అత్యాచారాల భారత్

సంపాదకీయం శనివారం 29 ఫిబ్రవరి, 2020 మన భారతానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. మన ప్రధాని మోదీ ప్రభ విశ్వాంతరాళాల్లో వెలిగిపోతోంది. చిన్నారులపై అత్యాచారాల్లో మనమే ఘనమని అంతర్జాతీయ సమాజం వేనోళ్ల పొగుడుతుంటే, మోదీ, ఆయన భజనపరులకు శ్రవణానందకరంగా ఉంది. కథువా, ఉన్నావొ ఘటనలపై అంతరాతీయ సమాజం ఇప్పుడు రోడపెకెకి, దేశ పరిసితులపై నానాయాగీ చేస్తుంటే, అంతర్జాతీయ మీడియాలో మన భారతం గురించి ఘనంగా చెప్పుకుంటుంటే, మనకు చీము నెత్తురు ఏ మూలనుందో వెతుక్కోవాలి. ఇప్పుడు విశ్వయవనికపై కథువా, ఉన్నావో ఘటనలపై విదేశీయులు చరిత్ర పాఠాల్లాగా చెప్పుకొని మురిసిపోతున్నారు. మోదీ పాలన వైభవాన్ని తలుచుకొని మైమర్చిపోతున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా మోదీ పాలనలో జరిగిన కథువా, ఉన్నావో దురంతాలను దునుమాడుతూ ఇలాంటి జరగకూడదని మెత్తగా మొత్తింది. మొన్నటి మొన్న యుపిఏ హయాంలో నిర్భయ ఘటనకు చలించినట్లు నటించిన మోదీ పరివార్‌లోని ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు గాజులు పార్సిల్ చేసి పంపారు. ఇప్పుడు అవే దాష్టీకానికి గాజుల్ని మోదీకి ఎందుకు పంపడం లేదన్న ప్రశ్న పౌర సమాజం నుంచి ఉత్పన్నమవుతోంది. దీనికి స్మతిఇరానీ నుండి స్పందన లేదు. దారుణంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు, దళిత మైనార్టీలపై దాడులు పెరిగిపోయా యని విపక్షాలు మొర ఎత్తి అరుస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి ఈసుమంతైనా కదలిక లేదు. యోగీశ్వరుడి పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో మైనార్టీ, దళిత వర్గాలపై అత్యా చారాల ఘటనలు మీడియాదాకా రావు.. ఒకటి అరా తప్ప. కనీసం రోజుకు ఒక అత్యాచారం ఘటన యుపిలో తప్పవని అక్కడి సమాజం ఘోషిస్తోంది. సాక్షాత్తూ అదే సర్కారులోని ఓ ఎమ్మెల్యే 18 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడితే, ప్రభు త్వం అతనికి మద్దతుగా 2020 నిల్చొంది. అదీ మోదీ అరాచక పాలనలో జరుగుతున్న దాష్టీకాలు. ప్రపంచ దేశాలకు భారతదేశం నమూనాగా ఇన్నాళ్లు చెప్పుకున్నాం. ఇక మీదట మనమే అత్యాచారాలకు, దాష్టీకాలకు కూడా భారతదేశం నమూనాగా మారుతుందా మోదీజీ స్పష్టం చేయాల్సి ఉంది. డిప్యూటీ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేకానేక ఘటనల వెనుక మోదీ ప్రోద్బలం నానాయాగీ ఉందన్న భావన ఆయన్ను,ఆయన పార్టీని నమ్ముకున్న కాషాయ దళంలో జీర్ణించుకు పోయింది. అందుకే దళిత మైనార్టీలపై యథేచ్చగా దాడులు జరుగుతున్నాయి. రాజస్థాన్, యుపి,మధ్యప్రదేశ్ లో మైనార్టీ, దళిత వర్గాల గద్దెనెక్కడుపరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇటీవల ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీపై సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త బంద్ కు దళిత ప్రజా సంఘాలు పిలుపునిస్తే కాషాయనీడలో ఉన్న వ్యాపార వర్గాలు ఒక్కటై దళిత బహుజనులపై దాష్టీకానికి దిగారు. చనిపోయిన వారంతా పోలీసు కాల్పుల్లో కాదని, వ్యాపారుల దాడుల్లోనని పోలీసు అధికారులే చెబుతున్నా రంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. రాజస్థాన్ రాష్ట్రంలో ఐదువేల దళితుల ఇళ్లను గుర్తు పెట్టుకొని మరీ తగులబెట్టి, కాషాయాన్ని కప్పుకున్న వ్యాపార వర్గాలు కసి తీర్చుకున్నాయి. ఇంత జరిగినా మోదీ సర్కార్ కానీ, స్థానిక ప్రభుత్వం వ్యాపార వర్గాలకే వత్తాసు పలుకుతోంది. ఇప్పుడు దళిత, మైనార్టీ వర్గాలు తమకు వ్యతిరేకం అవుతున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటిపై ఆర్డినెన్స్ జారీ చేయబూనడం, కథువా ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వంటివి ఎన్నికల స్టంటేనని చెప్పొచ్చు. పక్క రాష్ట్రంలో నాలుగైదు రోజుల్లో బీజేపీ సర్వం జాతకాన్ని చెప్పడానికి కన్నడిగులు సిద్ధంగా ఉన్నారు. ఓటనే పాశుపతాస్త్రాన్ని చేతబట్టుకొని బీజేపీకి వ్యతిరేక ఓటును వేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రఖ్యాత జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య వెనుక ఎవరున్నారో, నోట్ల రద్దు,జీఎస్టీ భారంతో పడ్డ ఇక్కట్లు ప్రజలకు గుర్తున్నాయి. అవినీతి పరులు, గనులను మింగిన ఘనులను సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎప్పుడు ప్రకటించుకుందో అప్పుడే ఆ పార్టీ పతనం ప్రారంభమైంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి సరైన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏమైనా అద్భుతం జరిగితే తప్ప, బీజేపీ అక్కడ గెలిచే ఛాన్సే లేదు. మోదీగారి నిర్వాకం వల్ల దేశ మంతటా ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నూటా పాతికేళ్ల కాంగ్రెస్లో నిస్తేజం,నాయకత్వ లోపం కారణంగా ముందుకు వెళ్లలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ హయాంలో జరుగుతున్న దాష్టీకాలను ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లగలిగితే, మోదీ ఇక గద్దెనెక్కడు. ప్రతిపక్షాలన్నీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాయి. కథువా,ఉన్నావో ఘటనలపై కాంగ్రెస్ తో పాటు మిగిలిన పక్షాలు పెద్దగా గొడవ చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని రగిల్చ గలిగితే కాస్తంత ఫలం,ఫలితం దక్కేది. అరాకొరా కార్యక్రమాలతో రాహూల్ గాంధీ ముందుకెళ్లడం వల్ల, ఎన్డీఏను ఏమీ చేయలేకపోతున్నారన్నది వాస్తవం. ఇలాంటి మోదీని ఇంకా ఎన్నాళ్లు భారతావనిలో సహిస్తాం . మోదీ ఇంకా ఏడాది పాలనలో ఎన్ని దారుణాలు చోటు చేసుకుంటాయో ఊహించుకుంటుంటేనే వళ్లు జలదరిస్తుంది. నెత్తురు కుతకుత ఉడికిపోతుంది. మంచి పాలనాధక్షుడని గద్దెనెక్కించిన పాపానికి మనల్ని మనం నిందించుకోవాల్సిందే.