యువ తీరాల ఆశా కెరటం

 



సంధ్య నందికోళ్ళ


" టెక్నికల్ విద్యార్థిగా ఉద్యోగిగా తను ఎదుర్కొన్న సమస్యల పట్ల అవగాహనతో, చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని నూతన ఆవిష్కరణ లకు పేటెంట్ రైట్స్ ద్వారా సరయిన మద్దతుగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. స్వయంగా ఆమె చేసిన రెండు పరిశోధనలకు పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి పరిశోధనలకు పేటెంట్ రైట్స్ ఎలా పొందాలో అవగాహన కలిగిస్తున్నారు


దేశాభివృద్ధికి, దేశ ఆర్ధిక స్వావలంబనకు యువత అతి పెద్ద వనరు. అటువంటి యవత తమ చదువుల పట్ల, భవిష్యత్తు పట్ల బాధ్యతతో ప్రవర్తించడం దేశానికే కాక వారి వ్యక్తిగత జీవితాలకు శ్రేయోదాయకం. విశాఖపట్నంకు చెందిన సంధ్య నందికోళ్ళ సరిగ్గా అటువంటి నవీన భావలు కల యువతి బి.టెక్ (మెకానికల్) , చదివారు, పేటెంట్ ఇంజనీరుగా పూణేలో పని చేసారు, తన ఉద్యోగం జీతం సుఖవంతమైన జీవితం తన ఉద్యోగం జీతం సుఖవంతమైన జీవితం ఇవేవి సంతృప్తిని యివ్వలేదు. అందుకే యింకా యేదో చేయాలని భావించారు. టెక్నికల్ విద్యార్థిగా ఉద్యోగిగా తను ఎదుర్కొన్న ఉద్యోగిగా తను ఎదుర్కొన్న సమస్యల పట్ల అవగాహనతో, చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని నూతన ఆవిష్కరణ లకు పేటెంట్ రైట్స్ ద్వారా సరయిన మద్దతుగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. స్వయంగా ఆమె చేసిన రెండు పరిశోధనలకు పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు వారి పరిశోధనలకు పేటెంట్ రైట్స్ ఎలా పొందాలో అవగాహన కలిగిస్తున్నారు. మన దేశ యువత కనిపెట్టే నూతన ఆవిష్కరణలకు సరైన మద్దతు లభించక నిరాశతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలు విద్యా సంస్థలు ఈ దిశగా ఆలోచించాలని అందుకు కావలసిన ప్రోత్సాహాన్ని తోడ్పాటును అందించాలని తద్వారా కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకాలని సంధ్య నందికోళ్ళ అన్నారు. పలకాలని సంధ్య నందికోళ్ళ అన్నారు. చిన్నప్పటి నుండి చురుకైన విద్యార్ధిగా చదువులో ముందున్నారు. అమ్మ రేణుక రిటైర్డ్ సూపరింటెండెంట్ MPDO, నాన్న కైలాసపతి రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్, ఆంధ్రా యూని వర్సిటీ. ప్రముఖ విద్యా సంస్థ, విశాఖపట్నం జవహర్ నవోదయ విద్యాలయం (కొమ్మాది) లో ఆరవ తరగతి నుండీ ఇంటర్మీడియట్, ఎం. బై.పి.సి చదివి, VITAM, పార్వతీపురంలో B.Tech(మెకానికల్), M.Tech(మెషీన్ డిజైనింగ్) ఆంధ్ర యూనివర్శిటీలో పూర్తిచేశారు. MTech తరువాత పేటెంట్ రైట్స్ లో ఎక్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెంగళూరులో చేశారు తదుపరి పేటెంట్ ఇంజనీరుగా కెరీర్ మొదలు పెట్టి ఇన్వెంటర్ గా విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ సేఫ్టీ ప్రోడక్ట్ డెవెలప్ చేస్తున్నారు. అలాగే సామాజిక అసమానతల పట్ల తనవంతు బాధ్యతగా పోరాడటానికి ఒక వేదిక అవసరతను గుర్తెరిగి డా"కె. శివభాగ్యారావు సారధ్యంలో వస్తున్న అంబేద్కర్ టీవి - మాస్టర్ కీ. ఛానల్ కు డైరెక్టర్ గా బాధ్యత నిర్వహిస్తూ అణగారిన వర్గాల హక్కుల కోసం తన గొంతును వినిపిస్తున్నారు. అదే విధంగా వోట్ ఫర్ పీపుల్స్ డిమాండ్ JAC కన్వీనర్‌గా వుంటూ, మహిళల భద్రతా, ఆత్మగౌరవం నినాదాలతో మహిళల పై సామూహిక అత్యాచారాలు జరుగు తున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు నిందితులపై కఠిన శిక్షలు అమలుచేయాలనే డిమాండ్ లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ (APPPA) వ్యవస్థాపక అధ్యక్షులు పిల్లా చంద్రంతోనూ ప్రముఖ సైకాలజిస్ట్ డా”ప్రత్యూష సుబ్బారావుతో కలసి విద్యార్థినుల చదువు ఆరోగ్యం వారి హక్కులు పట్ల అవగాహన కలిగించే సదస్సులలో పాల్గొంటూ వారిని జాగరూకతతో నడచుకునేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. APPPA సంస్థ ద్వారా, పిల్లలకు హేతుబద్ధమైన ఆలోచన విధానం ప్రశ్నించే లక్షణాలను పెంచుకునేలా, తన వంతు బాధ్యతగా అవగాహన కలిగిస్తున్నారు. మహిళలు ఉన్నత విద్యావంతులైతే తమ పిల్లల చదువులకు దేశ పురోభివృద్ధికి తోడ్పడగలరు. విద్యావంతులైన స్త్రీలు కూడా మూఢనమ్మకాలు అంధ విశ్వాసాలతో తమ మాన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. రాజ్యాంగంలో మహిళలకు పొందుపరిచిన హక్కులు సదుపాయాల పట్ల అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలే కాదు మీడియా కూడా విఫలమయ్యింది. మీడియా అందిస్తున్న వార్తలు, సినిమా టీవీ తమ మాధ్యమాల ద్వారా మహిళను ఒక వ్యాపార వస్తువుగానే ప్రమోట్ చేస్తున్నాయి. వారిని మరింత అభద్రతలోకి నెట్టివేస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది మహనీయులు మహిళలు విద్యా సామాజిక రంగాలలో అభివృద్ధి సాధించడానికి విశేష క చేసారు. అటువంటి వారిలో క్రాంతి జ్యోతి అమ్మ సావిత్రీబాయి ఫూలే త్యాగం మరువలేనిది ఆరోజు సావిత్రీబాయి ఫూలే జ్యోతిబా ఫూలేల త్యాగఫలాలే నేడు మనం అనుభవిస్తున్నది. అదేవిధంగా ఈదేశ పౌరులందరికీ సమాన హక్కుల కోసం నిరంతరం కృషి సల్సిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విజయం వెనుక అమ్మ రమాబాయి త్యాగనిరతిని మనం కొనియాడ వలసినదే వారు వేసిన బాటలో ముందుకు కొనసాగడమే మనం ఆ త్యాగ మూర్తులకు యివ్వగలిగే నిజమైన నివాళి. నేడు అమ్మ రమా బాయి అంబేద్కర్ జన్మదినం సందర్భంగా త్యాగమూర్తులైన స్త్రీ జాతికి సంధ్య నందికోళ్ళ తన హృదయపూర్వక జైభీములు తెలియజేసారు. -


యోహాన్ నాస్తిక్ 8919820678-హైదరాబాద్.