(నిన్నటి సంచిక తరువాయి) ఆలా బీసీల అభివృద్ధికి తోడ్పడిన వాళ్లలో పుంజాల శివ శంకర్ మొదటి వరుసలో ఉంటారు. 1972లో ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన తరగతులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత అనంతరామన్ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ బీసీ కులాలకు 30% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. దీనిపై ఏపీ హైకోర్టులో 110 రిట్ పిటిషన్లు దాఖలయ్యా యి, అప్పుడు బీసీలకు 30% రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వగా... అప్పటి సజీూజ% తరపున శివశంకర్ సొంత ఖర్చుతో 18 నెలలు ఢిల్లీలో ఉండి సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్లను గెలిపించుకొని వచ్చారు. భావి తరాలకు చెదరని బహుమతి నిచ్చారు. ఆ తర్వాత కొందరి కుట్రతో ప్రస్తుత బీసీ %--%బీ మరియు బీసీ %-- Hడీ ల లోని కొన్ని కులాలను బిసి ల జాబితా నుంచి తీసివేసి మళ్ళి ఓసీల్లో చేర్చారు. దీనితో మళ్ళి ఆ కులాలను బీసీల్లో చేర్చటం పై న్యాయస్థానంలో ఎనలేని పోరాటం చేసి విజయం సాధించాడు. సుప్రీంకోర్టులో శివశంకర్ పోరాటంతో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విధానం ఏర్పడింది. ఆ విధానమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో కొనసాగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా జస్టీస్ బీ. రోహిణి కమిటీని నియమించింది. ఆ కమిటి సిఫార్స్ మేరకు జాతీయ స్థాయిలో ఓబీసీ ల వర్గీకరణకి నిర్ణయం తీసుకోనుంది. రాజకీయాల్లో తెలంగాణ ఏర్పాటు సమయములో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ విధంగానైతే ఆంధ్రావాళ్ళ రిపోర్ట్ ల తయారీలో సహాయం చేసిండో , అదే విధంగా జనతా ప్రభుత్వ పాలనలో వీ.పీ. సింగ్ కి మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేయడానికి తీసుకునే నిర్ణయాలలో , డ్రాఫ్టింగ్ లో కాంగ్రేస్ పార్టీలో ఉండి కూడా శివశంకర్ పాల్గొన్నాడు. అది శివశంకర్ గారి స్వతంత్ర వ్యక్తిత్వం మరియు సామాజిక న్యాయం పట్ల నిబద్ధత, శివశంకర్ తో కలిసి పని చేసిన ఒక సివిల్ సర్వెంట్ ఇలా గుర్తు చేసుకుంటాడు. “ చాలా సందర్భాలలో కేబినేట్ సెక్రెటరీ, హోం సెక్రటరీ మరియు అతని కార్యాలయంలో ఉన్న ఇతర సీనియర్ అధికారులు శివశంకర్ నుండి డిక్టేషన్ తీసుకుంటారు " . ఈ మాట శివశంకర్ ని ప్రపంచ మేధావులలో ఒకడిగా , గొప్ప రాజ్యాంగ నిపుడిపుడిగా ( గ్రేట్ కాన్స్యూషనిస్ట్ ) గా నిలబెడుతుంది. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాధినేతగా ప్రధాని వీపీ సింగ్ ఆగష్ట 7, 1990 న చరిత్రాత్మకమైన మండల్ కమీషన్ నివేదికలోని 40 సిఫార్సులలో ఒక సిఫార్సులోని పాక్షికమైన (సగం ) సిఫార్సును అమలుపరుస్తూ " కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు " ప్రకటించగానే అదే రోజు శివశంకర్ " అసలు చదువులో ఒబీసీలకి రిజర్వేషన్స్ లేనిది వాళ్ళు ఉద్యోగాల వరకి ఎలా వెళ్ళగలరు? " అని పార్లమెంట్ లో ప్రశ్నించిండు. ఆ ప్రశ్నే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారములోకి రాగానే 2008లో ఒబీసీలకి ఐఐఎం , ఐఐటీ లాంటి కేంద్రీయ విద్యా సంస్థలలో 27% రిజర్వేషన్ కల్పించడానికి పునాది వేసింది. ఈ నిర్ణయం తీసుకోవడంలో జరిగిన 15 సంవత్సరాల ఆలస్యం ఇప్పటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలు 9 % దాటలేదు. 1983 లో అప్పటి బీసీ నాయకులైన కొండ లక్ష్మన్ బాపూజీ , సర్దార్ గౌతు లచ్చన్న మరియు ృత్యకారిణిచక్రపాణి లాంటి పెద్దలందరిని సమైక్యపరచి తిరుపతిలో బీసీల సర్వసభ్య నాల స్వభ్య సమావేశం ని ఏర్పాటు చేయించిండు. కాని నేతల మధ్య సయోధ్య కుదరలేదు. ఎన్టీఆర్ హవా ఉన్న సమయములో బీసీ నినాధాన్ని సనాధాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఒక ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని భావించిండు. 2004 లో కాంగ్రేన్ కి రాజీనామా చేసినంక తెలంగాణాలో బండారు దత్తాత్రేయ , దేవేందర్ గౌడ్ లాంటి బీసీ లీడర్ లను కలిసి అనేక చర్చలు చేసిండు. ఆ ప్రయత్నాలే చివరకు చిరంజీవి ' ప్రజారాజ్యం పార్టీ స్థాపనకు దారి తీసినయి. కింది స్థాయి నుంచి ఎదిగి నాయకులూ అయ్యే వారు చాల మంది ఉంటారు ,కాని ఒక బలహీన వర్గాల కుటుంబంలో అది కూడా ఒక పేద కుటుంబంలో పుట్టి దేశ రాజకీయలను రెండు దశాబ్దాల పాటు శాసించే స్థాయికి ఎదగటం అంటే మాములు విషయం కాదు . అది కూడా ఇందిరా గాంధీ లాంటి శక్తిశాలికి కుడి భుజంలాగా ఉండటం అంటే అంత సులువు కాదు. ఇందిరా , రాజీవుల ఇండ్లకి పక్కనే ఎప్పటికీ శివశంకర్ ఇల్లు ఉండేది. అతనెప్పుడు మీడియాలో కనిపించేవాడు కాదు ఎక్కువ. ఎక్కువగా వేదికలపై మాట్లాడేవాడు కాదు. కానీ తన పని విధానమే తన బలమెంతో, స్థాయి ఏంటో తెలియజేసేది. దానితో పాటు తాను బలహీన వర్గాల మనిషినని మర్చిపోకుండా బలహీనవర్గాల కోసం తీవ్రంగా పోరాడి, ఎంతో మంది అగ్రకుల ముఖ్యమంత్రులు కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నిలిచి బీసీలకు రిజర్వేషన్లు సాధించిన ఘనుడు పుంజాల శివ శంకర్ గారు. 1998 సాధారణ ఎన్నికలలో, పి. శివ్ శంకర్ ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి నియోజకవర్గం నుండి ఎన్నికలలో ఆ పోటీ చేశాడు. అతను తెలుగుదేశం పార్టీకి చెందిన సినీ నటి శారదా పై గెలిచి లోక్సభకు ఎన్నికయ్యారు. శివశంకర్ కుటుంబం కూడా అతని వలె వారి వారి రంగాల్లో నిష్ణాతులై ఉండి కూడా నిగర్వంగా కాపుధనపు రీతిలో చాలా తక్కువ ప్రొఫ్కెల్ మైంటన్ చేస్తూ ఉంటారు. శివశంకర్ రాజకీయాల్లో ఉంటూ తన కుటుంబానికి విలువలే తప్ప పెద్దగా ఆస్తిని ఇవ్వలేకపోయిండు. శివశంకర్ భార్య లక్ష్మీ బాయి 85 సంవత్సరాల వయస్సులో ఆమె డబుల్ %ణ.శ్రీ% చేసింది. శివ్ శంకర్ చిన్న కుమారుడు పి.సుధీర్ కుమార్ మలక్ పేట్ నుండి 1994 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మాస్ లీడర్ గా పేరు పొందిన సుధీర్ కుమార్ రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కి ఒక చార్మ్ ని తీసుకొచ్చిండు. 1989 ఎన్నికలలో యువజన కాంగ్రెస్ తరపున తన టీమ్ గా 50 మందికి టికెట్స్ ఇప్పించుకొంటే 38 మంది గెలిచిండ్రు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టీ.ఆర్ . కి హడలు పుట్టించిన సుధీర్ కుమార్ అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్. అతను దురద ృష్టవశాత్తూ అకాల మరణం చెందిండు. శివశంకర్ గారి పెద్దకొడుకు డాక్టర్ పీ. వినయ్ కుమార్ దేశంలో ఒక ప్రముఖ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జన్ మరియు సామాజిక ఉద్యమ నాయకుడు. వినయ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధికారికమైన రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీమ్ కోర్ట్ లో రిట్ వేసి గెలిచి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. స్థానిక సంస్థలల్లో బీసీ లకు రిజర్వేషన్ కల్పిస్తూ వేసిన రిట్ వినయ్ గారి పేరిటే ఉంది. ఈ కేసు గెలవటం వలన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహ భాగం నాయకులు బీసీలే ఉన్నారు. 2019 లో సుప్రీం కోర్ట్ తీర్పుని అనుసరించి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్స్ 25% కి తగ్గిస్తూ ఆర్డినెన్స్ ద్వారా తీసుకున్న నిర్ణయంతో ఈసారి మల్లీ బీసీల ప్రాతినిధ్యం తగ్గింది. పుంజాల వినయ్ ప్రజారాజ్యం పార్టీలో చాల చురుకు గా ఉండి పార్టీ పేరు ఎన్నికల గుర్తు రావటంలో కీలక పాత్ర వహించాడు. శివ శంకర్ గారి పెద్ద కోడలు అలేఖ్య పుంజాల దేశంలోని ప్రసిద్ధి గాంచిన కూచిపూడి న ృత్యకారిణి. ప్రస్తుతం ఆమె తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా కొనసాగుతుంది. ఈమెకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. శివశంకర్ గారు సంగీత వెంకట రెడి, వంగవీటి మోహన రంగా, కన్నా లక్ష్మి నారాయణ, షబ్బీర్ అలీ, ముఖేష్ గౌడ్, సి. రామచంద్రయ్య , కే. కేశవరావు , జక్కంపూడి రామ్మోహన్ , ధర్మాన ప్రసాద రావు మరియు అనేక మందికి రాజకీయ జీవితం ఇచ్చిండు. ఆంధ్రకాపు వంగవీటి మోహన రంగాకి అన్ని రకాల అండదండగా నిలిచిండు. అతనిని హత్య చేసేందుకు జరుగుతున్న కుట్రని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న శివశంకర్ వెంటనే దీక్ష శిబిరాన్ని వదిలి పెట్టి డిల్లీకి రమ్మని పిలిచిండు. కానీ రంగ పట్టించుకోకపోవడంతో ఆ తరువాత రోజే హత్య చేయబడ్డడు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మరియు యాబై ఏండ్ల అగ్రవర్ణ పాలనపై ప్రజలు విసిగిపోయారని , ఇకనైనా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనీ 2002 చివరలో వరంగల్ లో శ్రీమతి సోనియాగాంధీ గారిని పిలిపించి పెద్ద ఎత్తున కాంగ్రేస్ - బీసీల మహాసభని నిర్వహించిండు. ఇది కనివిని ఎరుగని రీతిలో సక్సెస్ అయింది. అదే వేదికపై కూర్చున్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి బీసీల సభ కాబట్టి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వబడలేదు. ఆ చైతన్యాన్ని చూసి శివశంకర్ గారు వచ్చే ఎన్నికలలో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడే అవకాశం ఉందని గ్రహించిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పార్టీలో పట్టు కోసం 2003 లో పాదయాత్ర మొదలు పెట్టిండు. రెడ్డీ లాబీయింగ్ తో అధిష్టానం వద్ద పట్టు సంపాదించి రాష్ట్రంలో తనకు పోటీ ఉండకూడదని శివశంకర్ వయసులో పెద్దవాడని, రాష్ట్రంలో అప్పటి టికెట్ ల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నిస్తున్న శివశంకర్ గారిని అధిష్టానం దగ్గర తప్పుగా సృష్టించి చివరకు 2004 లో పుంజాల శివశంకర్ కు టిక్కెట్ కూడా రాకుండా అడ్డుకున్నడు . ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటుందని విమర్శిస్తూ తాను 30 ఏండ్లు కాపాడిన కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగాడు శివశంకర్ . అతని రాజీనామా లేదా అతని చేసిన ఆరోపణలకు పార్టీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. 1991 లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల పట్ల అపార అనుభవం, దేశ అభివృద్ధి పట్ల నిబద్ధత కల్గిన,ఇందిరాగాంధి మరియు రాజీవు గాంధీలకు అత్యంత పాలన విషయములో అత్యంత సన్నిహితుడైన పుంజాల శివశంకర్ దేశ ప్రధాని కావల్సి ఉండే కానీ ఒక బీసీ వ్యక్తి కావడమే పుంజాల శివశంకర్ కి అనర్హత అయ్యింది. బ్రాహ్మనుడైన పీ.వీ. నర్సింహ్మారావు ఆ స్థానములో కూర్చున్నాడు. పుంజాల శివశంకర్ దేశ ప్రధాని అయితే 1991 ఆర్థిక సరళీకరణల బదులు దేశ ముఖ చిత్రం మరోలా ఉండేదేమో ! ఉన్నతమైన నిండైన శిఖరం లాంటి వ్యక్తిత్వం,నిస్వార్థ నిరాడంబర జీవితం, అపార ప్రజ్ఞ , విభిన్న నాయకత్వ లక్షణాలు కల్గిన శివశంకర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండడము తమకి శ్రేయస్కరం కాదని భావించిన అగ్రవర్ణాలు భౌగోళికంగా జిల్లా స్థాయిలో లో ఉండే సిక్కిం , కేరళ లాంటి చిన్న రాష్ట్రాలకి 1994 నుండి 1995 వరకు సిక్కిం గవర్నర్ గా మరియు 1995 నుంచి 1996 వరకు కేరళ గవర్నర్ గా పంపించాయి . 2008 లో, అతను తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి కి వెన్నుదన్నుగా ఉండి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు. చిరంజీవికి నైతికంగా వెనక ఉండి తెలుగు సమాజములో సామాజిక న్యాయము , మహాత్మా జ్యోతిరావు ఫూలే ని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాల్లో పెద్ద ఎత్తున పరిచయము చేసేలా చేసింది పుంజాల శివశంకర్ గారే . ప్రజారాజ్యం సామాజిక న్యాయం ఐడియాలజీ శివశంకర్ ఇంట్లో పుట్టిందే. కమ్మ , రెడ్డి మీడియా కుయుక్తులు , పార్టీ టికెట్స్ అమ్ముకున్నారనే దుష్ప్రచారం చేసి పార్టీని అబాసుపాలు చేసిండ్రు. (మిగతా రేపటి సంచికలో)
ఇట్యాల వెంకటకిషన్ శాక్య 9908198484