పెట్ట డానికి ప్రయత్నిస్తుంది. భారతదేశాన్ని ప్రస్తుతం ప్రధానమంత్రి పరిపాలిస్తున్నారు అనటం కంటే కార్పొరేట్ కంపెనీలు పాలిస్తున్నాయి అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రజలు ఓట్లను వేసి ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు కావాలని పరితపిస్తూ ఉంటే ప్రస్తుతం పాలకులు పాలనా వ్యవస్థను కూడా కార్పొరేట్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోకుండా పాలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజలు కార్పొరేట్ కంపెనీ లను చూశారు. మోడీ దయ వలన భారతదేశంలో కార్పొరేట్ రాజకీయ పార్టీని భారతీయ ప్రజలు చూస్తున్నారు. రాజకీయ పార్టీని కూడా కార్పొరేట్ కంపెనీ గా మార్చిన ఘనత గౌరవ ప్రధాన మంత్రి కె దక్కుతుందని, సామాన్య ప్రజలకు కావలసిన దానికన్నా కార్పొరేట్ కంపెనీలకు ఏమి కావాలి అన్నది మన ప్రధానమంత్రి గారికి బాగా తెలిసిన విషయం . పేదవాడు ప్రధానమంత్రి అయితే పేదల బాధ తెలుస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ పేదవాడికి అధికారం వచ్చిన కార్పొరేట్ కంపెనీలకు వెన్ను గా నిలబడతారని మోడీ నిరూపించుకున్నారు. పేద ప్రజల బాధలను తీర్చే పోగా మరింతగా పేద ప్రజలను బాధలకు గురి చేస్తున్నారు. సబ్ కే సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ :సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అని అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ కంపెనీ కా వికాస్, సబి జనతా కా వినాష్ గా ముందుకెళ్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని సంస్కరణలు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రధాని ఉపన్యాసం ఇస్తారు కానీ ఆ సంస్కరణలు పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఊపిరి పీల్చుకో లేని విధంగా చేస్తుంది. భారతదేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పేద వర్గానికి చెందిన ప్రధానమంత్రికి పట్టకపోవడం సంపన్న వర్గం నుంచి వచ్చిన గాంధీ-నెహ్రూ కుటుంబాలకు పట్టకపోవడం చాలా బాధాకరం. భారత దేశంలోని ప్రజలను రాజకీయ పార్టీలు కేవలం ఓటర్ లు గానే చూస్తు న్నారు కాని కనీసం ప్రజల లాగా చూడకపోవడం చాలా బాధాకరం. ఈ దేశంలో లో ప్రజల కన్నా పశువులకు ఎక్కువ విలువ ఉండటం మన మంత ఆనంది. ఆ ఏర్పా పాలకుల ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. ప్రస్తుతం బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా గా కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే విధంగా ఉంది. పేదవాడి రక్తాన్ని కష్టాన్ని కార్పొరేట్ కంపెనీలు డైరెక్ట్ గా దోచుకోకుండా ప్రధానమంత్రి మధ్యవర్తి త్వం వహించడం చాలా బాధాకరం. . రిలయన్స్ గుప్పెట్లో భారతదేశం: రానున్న రోజుల్లో లో ప్రీపెయిడ్ ఎలక్ట్రికల్ మీటర్లను తీసుకొచ్చి పేద వాడిని మరింత ఇబ్బంది పెట్టే విధంగా గా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రిలయన్స్ కంపెనీకి అప్ప చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో లో భారతదేశం మొత్తాన్ని రిలయన్స్ గుప్పెట్లో ఉంచడానికి ప్రస్తుత ప్రధానమంత్రి అనుక్షణం కష్టపడుతున్నారు. భారతదేశం జీడీపీ ప్రస్తుతం నాలుగు శాతంగా ఉంది. ఎనిమిది శాతం నుండి 4% కు దింపిన ఘనత మోడీకి దక్కుతుంది. భారతదేశ అభివ ద్ధి గత ఐదు సంవత్సరాల్లో ఇంత హీనంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ మరింత అధ్వాన్నంగా మారింది. ప్రస్తుతం భారతదేశం ఆర్థిక మాన్యం లో ఉండగా ప్రీపెయిడ్ ఎలక్ట్రికల్ మీటర్లు మార్చడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఎక్కడి నుంచి భరిస్తూదో తెలియని పరిస్థితి. రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఇవ్వాలో ఏ రోజు ఆలోచించని ప్రధానమంత్రి ృద్ధి కార్పొరేట్ కంపెనీలకు ఎలా దోచి పెట్టాలో అనునిత్యం ఆలోచించడం చాలా బాధాకరం. ఇప్పుడు భారతదేశంలో ఉప్పు నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అన్ని రంగాలలో రిలయన్స్ కంపెనీ తప్పితే వేరే ఇతర కంపెనీ మనుగడ సాధించలేకపోవడం ఆలోచించవలసిన విషయం. భారతదేశాన్ని పాలిస్తున్నది ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న పాలకుల, ప్రజల అవసరాలను డబ్బుగా మలుచుకునే కార్పొరేట్ కంపెనీల తెలియని పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో నెలకొని ఉంది. సంస్కరణ లు ఎవరికోసం: గత ఐదు సంవత్సరాల మోడీ పాలనలో జరిగిన డిమానిటైజేషన్, జీఎస్టీ, ట్రాయ్ నిబంధనల ప్రకారం కేబుల్ టీవీ కా వినాష్ వంటి సంస్కరణల వల్ల ఎక్కువగా నష్టపోయింది పేద ప్రజలే. కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, అనవసరమైన చానల్స్ ఇస్తున్నారని అందువలన పేదవాడి నష్టపోతున్నారని చెప్పిన ప్రధానమంత్రి కేబుల్ టీవీ వ్యవస్థను ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రజల్లోకి తీసుకు వచ్చి 250 రూపాయల నుండి 300 రూపాయలు వరకు చెల్లించి అన్ని కార్యక్రమాలను చూసేవారు. కానీ ఇప్పడు కనీసం 300 నుండి 500 రూపాయలకు చెల్లిస్తే కానీ కోరుకున్న ఛానల్ చూసే అవకాశం లేకుండా చేసిన ఘనత మోడీకే దక్కింది. ఈ విధానం వలన పేద ప్రజలకు ఏవిధంగా లబ్ది చేకూరుతుందో ప్రధానమంత్రి కె తెలియాలి. రిలయన్స్ భారతదేశం: ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో భారతదేశం పేరును కూడా రిలయన్స్ భారతదేశం గా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపారం కోసం భారతదేశం వచ్చిన ఆంగ్లేయులపై పోరాడిన భారతీయ ప్రజలకు మరొకసారి భారతదేశ కార్పొరేట్ కంపెనీల పై మరో స్వతంత్ర పోరాటం చేయవలసిన అవసరం వచ్చినందుకు భాధ పడుతూ కూర్చుంటారో, తీసుకొచ్చిన పాలకులకు వ్యతిరేకంగా పోరా డతారో ప్రజలు నిర్ణఇంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం సాధించామని ఆనంద పడడం కన్నా స్వాతంత్రం వచ్చిన తరువాత ఏం సాధించామని బాధపడటమే భారతీయ ప్రజలకు మిగిలింది. భారత దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడపకుండా నూతన సంస్కరణలు తీసుకుని వచ్చి హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్ అనే భేదాలను ప్రజల్లోకి ఎక్కువగా వ్యాప్తి చేస్తూ మత గొడవలు సృష్టిస్తూ దేశాన్ని అభివ ృద్ధి చెందకుండా దేశ అభివృద్ధి నిరోధకులు గా మారటమే కాకుండా దేశ ప్రజలను ఏమార్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజల దృష్టి పెట్టకుండా ఏదో ఒక వివాదం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతూ భారతీయ జనతా పార్టీ మరొక బ్రిటిష్ కంపెనీ వలె తయారైంది. జాతిపిత గాంధీని చంపిం న ఆర్.ఎస్.ఎస్. వారే ప్రస్తుతం భారత జాతిని చంపడానికి ప్రయత్నిస్తున్న ఆర్.ఎస్.ఎస్. భావజాలంతో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ.
-మహమ్మద్ అఫ్టల్, సీనియర్ జర్నలిస్ట్