నలు, విధానాలను అది తలపిస్తోంది. వలసవాద యుగంలో చలాయిస్తోం చినా పెట్టుబడులు అవుతోంది. ఆ దేశాల్లో ప్రత్యేక ఇటీవల హిందూ మహాసముద్రంలో పెరిగిన చైనా నౌకల సంచారం ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు భంగకరంగా తయారైంది. 19, 20వ శతాబ్దాల్లో ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలతో పాశ్చాత్య వలసవాద రాజ్యా లు ఏ విధంగా ప్రవర్తించేవో, నేడు అనేక వర్గమాన దేశాలతో చైనా అలానే వ్యవహరిస్తోంది. రెండున్నర శతాబ్దాల క్రితం భారత్ పట్ల ఈస్టిండియా కంపెనీ అనుసరించిన వ్యూహాలు, విధానాలను అది తలపిస్తోంది. వలసవాద యుగంలో మాదిరిగా పలు ఆఫ్రికా, ఆసియా దేశాలు నేడు చైనాకు వ్యవసాయ, పాడి ఉత్పత్తులను, కలప, ఖనిజాలు, చమురు వంటి ముడిసరకులను ఎగుమతి చేస్తూ అక్కడి నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొంటున్నాయి. చైనా ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించడం పరిపాటైంది. బీజింగ్ తో వ్యాపారం చేసే ప్రతి దేశమూ రుణ ఊబిలో కూరుకుపోతోంది. దాన్ని అలుసుగా తీసుకొని చైనా సదరు దేశ రాజకీయ వ్యవస్థపై పెత్తనం చలాయిస్తోంది. దీనికి తాజా దృష్టాంతం మాల్దీవుల్లో సంభవిస్తున్న సంక్షోభమే. చైనా పెట్టుబడులు, ప్రాబల్యం విస్తరించిన ప్రతి దేశంలో చైనీయుల హడావుడి ఎక్కువ అవుతోంది. చైనా నుంచి పెట్టుబడులతోపాటు కార్మికులు, నిపుణులు వచ్చి ఆయా దేశాల్లో ప్రత్యేక వాడలు ఏర్పరుచుకొంటున్నారు. శ్రీలంక, పాకిస్థాన్, సూడాన్‌తోపాటు అనేక ఇతర ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇవి కనిపిస్తాయి. పాకిస్థాన్లోని గ్వాదర్ రేవును చైనా సైనిక, నౌకా స్థావరంగా ఉపయోగించుకోనుంది. పాక్, మాల్దీవుల్లో చైనా సైనిక నిపుణుల సందడి ఎక్కువైంది. ఆర్థిక దిగ్బంధం దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవుల నిర్మాణాన్ని పూర్తిచేసి పరిసర దేశాలను, అంతర్జాతీయ సమాజాన్ని బీజింగ్ నిర్ఘాంతపరచింది. చిరకాలంగా వివాదగ్రస్తమైన ప్రాంతాల్లో ఈ దీవులను నిర్మించడం వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, థాయ్ లాండ్, బ్రూనై దేశాలకు కలవరం కలిగించాయి. చైనా దురాక్రమణ అజెండాను అడ్డుకోవడానికి అమెరికా, జపాన్ వంటి దేశాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని అవి ఆశిస్తున్నాయి. కానీ, అమెరికా పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా దూకుడుపై కఠిన పంథా అనుసరించలేదు. దక్షిణ చైనా సముద్రంలోని దీవులు, దిబ్బలు అంతర్జాతీయ జలాల్లో ఉన్నాయి కాబట్టి అవి ఏ ఒక్క దేశం సొత్తు కావని అమెరికా ఉద్ఘాటించింది. చైనా ఇక్కడ ఇష్టారాజ్యంగా ప్రవర్తించకూడదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో అన్ని దేశాల నౌకలు స్వేచ్చగా సంచరించవచ్చని, దీనికి చైనా అనుమతి తీసుకోనవసరం లేదని పేర్కొంటూ ఒక అమెరికన్ యుద్ధనౌకను అత్యంత వివాదగ్రస్త పారిసెల్ దీవుల సమీపంలోకి పంపారు. దక్షిణ చైనా సముద్రం అంతర్జాతీయ పరిధిలో ఉందంటూ గా స్థానిక ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలను తన గుపిలో శ్రీలంకలోనే హంకోవడం ద్వారా చేస్తాగుతుంది. చైనా నిర్మిస్తున్న రేవు, ఐక్యరాజ్య సమితి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి చైనా కృత్రిమ దీవుల నిర్మాణాన్ని పూర్తి చేసింది. వర్ధమాన దేశాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి చైనా వినూత్న వ్యూహం అనుసరిస్తోంది. మొదట ఆ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణానికి చాలా తక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. క్రమంగా స్థానిక ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలను తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. సంబంధిత దేశం తీసుకున్న ృద్ధికి రుణాలను తిరిగి తీర్చలేకపోతే, ఆయా రంగాలకు తానిచ్చిన రుణాలను ఈక్విటీ వాటాలుగా మార్చాలని పట్టుబడుతుంది. ఈక్విటీ వాటా చైనా చేతికి వెళ్లగానే సంబంధిత మౌలిక వసతుల ప్రాజెక్టుకు తానే సొంతదారుగా మారుతుంది. ఉదాహరణకు ఏదైనా దేశంలోని రేవులో ఈక్వట్ పొందితే, ఇక అక్కడికి చై ఈక్విటీ పొందితే, ఇక అక్కడికి చైనా నౌకలు ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగించవచ్చు. పాకిస్థాన్, మాల్దీవులు, కాంబోడియా, శ్రీలంకల్లో చైనా అనుసరించిన వ్యూహమిదే. ఇటీవల సంక్షుభిత గ్రీస్ దేశంలో పైరేయస్ రేవును 42 కోట్ల డాలర్లకు చైనా కొనుగోలు చేయడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరచింది. సెషెల్స్, జిబూటీ, గ్వాదర్ రేవుల్లో వ్యాపార కారణాలపై పెట్టుబడి పెట్టానన్న చైనా, క్రమంగా ఆ రవులను సైనికి ప్రయోజనాలకు శ్రీలంకలోనే హంబా తోట రేవు, మట్టల విమానాశ్రయాలను తన అదుపులోకి తీసుకోవడం ద్వారా చైనా హిందూ మహాసముద్రంలో సైనికపరమైన ఆధిక్యం చలాయించగలుగుతుంది. చైనా నిర్మిస్తున్న ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ (ఒబోర్) లేదా సముద్ర సిల్క్ మార్గం ప్రాజెక్టుకు ఈ రేవు, విమానాశ్రయం ఇరుసులుగా ఉపకరిస్తాయి. ఈ విధంగా చైనా గుప్పిట్లో ఇరుక్కున్న శ్రీలంక రేవు దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆగడాలను, తైవానను కలుపుకోవాలనే దుష్ట పన్నాగాన్నీ సమర్థించాల్సి రావచ్చు. మరోవైపు చైనా తన పెట్టుబడుల వల్ల శ్రీలంక వంటి భాగస్వామ్య దేశాలకు ఎనలేని మేలు జరిగిందని వాదిస్తోంది. వాస్తవమేమంటే చైనాకు సహజ వనరులను తరలించుకుపోవడానికి మాత్రమే ఈ పెట్టుబడులు, పైపులైన్లు, రేవులు ఉపయోగపడుతున్నాయి. ఇతర దేశాల్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఆయా దేశాల పాత్ర నామమాత్రమే. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువగా చైనా కార్మికులు, నిపుణులను నియమిస్తున్నందువల్ల స్థానికులకు లభిస్తున్న ఉద్యోగాలు అంతంతమాత్రమే. ఒబోర్ కింద చేపట్టిన పనుల్లో 89 శాతం కాంట్రాక్టులు చైనా కంపెనీలకే దత్తమయ్యాయని అమెరికా అంచనా. మరోవైపు భాగస్వామ్య దేశాలను చైనా చౌక ఉత్పత్తులు ముంచెత్తడంతో ఆ దేశాల్లో పారిశ్రామికీకరణ ఏ మాత్రం ఊపందుకోవడం లేదు. తమనిధులు ఉభయులకూ విజయం చేకూరుస్తున్నాయని చైనా చెప్పుకొంటున్నా వాస్తవంలో చైనాకే జంట విజయాలు సిద్ధిస్తున్నాయి. భాగస్వామ్య దేశాలతో ఏర్పడే వాణిజ్యపరమైన వివాదాలను పరిష్కరించుకోవడానికి బీజింగ్, తదితర చైనా నగరాల్లో సహాయం అందించింది. ఈ నిధులో అంట్ల వ విమానాలు, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పరచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే భాగస్వాముల జుట్టంతా చైనా చేతిలో ఉంటుందన్నమాట. శ్రీలంకకు 1971-2012 మధ్యకాలంలో చైనా మొత్తం 500 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఈ నిధుల్లో అధిక భాగం మౌలిక వసతుల సృష్టికి వెచ్చించారు. ఉదాహరణకు హంబా తోట రేవు అభివ ృద్ధికి 100 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. మిగతా మొత్తాన్ని మట్టల విమానాశ్రయం, ఒక కొత్త రైల్వే మార్గం, కొలంబో రేవు నగర ప్రాజెక్టుల నిర్మాణంపై వ్యయీకరించారు. శ్రీలంక మొత్తం జాతీయ రుణభారం 6,490 కోట్ల డాలర్లు. అందులో 800 కోట్ల డాలర్లు ఒక్క చైనాకే బాకీ పడింది. చైనా రుణాలపై అధిక వడ్డీ వసూలు చేయడం శ్రీలంకకు పెను భారమవుతోంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లు 0.25 నుంచి మూడు శాతం వడ్డీకి రుణాలిస్తుంటే, చైనా 6.3 శాతంపై శ్రీలంకకు 30.1 కోట్ల డాలర్ల అప్పు ఇచ్చింది. శ్రీలంక అభివృద్ధి రేటు ఈమధ్య మందగించడంతో చైనాకు సక్రమంగా బాకీలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. దాంట్లో నుంచి బయటపడటానికి మౌలిక వసతుల ప్రాజెక్టులకు చైనా ఇచ్చిన రుణాలను అదే ప్రాజెక్టుల్లో ఈక్విటీ వాటాలుగా మారుస్తానని కొలంబో ప్రతిపాదించింది. ఆ ప్రకారమే హంబా తోట రేవులో చైనా సంస్థలకు 80 శాతం వాటాలిచ్చి, 99 ఏళ్లకు లీజు ఇచ్చింది. దీనిపై శ్రీలంకలో ఉవ్వెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అలాగే మట్టల విమానాశ్రయ నిర్మాణానికి చైనా 30-40 కోట్ల డాలర్ల రుణమిచ్చి ఉండటంతో, ఇప్పుడు దాన్ని చైనా సంస్థలే నిర్వహిస్తున్నాయి. విమానాశ్రయ నిర్వహణకు ఏటా 10-20 కోట్ల డాలర్లు వెచ్చించే స్తోమత శ్రీలంకకు లేకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. అగ్రదేశ సదా కోసం... - ప్రపంచ నాయకపాత్ర నుంచి అమెరికా, బ్రిటన్లు తమంతటతాము వైదొలగుతున్నందువల్ల ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చైనా ఉవ్విళ్లూరుతోంది. ఒబోర్ ప్రాజెక్టు చైనా ప్రపంచాధిపత్య కలను నెరవేర్చే సాధనమవుతుందని అనుమానాలున్నాయి. ఏదిఏమైనా ఒబోర్ వల్ల చైనాకు లాభాలున్నట్లే నష్టభయాలూ ఉన్నాయి. ఇప్పటికే ఈ బృహత్తర ప్రాజెక్టులో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టిన చైనా, రాగల పదేళ్లలో మరెన్నో వేలకోట్ల డాలర్లు ధారపోయనుంది. చైనా నిధులు అందుకున్న మధ్యాసియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు తరచూ ఆర్థిక, రాజకీయ అస్థిరతకు లోనవుతూ ఉంటాయి. చైనా పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు ఏదైనా విఫలమైతే పరిస్థితి ఏమిటి? వెనెజులా, శ్రీలంక, మియన్మార్ దేశాల్లో చైనా ప్రాజెక్టులేవీ స్థానిక అభివృద్ధికి దోహదం చేయలేదు.
-సూరజ్ షేక్