సాక్షుల రక్షణకు పటిష్ట చట్టం

న్యాయ విచారణ ప్రక్రియలో సాక్షి పాత్ర అత్యంత కీలకమైనది. బాధితుడికి న్యాయం జరగాలంటే ముందు సాక్షి ధైర్యంగా వాస్తవాలు వెల్లడించాలి. జరిగింది జరిగినట్లు చెప్పాలి. అలా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏకంగా అతడి ప్రాణానికే ముప్పు కలుగుతోంది. దీంతో నిజం మరుగున పడిపోతోంది. అంతిమంగా న్యాయానికి అన్యాయం జరుగుతోంది. నేర న్యాయవ్యవస్థకు పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సూచన మేరకు సాక్షుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ముసాయిదా పథకాన్ని రూపొందించింది. పార్లమెంట్ చట్టం తీసుకువచ్చే దాకా దీన్ని అమలు చేయాలంటూ ఈ నెల ఆరున సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటనను ప్రత్యక్షంగా చూసి సాక్ష్యం చెప్పడానికి స్వచ్చందంగా గా ముందుకు వచ్చిన సాక్షికి కనీస గౌరవం దక్కడం లేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వాంగ్మూలం ఇవ్వడానికి హాజరైనప్పటికీ, ఏదో ఒక నపటికీ ఏదో ఒక కారణంతో విచారణ తరచూ వాయిదా పడుతోంది. దీంతో అతడు విసిగి వేసారి వెనక్కి పోతున్నాడు. నేరం జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షులు పోలీసుల దర్యాప్తులో సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. పోలీసులకు సీఆర్‌పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) సెక్షన్ 161 కింద ృత్వంలోని వాంగ్మూలం ఇనున్నారు. సాకి వాంగూలం కేసు నిరూపణకు ప్రధానమని నప్పుడు దర్యాప సంసలు అతణ్ని మేజి పేట్ ముందు హాజరుపరచి సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేస్తున్నాయి. ఇక్కడ వరకు ఉత్సాహంగా ముందుకు వచ్చే సాక్షులు, ఆపై న్యాయస్థానాల్లో జరిగే కాలయాపన, ప్రలోభాలు, బెదిరింపులు తదితర కారణాలతో ప్రాసిక్యూషను ప్రతికూల సాక్షిగా మారిపోతున్నారు. చూసింది చూసినట్లు, తెలిసింది తెలిసినట్లు చెప్పలేని పరిస్థితి ప్రస్తుత వ్యవసలో ఉంది. అందుకే కళ్లెదుటే నేరం జరిగినా చూసినవారు నోరు మెదపడం లేదు. ఇలాంటివారు పెద్దసంఖ్యలో ఉన్నారు. సాక్షి ఉద్యోగి ృశ్యమైపోతుండటంతో అయితే సెలవుతోపాటు ఖర్చులు సైతం ఇవ్వాలి. అలాంటిదేమీ జరగడం లేదు. ఖర్చులు ఇవ్వకపోయినా కనీసం అతడి ప్రాణాలకైనా భరోసా ఉంటుందా అంటే అదీ లేదు. సాక్షులు ప్రతికూలంగా మారుతుండటంతో నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో ఎక్కువ శాతం వీగిపోతున్నాయి. న్యాయస్థానాల్లో కేసులు నిర్దిష్టంగా రుజువు కావడం లేదు. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడకపోవడానికి, శిక్ష శాతం తగ్గడానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 42 శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శిక్షలు సుమారు 30 శాతం వరకు ఉంటోంది. సాక్షులు ఎందుకు ప్రతికూలంగా మారుతున్నారన్న అంశంపై రమేశ్ వన్ స్టేట్ ఆఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హరియాణా కేసులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా చర్చించింది . మన దేశంలో సాక్షుల విచారణ బహిరంగంగానే జరుగుతోంది. ృత సీఆర్‌పీసీ సెక్షన్ 327 ప్రకారం న్యాయస్థానంలో బహిరంగంగానే సాక్షుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటున్నాయి. సాక్షుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ 2009లో జస్టిస్ జగన్నాథరావు నేత ృత్వంలోని న్యాయ సంఘం 198వ నివేదికను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. దర్యాప్తు నుంచి కేసుల విచారణ పూర్తయ్యే దాకా ప్రతి దశలోనూ సాక్షికి రక్షణ అవసరమని సూచించింది. బడా బాబుల పాత్ర ఉన్న నేరాల్లో సాక్షులను గుర్తించినట్లయితే వారి ప్రాణాలను తీయడానికి సైతం వెనకాడటం లేదు. మధ్యప్రదేశ్ లో 'వ్యాపం' కుంభకోణం కేసులో దాదాపు 25 మంది సాక్షులు చనిపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మతగురువు ఆశారాం బాపుపై అత్యాచారం కేసులో సాక్షులపై దాడులు జరిగాయి. యాసితో, కత్తులతో దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొంతమంది సాక్షులు అద ృశ్యమైపోతుండటంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా డిసెంబరు మొదటి వారంలో సాక్షుల రక్షణ ముసాయిదా పథకాన్ని సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించింది. పార్లమెంట్ చట్టం తీసుకువచ్చేదాకా దీన్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. క్రిమినల్ కేసుల్లో సాక్షుల ప్రాధాన్యాన్ని పలు దేశాలు గుర్తించాయి. వారి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావడంతో పాటు వ్యవస్థలనూ ఏర్పాటు చేశాయి. విదేశాల్లో కేసు తీవ్రత ఆధారంగా సంబధిత సాక్షికి రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. పేరు, చిరునామాలు మార్చి అవసరమైతే అతడికి కొత్తగా గుర్తింపు కార్డులు సైతం జారీ చేస్తుంటాయి. బ్రిటన్లో 'యూకే ప్రొటెక్టెడ్ పర్సన్స్ సర్వీస్' కింద రక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా ఉంటాయి. అమెరికాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ (వ్యవస్థీక ృత నేరాల నియంత్రణ) చట్టం కింద రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. కెనడాలో విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం యాక్ట్ (సాక్షుల రక్షణ చట్టం) ఉంది. హాంగ్ కాంగ్, ఐర్లాండ్ తోపాటు ఇజ్రాయెల్ లోనూ 2008 నుంచి సాక్షుల రక్షణ చట్టం అమలులో ఉంది. మన దేశంలో సాక్షులకు సంబంధించిన ప్రత్యేకంగా చట్టాలు ఏమీ లేవు. 1985లో వచ్చిన టాడా చట్టంలో, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం చట్టాల్లో సాక్షి కోరితే అతడి గుర్తింపును రహస్యంగా ఉంచవచ్చు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ఉంటుంది. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం లైంగిక నేరాల్లో సాక్షుల గుర్తింపును వెల్లడించరు.సాక్షుల రక్షణపై గతంలోనూ సుప్రీంకోర్టు విస్పష్టంగా స్పందించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ వర్సెస్ గుజరాత్, పీయూసీఎల్ వర్సెస్ కేంద్రం, జహీరా హబీబుల్లా వర్సెస్ గుజరాత్, ప్రేమ్ చంద్ వర్సెస్ దిల్లీ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.