(నిన్నటిసంచిక తరువాయి) సీనియర్ న్యాయవాది పి.ఎన్.దుదా ఈ వాఖ్యలని కోర్ట్ ధిక్కారంగా కేసు ఫైల్ చేసిండు. తర్వాత సుప్రీం కోర్ట్ ఈ కేసు నుండి శివశంకర్ ని విముక్తుడిని చేసింది. ఎస్పీ గుప్తా కేసు తరువాత న్యాయమూర్తుల బదిలీ ప్రక్రియ పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాని ప్రకారం ప్రతి హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వేరే రాష్ట్రాని కి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే 1/3 మంది న్యాయమూర్తులు వేరే రాష్ట్రాల హైకోర్ట్ లకు చెందిన వారై ఉండాలి. కొంత కాలం ఇది పూర్తి స్థాయిలో అమలు జరిగింది. కానీ ఆ తర్వాత ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. శివశంకర్ న్యాయ వ్యవస్థలో చేసిన మరో గొప్ప సంస్కరణ డబ్బు లేని పేదవారికి న్యాయాన్ని , చట్టాన్ని చేరువ చేసేందుకు దేశమంతటా " ఫ్రీ లీగల్ ఏయిడ్ " - ఉచిత న్యా య సలహా కేంద్రాలని ప్రారంభించిండు.దీ నేత, న్యాయవాది సలావుద్దీన్ ఓవైసీ మాటల్లో " పుంజాల శివశంకర్ తర్వాత భారత న్యాయవ్యవస్థలో సంస్కరణలు ఆగిపోయినవి " . ఇంధన, వాణిజ్య ,విదేశీ వ్యవహారాల ,మానవ వనరుల శాఖల మంత్రిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా: శివశంకర్ తన జీవితంలో ఎపుడు కేబినేట్ లోని సింగిల్ శాఖకి మంత్రి గా లేడు. ఎపుడు మూడు నాలుగు శాఖలు నిర్వహించేవాడు. 1982 లో ఇంధన శాఖనీ కూడా సమర్థవంతంగా నిర్వహించిండు . ఇంధన శాఖను నిర్వహించిన సమయంలో, రాజకీయ జోక్యం లేకుండా, పెట్రోలు బంకులు, గ్యాస్ ఏజెన్సీల కేటాయింపులను క్రమబద్దీకరించారు. మానవ వనరుల శాఖ మంత్రిగా కేంద్రీయ విద్యాలయాల విస్తరణకు కృషి చేశా రు. ఇందిరాగాంధి మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన శివశంకర్ మెదక్ ( అప్పటి వరకు ఇందిరాగాంధి ప్రాతినిధ్యం వహించిన స్థానం ) నుండి 1984 డిసెంబర్ లో లోక్ సభకి పోటీ చేసి స్వల్ప తేడా 700 ఓట్లతో ఓడిపోయిండు. కానీ అదే అతని పాతస్థానమైన సికింద్రాబాద్ నుండి అంజయ్య ఎంపీగా గెలిచిండు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత శివశంకర్ తన పెద్ద కుమారుడు వినయ్ తో కలిసి పంజాబ్ కి వెళ్లి అమృత్సర్ లో తాను చెప్పులు కుడుతూ, షూ పాలిష్ చేస్తూ ఆశ్రయం తీసుకుంటూ చదివిన రైల్వే స్టేషన్లోని ఆ ప్రదేశం లో ఒక అర్ధగంట సేపు మౌనంగా కూర్చోని తన అన్నని, చదువుకున్న రోజులని గుర్తుకు తెచ్చుకున్నడు. 545 సభ్యులకి 400 పైన లోకసభ సభ్యులని గెల్చుకున్న కాంగ్రేస్ పార్టీ ప్రధాని రాజీవ్ గాంధీకి డిల్లీలో శివ శంకర్ లేని లోపం స్పష్టంగా కనిపించింది. అతను ఎం.పీగా లేనపుడు కూడా రాజీవ్ గాంధీ నివాసం ఐన రేస్ కోర్స్ రోడ్ ఇందిరాగాంధీ ఉన్నప్పటి సఫర్ జంగ్ రోడ్ - 1కి పక్కనే కేటాయించిన బంగళాని అలాగే ఎవరికి కేటాయించకుండా ఉంచిండ్రు. 1985 ఏప్రిల్ లో గుజరాత్ లో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి సోలంకి ప్రపోజ్ చేసిన మాజీ హెూంమంత్రి ప్రపోద్ రావల్ ని నిరాకరిస్తూ రాజీవ్ గాంధీ గుజరాత్ నుండి రాజ్యసభకి శివశంకర్ ని తీసుకున్నడు. శివశంకర్ అప్పటి వరకు పరిపాలనలో పెద్దగా అనుభవం లేని రాజీవ్ గాంధీ తరపున అన్ని సమస్యలను మీదేసుకున్నడు. మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలలో రాజకీయ మార్పులని పర్యవేక్షించిండు. సంత్ లోంగోవాలో పంజాబ్ ఒప్పందాన్ని వ్యతిరేకించిన " రాజకీయ వ్యవహారాల కేబినేట్ కమిటి” తో చర్చలు జరిపి పరిష్కరించిండు. హర్యానా ముఖ్యమంత్రి భజలాల్ పై ప్రతిపక్షా లు ఇచ్చిన మెమోరాండమ్ మేరకు దానిపై దర్యాప్తు చేసేందుకు ఏకవ్యక్తి వ్యవహారాల ,మానవ వనరుల శాఖల మంత్రిగా మ కమీషన్న వేసుటకు నిర్ణయించే ముందు తాను ప్రాథమిక విచారణ చేసిండు. అతని పని విధానం కేవలం దేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగు పర్చడానికి కీలక పాత్ర పోషించిండు. నేపాల్ రాజధాని ఖాట్మాంలో 1985 జూన్ నెలాఖరున జరిగిన బాంబు పేలుళ్ళ తరువాత అతను నేపాల్ ని సంద ర్శించి నేపాల్ ప్రధానితో మాట్లాడిండు. జులైలో శివ శంకర్ కి అంతర్జాతీయ మీడియాలో గుర్తింపు తెచ్చిన బంగ్లాదేశ్ తో గంగా నదీ తనే జలాల ఒప్పందం గురించి ఆ దేశాన్ని సందర్శించిండు. పంజాబ్ లో అల్ల ర్ల తర్వాత అకాలీలు తాము సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువ విషయా దళితుల లపై ఒప్పించిండు. ఇదంతా కేవలం శివశంకర్ పని విధానంపై మూడు నెలల కేస్ స్టడీ . 1985 నుండి 1993 వరకు గుజరాత్ నుండి రాజ్యస భకి ఎన్నికై కేంద్ర వాణిజ్య శాఖామంత్రిగా 1985 లో , 1986 లో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖని నిర్వహించిండు. పార్టీలో సీనియర్లు , ప్రధానికి దగ్గరి వాళ్ళు మాత్రమే చేపట్టే ఈ మంత్రిత్వ శాఖని కొద్ది కాలం చేసిన విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులు తీసుకవచ్చిండు. సైద్ధాంతిక విలువల ప్రాతిపదికన ఉన్న విదేశీ సుప్రీం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో దేశ ఆర్థికాభివృద్ధి కోణాన్ని చేర్చిన ఘనత టేకప్ శివశంకర్ కే దక్కుతుంది. గల్ఫ్ దేశాలతో పెట్రోలియం దిగుమతి మినహా ఇతర ఆర్థికాంశాల గురించి భారతదేశం దృష్టి సారించలేక పోవడాన్ని గమనించిన శివశంకర్ లక్షలాది మంది భారతీయులు ఉన్న కరీంనగర్ గల్ఫ్ ఎడారులలో మన వాళ్ళకు మన బీడీలు అమ్మరాదా? అంటూ జలాల్ దౌత్యవేత్తలను ప్రశ్నించారు. 1986 లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటుగా అదనంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా ఆయన వద్ద కుమారుడు ఉండడముతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణావకాశం లభించింది. గల్ఫ్ దేశాల్లోని భారతీయుల సంక్షేమానికి కూడా ఆయన కృషి చేశారు.గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవం , రాజు సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం , స్వయం ఉపాధి కల్పనా దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అప్పట్లో రాష్ట్ర పరిశ్రమల మండలి ఆధ్వర్యంలో ఒక సలహా కేంద్రాన్ని ఏకంగా గల్ఫ్ లో నెలకొల్పారు. ఉపాధి మోసాలను అరికట్టడానికి గాను న్యాయశాస్త్రములో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇమ్మిగ్రేషన్ చట్టములో అనేక సవరణలను ఆయన చేయించడము జరిగింది. సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాలు కాశ్మీర్ విషయములో పాకిస్తాన్ పట్ల సానుభూతిగా ఉండడాన్ని గమనించిన శివశంకర్ కాశ్మీరీ నేత ఫరూఖ్ తను అబ్దుల్లాని భారతీయ అధికారిక హజ్ బృంద నాయకుడిగా సౌదీ బాధపడేవాడుఅరేబియాకి పంపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దూరదృష్టి కలిగిన శివశంకర్ ప్రధాని దూతగా పాకిస్తాన్ పర్యటనకి వెళ్ళి అక్కడ ఒక సమావేశములో ఉర్దూలో మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని విన్న పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జిజియా ఉల్ హక్ తాను శివశంకర్ తరహా అనర్హళమైన ఉర్దూలో మాట్లాడలేనంటూ చెప్పారు. భారత దేశానికి చెందిన ఒక అతి పెద్ద వ్యాపార సంస్థకు గల్ఫ్ లో ఒక ప్రత్యేక గెస్ట్ హౌస్ ఉంది. అందులో ముఖ్యమంత్రులు , కేంద్రమంత్రులకు కూడా ఆతిథ్యమివ్వరు. అయితే ఒకప్పుడు రైల్వే ప్లాటుఫారంపై పడుకున్న శివశంకర్ ని ఆ సంస్థ వారు ప్రత్యేక అతిథిగా ఆదరిస్తారంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనమే కారణం. ఒక విజయవంతమైన న్యాయవాది నుండి దేశం రాజకీయాలలో ఒక నిపుణుడైన ట్రబుల్ షూటర్ గా , సంధానకర్తగా శివశంకర్ మారిండు. 1981లో రవి - బియాస్ జలాల పంపకం ఒప్పందంపై పంజాబ్ , రాజస్థాన్ , హర్యానా ముఖ్యమంత్రులని పట్టుదలతో చాకచ కులు క్యంగా ఒప్పించిండు. ఆ విషయాన్ని అప్పటి బ్యూరోక్రాట్స్ ఇలా చెప్పిండ్రు. " అతని వారిని ఒక్కొక్కరిగా టాకిల్ చేయాలని నిర్ణయించుకోని చివరకు విజయవంతం అయిండు”. న శివశంకర్ లక్షలాది మంది భారతీయులు ఉన్న పెద్ద వ్యాపార సంస్థ కేంద్రమంత్రులకు కూడా ఆకరని ఆ సంస్థ వారు 1987-88 లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేసిండు. అపుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిభని గుర్తించి తనకి అసిస్టెంట్ మెంబర్ గా చేసిండు. శివశంకర్ తరచుగా ఇతర మంత్రిత్వ శాఖల పనులు కూడా చేసేవాడు. 1983లో కాశ్మీర్ ముఖ్యమంత్రి పరూఖ్ అబ్దుల్లా తో కేంద్ర ప్రభుత్వానికి ఘర్షణ వాతావరణం ఏర్పడినపుడు కేంద్ర హోం మంత్రి పీసీ. సేథి ఉత్తర ప్రత్యుత్తరాలని (లెడ్ లాడెన్ లెటర్స్ ) తనే స్వయంగా తయారు చేసిండు. 1989 లో రాజ్యసభ నాయకుడిగా , 19991 లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిండు. దళితుల అభ్యున్నతి కోసం : మనం శక్తివంతులమైతే , మనం సమర్థులమే ఐతే , మన అవసరమే ఉంటే మన యజమాని ఐనా , శత్రువైన సరే మన న్యాయమైన , విలువైన అభిప్రాయాలకి అనివార్యంగా విలువిస్తాడనేది , తలొగ్గుతాడనేది శివశంకర్ జీవితాన్ని చూస్తే అర్థమవుతది. శివశంకర్ జీవితాంతం అంబేడ్కర్ , ఫూలే కాన్సెప్ట్ మీద పని చేసిండు. జ్యుడీషియల్ తో సహ అన్నీ రంగాల్లో దళితులకి ప్రాతినిధ్యం ఉండాలని శివశంకర్ కోరుకునేవాడు. దళితుడైన జస్టిస్ రామస్వామిని సుప్రీం కోర్ట్ జడ్జ్ గా యాలనే విషయాన్ని శివశంకర్ అధికారికంగా టేకప్ చేసిండు. ఎస్సీ ఎస్టీ లకి ఉద్యోగాలల్లో ప్రమోషన్స్ ఉండాలనే ప్రతిపాదనకి బలమైన మద్దతుదారునిగా నిలిచిండు. ఎక్కడనైనా అంబేడ్కర్ విగ్రహాలు పెట్టడాన్ని ప్రోత్సాహించేవాడు. సంగారెడ్డి, కరీంనగర్ లాంటి పట్టణాలలో అంబేడ్కర్ విగ్రహాలని ఆవిష్కరించిండు. జలాల్ పూర్ లాంటి నిజామాబాద్ జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ లకి వెళ్ళి మాట్లాడేవాడు. తన కుమారుడు సుధీర్ కుమార్ మలక్ పేట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నపుడు ప్రస్తుత ఎల్.బీ. నగర్ సెంటర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నపుడు దళిత ఉద్యమ నేత జే.బీ. రాజు గారి సూచన మేరకు శివశంకర్ తన కొడుకుని సెంటర్ లో అంబేడ్కర్ విగ్రహం , కొంచెం దూరంగా రాజీవ్ విగ్రహం పెట్టించేలా ఒప్పించిండు. ఆ చర్య ఆ ప్రాంతంలో అనేక సామాజిక మార్పులకు, నిర్మాణాలకు దోహదం చేసింది. జే. బీ.రాజు మాటల్లో " శివశంకర్ ఎపుడు అంబేడ్కర్ , దళిత సంఘాలలో అసోసియేట్ మెంబర్ గానే మెదలేవాడు .” మహిళా అభ్యున్నతవాది: పుంజాల శివశంకర్ తన బార్యని ఎల్.ఎల్.బీ., ఎంబీయే. , పీహెచీ డబుల్ డిలిట్ చదివేళా ప్రోత్సాహమించడమే కాదు. తను బయటకొచ్చి ఉద్యోగం చేయలేకపోయిందని ఎప్పటికీ బాధపడేవాడు. జూన్ 27 ,2015 హెచ్ఎంటీవి అవని కార్యక్రమములో ఆమె మాట్లాడుతూ " నువ్వు చదువుకుని నాతోపాటు కోర్ట్ కి వస్తావనుకున్నాను. ఇలా వంటింటిలో ఉంటావనుకోలేదు” అనే మాటలు మాత్రమే వాళ్ళ వైవాహిక జీవితములో ఘర్షణ పడిన సంధార్బాలు అని చెప్పింది. మహిళా బిల్లు లో ఎస్సీ,ఎస్టీ ,బీసీ మహిళలకు కోట ఇచ్చేంత వరకు ప్రతిపాదించిన స్థితిలో అంగీకరించేది లేదని కాంగ్రెస్ పార్టీలో వాదించి వెనుకడుగు వేసేలా ఒప్పించిండు. బీసీ రిజర్వేషనుల సాధకుడు - బీసీల వర్గీకరణకూ మూలపురుషుడు : మన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటూ బ్యానర్లలో , టీవీ ప్రకటనల్లో , ఎన్నికల ప్రచారంలో ఊకదం పుడు ప్రచారం చేసుకుంటారు. ఎన్నికల్లో గెలిచి అధికార ఫలాలను అనుభవిస్తారు కాని బిసిలకు మాత్రం మొండిచేయి చూపుతారు. కాని బీసీల మద్దతుతో గెలిచి తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన నాయ కులు చాల తక్కువ మంది కనిపిస్తారు. (మిగతా రేపటి సంచికలో)
ఇట్యాల వెంకటకిషన్ శాక్య 9908198484