కరోనా వైరకు ఆవు పేడ వాడండి ,మూత్రం తాగండి , లేదా యోగ చేస్తే నివారణ అంటూ ఒకటే గోల చేసే బదులు . ప్రపంచంలో భారతదేశం సైన్స్ టెక్నాలజీ లో అన్ని దేశాలకన్నా ముందే ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ డాక్టర్లు , ఇతర దేశాలలో స్థిరపడిన మన భారతీయ సంపతి బిడ్డలు ఈ కరోనా వైరస్ కు ఒక మందు కనిపెట్టి ప్రపంచానికి తిరుగులేని , ఎదురులేని భారతదేశం అని నిరూపించవచ్చుకదా. ఇలా మూడ ప్రకటనలతో , మూడ నమ్మకాలతో ఇంకా ప్రజల్ని మభ్యపెడుతు ,మూడ నమ్మకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎంతో మంది ఆ నూనె ఈ నూనే తో మత మందిరాలలో దెయ్యాలను వదిలించడం,కళ్లు తెప్పించడం,ఆఖరికి గర్బిణీ కూడ కాళ్ళతో పొట్టమీద తంతు తెప్పిస్తున్నారే ఈ కరోనా వైరస్ ను ఎగిరి ఒక్క తన్ను తన్ని ఎందుకు ప్రపంచం నుండి తరిమివేయడం లేదు ఈ మత ప్రవక్తలు. అభూతి కల్పనలతో ,మాయ మాటలతో పబ్బం గడపటం కోసం దైవం పేరిట , మతం పేరిట మనుషులను మోస చేస్తు తలరాతను బతుకుతున్నారు. ప్రపంచం ఒక పక్క భయంకరమైన ఈ కరోనా వైరస్ కు వణుకు తుంటుంటే అది తాగండి ఇది ఇది తినండి , ఇది నాకండి అనటం కన్నా ఉపయోగం లేని ' బిగ్ బాస్ 'షోలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ,యాడ్స్ దోచుకునే వాళ్ళు ' కరోనా ఈ వైరస్ కు వ్యాక్సిన్ తయార్ చేయండి. ప్రపంచంకు ఉపయోగపడుతుంది అని ప్రపంచంలో ఉన్న డాక్టర్లు మేధావులు , సైన్టీష్ఠులుకు పిలుపు ఇవ్వకుండా ఎప్పుడూ డబ్బు డబ్బు ఉపయోగం లేని ' బిగ్ బాస్ ' షో లు ఎందుకు. ఒక పక్క కరోనా వైరస్ తో ప్రపంచ ఆర్థిక రంగం కుప్పకూలతుంటే మనం ఇక్కడ ఉపయోగంలేని టీవి షోలు , సినిమాలు అవసరమా ..!? మరో పక్క ఈ మాయమాటలతో బురిడీ మాటలతో భావదాస్య మతవ్యాప్తితో ప్రజలను గొర్రెల్ల తిర్చిదిద్దుతున్నారు. ఇప్పటికైనా ఈ సోల్లు మాటలు ఉపయోగం లేని మాయ మూత్ర మాటలు అపి , ప్రపంచంలో మాకు మించిన డాక్టర్లు లేరు , సైనిష్టులు లేరు అని వీర్యవిగే భారతదేశ మేధావులు , అన్ని మా వేదాలలో ఉన్నాయి అని బొంకె వారు ఈ కరోనా వైరస్ కు మందు కని పెట్టి ప్రపంచాన్ని కాపాడండి మీకు దణ్ణం పెద్దాం.
తంగిరాల సోని
బహుజన రచయితల వేదిక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెల్ : 96 766 09 234