రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నదెవరు..?

కపారితాన్ని కాజేసున దెవరు..? రైతులు ఆరుగాలం కష్టించి పండించిన చెల్లించినది ధాన్యం కొనుగోలులో గోల్ మాల్ చేసింది చేస్తున్నదెవరు..? అప్పనంగా, గా సరీచప్పుడు కాకుండా జుర్రున నంజుకు తింటున్నదెవరు..? పర్యవేక్షణ చేయాల్సిన గుర్తించాలిసివిల్ సప్లైశాఖ ఎం చేస్తుంది. అంతా సివిల్ లోగుట్టుగా లోగుట్టుగా సపెశాల కనుసనలోనే జరుగుతుందా...? అనే సందేహలకు బలాన్నిచ్చే విధంగా ఓరుగల్లులో రైతుల కష్టార్జితాన్ని కాజేశారని స్వయంగా రైతులే గొగోలు పెడుతున్న పరిస్థితులున్నాయి. " 189 బస్తాలు తూకం వేయగా 150 బస్తాల ధాన్యం డబ్బులు మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి ఇది ఓ రైతు ఆవేదన. 127 బస్తాలు తూకం అనే వేయగా 121 బస్తాల ధాన్యం డబ్బులే బ్యాంక్ లో జమ అయ్యాయి ఇది మరో రైతు ఆందోళన. 171 బస్తాలకు గాను 163 బస్తాలకే డబ్బలు జమ అయ్యాయి ఇది ఇంకో రైతు వేదన”.ఇలా ఓరుగల్లు రూరల్ జిల్లా వర్ధన్నపేటలోని నల్లబెల్లి గ్రామ రైతులు బోరుమంటూ కలెక్టర్ కార్యాలయంలో తమ గోటు వెళ్ళబోసుకున్న ఘటన సివిల్ సప్లైశాఖ తీరును, రైతుల కష్టార్జితాన్ని కాజేస్తున్నరనటాన్ని బలపరుస్తుంది. ఇది కేవలం ఒక గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకున్న ఉదాంతం లాగే చూస్తే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఒకే కొనుగోలు కేంద్రంలోనే ఇలా ఉంటే జిల్లా వ్యాప్తంగా ఇంకేలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 113 కొనుగోలు కేంద్రాలలో 2019-2020 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన కొనుగోల్లను, రైతులకు చెల్లించిన చెల్లింపులను, వరంగల్ రూరల్ జిల్లా సివిల్ సప్లైశాఖ తీరును, ఉద్యోగుల తో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వహణ పట్ల సమగ్రమైన విచారణ జరిపితే అసలు లోగుట్టు తేటతెల్లం అవుతుంది. దీంతోపాటు వరంగల్ రూరల్ జిల్లా “సివిల్ సప్లైశాఖ”లో అసలేం జరుగుతుందనేది కూడా అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. 2019-2020 ఖరీఫ్ సీజన్ లో “సివిల్ సప్లై”పర్యవేక్షణలో ఐకేపీ కేంద్రాల నుంచి రైతుల వద్ద కొనుగోలు చేసిన దాన్యానికి చెల్లింపుల అంశంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పరిధిలోని ఈ 113 సెంటర్లలో కొనుగోలు కను మూడు వందల మంది ప్రజలు అనుకుని అందుకు చేసిన మొత్తం దాన్యం ఎంత..? ఆ దాన్యం విలువ ఎంత..? రైతులకు చెల్లించినది ఎంత..? ఏ రూపంలో చెల్లించారనే అంశాలు ప్రశ్నార్థకంగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019-2020 ఖరీఫ్ కొనుగోల్లు, రైతులకు చెల్లించిన వివరాలపై సమగ్రవిచారణ చేపట్టాల్సిన అవసర వివరాలపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని గుర్తించాలి. ప్రభుత్వ శాఖ అయినటువంటి సివిల్ సప్లైశాఖ పని తీరు లోగుట్టుగా లోగుట్టుగా మారటం వెనుక దాగున్న రహస్యం ఏమిటనేది మారటం వెనుక దాగున్న రప పరిశీలించాల్సిన అనివార్యత ఉంది. అయితే రైతుల నుచి కొనుగోలు చేసిన దాన్యానికి చెల్లింపులు ఏ విధంగా జరిగాయి..? నేరుగా రైతులకే చేరాయా..? అసలైన రైతులకే అందాయా..? చెల్లింపుల మొత్తం ఎంత..? ఇందులో కార్యాలయం అధికారుల పాత్ర ఏమిటీ..? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఏమిటి..? అసలు కార్యాలయంలో ఏం జరుగుతోంది అనే అంశాలను సమగ్రమైన విచారణ చేస్తే అసలు గుట్టు తేటతెల్లం అవుతుందని ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గమనించాల్సిన ఎ . అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు రైతులు, రైతు సంఘాలు మేల్కోవాలి. నిబంధనల ప్రకారమే కొనుగోలు కేంద్రాల నిర్వహణ జరుగుతుందా, కొనుగోలు కేంద్రాలలో చేపట్టాల్సిన చర్యలేమిటి..? రైతుల నుంచి కొనుగోలు చేసిన దాన్యానికి చెల్లింపులు ఏ పద్దతిలో జరుగాలి..?. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో పాటించిన నిబంధనలు ఏమిటి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేస్తే లోగుట్టు బహిర్గతం అవుతుందని గుర్తించాల్సిన అవసరం ఉంది.


నమిండ్ల ప్రమోద్ జర్నలిస్ట్ - వరంగల్ సెల్ : 63056 38569