పట్టణంలో అదొక పేరున్న ఫంక్షన్ హాలు. పెళ్లయిపోయి అతిథులంతా తిరుగుముఖం పడుతున్నారు. అప్పుడే ఆ హాలు ముందుకు ఆటో వచ్చి ఆగింది. అందులోనుంచి డ్రైవర్తోపాటు ఓ మహిళ హడావుడిగా దిగింది. హాలు నిర్వాహకులు, శుభకార్యం జరుపుతున్న పెద్దలతో మాట్లాడి అక్కడ మిగిలిపోయిన ఆహారపదార్ధాలను తాను ఆర్డీవోగా తీసుకువచ్చిన గిన్నెల్లోకి మార్చింది. వాటన్నింటిని ఆటోలో సర్దుకుని నేరుగా ఆ ఊళ్లోని మురికివాడలోకి తీసుకువెళ్లింది. తాను తెచ్చిన పదార్థాలను అక్కడి వారికి పంచింది. ఆమే తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వింధ్యారాణి. అంగన్‌వాడీ టీచర్ గా పిల్లలకు చదువు చెబుతూ, పేదలకు అన్నదానం చేస్తున్న ఆమెకి ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే... మాది సిరిసిల. అంగన్‌వాడీ టీచర్ ని. మొదటో చెల్ తల్లిదండ్రుల్ని లేబర్ స్కూల్లో టీచరుగా చేసేదాన్ని. అప్పట్లో ఇంటింటికి వెళ్లి పిల్లల్ని బడికి పంపమంటూ తల్లిదండ్రుల్ని అడిగేవాళ్లం. అప్పుడే నాకు అనిపించింది పేద పిల్లలకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని. . కానీ అప్పుడు నా జీతం అంతంత మాత్రమే. నా ఒక్కదానివల్ల కాకపోతే ఒక బృందంగా ఏర్పడి పేదలకు సాయం అందించొచ్చని అనిపించింది. అలా పదిమంది ృథాగా మహిళలతో కలిసి 2004లో ధరణి అనే స్వచ్చంద సంస్థను స్థాపించా. ఇది ప్రారంభించిన కొత్తలో పదోతరగతి ఫెయిలైన విద్యార్థులకు నేనే సొంతంగా ఫీజులు కట్టి ట్యూషన్‌కు పంపించేదాన్ని. వారి తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించి చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేవాళ్లం. అలా చాలామంది పిల్లలు పాసయ్యారు. పాతదుస్తులతో ప్రారంభం... మొదట సిరిసిల్ల గాంధీచౌక్ లో ఒక పెద్ద డబ్బాను ఏర్పాటు చేశాం. 'మీ పిల్లలకు సరిపోని దుస్తులను ఈ డబ్బాలో వేయండి. పేద పిల్లలకు అందిస్తాం' అని బోర్డు పెట్టాం. మంచి స్పందన వచ్చింది. కొంతమంది కొత్త దుస్తులు కూడా వేశారు. వాటిని మురికివాడల్లో నిరుపేదలకు పంచాం. 300 మంది పిల్లలకు డ్రెస్లు, 120 300 మంది పిల్లలకు డ్రెస్లు, 120 , మంది మహిళలకు చీరలు అందించాం. రైస్ బకెట్ పేరుతో తలా గుప్పెడు చొప్పున బియ్యం సేకరించాం. అలా నాలుగైదు క్వింటాళ్ల బియ్యం పోగు చేసి పది - కిలోల చొప్పున 50 పేద కుటుంబాలకు అందించాం. పదార్థాలు మిగిలితే... ఓసారి ఓ ఫంక్షన్ కి వెళ్లా. అక్కడి సిబ్బంది మిగిలిపోయిన పదార్థాలన్నింటిని చెత్తకుండీలో పారబోస్తున్నారు. ఎవరికైనా దానం చేయొచ్చు కదా అని అంటే... 'మాకు అంత ఓపిక, సమయం లేదు. ఇంత కంటే ఎక్కువ పరిమాణంలో మరిన్ని వంటకాలను పారబోస్తుంటాం. మేం ఏం చేయలేం' అనే జవాబు వచ్చింది. ఆ రోజంతా ఆ సంఘటనే నా కళ్ల ముందు మెదిలింది. నేనే ఎందుకు ఆ ఆహార పదార్థాలను పేదలకు పంచకూడదు అనే ఆలోచన వచ్చింది. వెంటనే మా వారికి ఈ విషయం చెప్పా. మంచి ఆలోచన అని వెన్ను తట్టారు. సిరిసిల్ల ఆర్డీవోగా పనిచేసిన భిక్షునాయకన్ను కూడా కలిసి నా ఆలోచన చెప్పా. సాధ్యం కాదని అన్నారు. అయినా ఒప్పించా. ఆహార పదార్థాల కోసం సొంతంగా గిన్నెలు కొన్నా. ఎక్కడికైనా వెళ్లేందుకు ఆటో ఖర్చులు నేనే పెట్టుకుంటా. అలా ఆహారాన్ని సేకరించి మురికి వాడల్లో ఉండేవారికి పంచడం నా లక్ష్యంగా మారింది. ఇబ్బంది పడ్డా... నేనిలా చేస్తున్న కొత్తలో తెలిసినవారు 'ఎందుకీ తలనొప్పి. ఇలా భోజనం వాళ్ల దగ్గరకు తీసుకెళ్లి పెట్టడం వల్ల మరింత సోమరిపోతుల్లా మారతారు...' అని అన్నారు. నేను వారికి ప్రత్యేకంగా వండి పెట్టడం లేదు. వ ృథాగా పారేసే ఆహారాన్నే అందిస్తున్నా. దీనివల్ల వారి కడుపు నిండుతుంది. నాకూ సంతృప్తి లభిస్తుంది. కాబట్టి నేనెవరి మాట వినని చెప్పా. క్రమంగా చెప్పడం మానేసారు. పట్టణంలోని అన్ని ఫంక్షన్ హాళ్ల యజమానుల దగ్గర నా ఫోన్ నంబరు ఉంటుంది. ఇప్పుడు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ఆహారాన్ని సేకరిస్తున్నా. ఇప్పటి వరకు 60 వేల మందికి కడుపు నింపగలిగా. నా జీతంలో సగభాగం సేవకే ఉపయోగిస్తా. మేం చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్ర మంత్రి కేటీఆర్, కలెక్టర్ క ృష్ణభాస్కర్ చేతుల మీదుగా రూ.51 వేల నగదు పురస్కారం అందుకున్నా. లయన్స్ క్లబ్ వారు ముప్పయి వేల రూపాయలు ఇచ్చారు. ఈ డబ్బుతో భోజనాన్ని తీసుకెళ్లేందుకు ఓ ట్రాలీ కొన్నా. ఇక పైనా వీలైనంతమందికి సేవ చేయడమే మా పని. అయితే వీటన్నింటి వెనుకా మా వారు, పిల్లల సహకారం ఎంతో ఉంది. ఆయన ఆయన ప్రయివేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అయితే ఇకపై వీలైనంత ఎక్కువమందికి సాయం చేయడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం.
అన్నం తెచ్చి... ఆకలి తీర్చి